ఏపీ శాసనసభలో కాగ్ నివేదిక
posted on Mar 26, 2015 11:37AM
గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. కాగ్ నివేదికలోని ముఖ్యాంశాలు
* ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు నిర్ణీత ప్రమాణాలకు లోబడి లేవు
* వైద్యకళాశాలలు, బోధనాస్పత్రులు ప్రమాణాలు పాటించట్లేదు
* మెడికల్ పోస్టులు, పారా మెడికల్ పోస్టులు భారీగా ఖాళీలున్నాయి.
* ఐటీడీఏల్లో 51 శాతం నిధులు మాత్రమే వినియోగించారు.
* ఆర్ధిక రంగంలో 44 శాతం ఖర్చు చేయలేదు.
* సాధారణ రంగంలో 94 శాతం నిధులు ఖర్చు చేయలేదు.
* నీటి పారుదల, రహదారుల విభాగాల్లో పనులు, ప్రాజెక్టుల్లో పురోగతి లేదు.
* ప్రవేటు భాగస్వామ్య లీజు ఒప్పందాల తప్పిదాల వల్ల రూ. 665 కోట్ల నష్టం.
* మోటారు వాహనాలపై పన్ను విధింపు లోపం వల్ల రూ. 460 కోట్ల రాబడి నష్టం.
* గిరిజన ఉప ప్రణాళిక నిధులు 36 శాతమే వినియోగం.