ఏపీకి తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ కు  మరో  తుపాను ముప్పు పొంచి ఉందన్నవాతావరణ శాఖ హెచ్చరి కలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన కష్టాల నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా తేరుకోకముందే  మరో తుపాను విరుచుకుపడనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జనం బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 16 వరకూ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలకు ఈ వర్షాల వల్ల తీవ్ర నష్టం సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఇటీవల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా.. నదులు, వాంగులువంకలు పొంగిపొర్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాల నుంచి తేరుకోకముందే మరోసారి ఏపీలో భారీ వర్షాలు కురవబోతున్నాయి.