పవన్ భద్రాచలం పర్యటన రద్దు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భద్రాచలం ప్రకటన రద్దైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పవన్ కల్యాణ్ శనివారం (ఏప్రిల్ 5)మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో సాయంత్రానికి భద్రాచలం చేరుకోవాల్సి ఉంది.

శ్రీరామనవమి నాడు అంటే ఆదివారం ( ఏప్రిల్ 6) భద్రాద్రి సీతారామ స్వామి కల్యాణానికి హాజరై అదే రోజు సాయంత్రం భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రికి హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన రద్దైంది. ఈ విషయాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీపీ తెలిపారు. ఈ మేరకు సంబంధిత శాఖలకు ఆయన ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందించారు. పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దుకు కారణాలు తెలియాల్సి ఉంది.