ఏపీ - జపాన్ భాయీభాయీ
posted on Nov 28, 2014 3:40PM
జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆయనతో దాదాపు 15 నిమిషాలపాటు చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు. ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని జపాన్ ప్రధాని ఈ సందర్భంగా చంద్రబాబుకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. జపాన్ ప్రధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని, స్వామివారి శేషవస్త్రాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా జపాన్ ప్రధానమంత్రికి అందించారు. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం.