బెజవాడ దుర్గమ్మ తెప్పోత్సవం రద్దు!

కృష్ణా నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం, ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంలో బెజవాడ కనకదుర్గమ్మ జలవిహారాన్ని ప్రభుత్వం రద్దు  చేసింది. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు శనివారం (అక్టోబర్ 12)తో ముగుస్తాయి. ఆ సందర్భంగా దుర్గమ్మవారు హంసవాహనంపై కృష్ణా నదిలో విహరించడం ఆనవాయితీ.

అయితే ఆ జలవిహారాన్ని ప్రభుత్వం నదిలో వరద పోటు కారణంగా రద్దు చేసింది.  ప్రతి ఏటా విజయ దశమి రోజున బెజవాడ కనకదుర్గమ్మను  రాజరాజేశ్వరి దేవిగా  అలంకరించి కృష్ణానదిలో తెప్పోత్సవం, హంసవాహన సేవ నిర్వహిస్తారు. ఈ వేడుక చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. అయితే కృష్ణానదిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో  ఈ ఏడాది తెప్పోత్సవం  రద్దైంది.