కరోనా వైరస్ కు విరుగుడు ఆ జంతువుల నుండి.. మానవాళికి మరో తీపి కబురు

కరోనా తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. సాధారణంగా మనుషుల్లో ఉండే యాంటీ బాడీస్ ఈ వైరస్ ను అడ్డుకుని ప్రాణహాని లేకుండా చేయగలవు. ఐతే మనలోని యాంటీ బాడీస్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎఫెక్టివ్ గా వైరస్ ను ఎదుర్కోగలవు. ఐతే చాలామందిలో ఈ యాంటీ బాడీస్ చాలా తక్కువగా ఉండడం తో పరిస్థితి విషమిస్తోంది. తాజాగా దీనికి విరుగుడు గా అల్పక అనే జంతువు నుండి సేకరించిన నానో బాడీస్ ను మనుషులలో ప్రవేశ పెడితే అవి కరోనా వైరస్ ను అడ్డుకుంటాయనే వార్త వైరల్ అవుతోంది. తాజాగా దీని పైన రీసెర్చ్ చేసిన దక్షిణ ఆఫ్రికా, స్వీడన్‌ పరిశోధకుల దీనిని ధృవీకరిస్తున్నారు.

అసలు కరోనా వైరస్ ను ల్యాబ్ లో తయారు చేసారా లేక జంతువుల నుండి మనుషులకు సోకిందా అనే విషయం పై ఇంకా క్లారిటీ లేదు. కానీ తాజాగా పరిశోధన ప్రకారం మనుషులను కాపాడేది మాత్రం అల్పక అనే జంతువు అనే తెలుస్తోంది. అల్పకాలు గా పిలిచే ఈ జంతువులు చూడడానికి మన దగ్గర ఉండే మేకలు, ఒంటెలకు దగ్గరగా ఉంటాయి. ప్రస్తుతం ఇవే మనని కాపాడతాయని దక్షిణ ఆఫ్రికా, స్వీడన్‌ సైంటిస్టుల రీసెర్చ్ ద్వారా తెలుస్తోంది. వాటిలోని నానో బాడీస్ మనుషుల్లో ప్రవేశపెట్టగా అవి కరోనా వైరస్ ను అడ్డుకున్నాయని ఆ శాస్త్రవేత్తలు తెలిపారు. ఐతే ఇప్పుడు వీటిలోని యాంటీబాడీస్ సేకరించి మనుషులకు ఇవ్వడానికి మరో రెండు మూడు వారాల వరకు సమయం పట్టవచ్చని వారు తెలియ చేస్తున్నారు. అసలు ఈ యాంటీ బాడీస్ ఎలా పనిచేస్తాయంటే కరోనా వైరస్ కు చుట్టూ ఉన్న ముళ్లలాంటి కొవ్వును ఇవి చుట్టుముట్టి వాటిని కరిగేలా చేస్తాయి. దానితో కరోనా వైరస్ చచ్చిపోతుంది. దానితో కరోనా వైరస్ పీడ కూడా విరగడ అవుతుంది. ఈ దిశగా జర్మనీలో మొదటిసారి ఒక 12 ఏళ్ల వయసున్న అల్పక నుంచి నానోబాడీస్ తీసి ప్రయోగించగా ఫలితం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది. అంతా సవ్యంగా జరిగితే కరోనా వైరస్‌కు ఈ యాంటీబాడీస్ అసలైన వ్యాక్సిన్ అవుతాయని ఆ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఏదేమైనా ఆ దేవుడి దయవల్ల, శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఈ వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వస్తే మనకు ఇంకా కావాల్సిందేముంది.