బెజవాడ అభివృద్ధి గురించి కేసీఆర్ ఏమన్నారు?

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొక్కులు తీర్చుకోవాలనుకున్న కేసీఆర్, దానిలో భాగంగా గురువారం విజయవాడ వెళ్లి కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించారు.. కేసీఆర్ విజయవాడ పర్యటనలో కొన్ని ఆసక్తిరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి.. కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు వెలిసాయి.. అలానే మంత్రి దేవినేని ఉమ ఎయిర్ పోర్ట్ కి వెళ్లి కేసీఆర్ కి స్వాగతం పలికి, తన కారులోనే దుర్గ గుడికి తీసుకెళ్లారు..

ఈ సందర్బంగా ఉమ, కేసీఆర్ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది.. విజయవాడ గతంతో పోలిస్తే బాగా అభివృద్ధి చెందింది, పచ్చదనం పెరిగింది, రోడ్లు విస్తరించాయి అని కేసీఆర్ అన్నారట.. ఈ ఆనందంలో ఉమ, విభజన సమయం సంగతులు గుర్తుచేశారట.. తెలంగాణ రాష్ట్రం కోసం మీరు దీక్ష చేసారు, సమైక్యాంధ్ర కోసం నేను దీక్ష చేశాను.. మీరు తెలంగాణకు సీఎం అయ్యారు.. నేను ఏపీకి మంత్రి అయ్యాను అని ఉమ సరదాగా కేసీఆర్ తో అన్నారట.. దీనికి బదులుగా కేసీఆర్, అదే ప్రజాస్వామ్య గొప్పతనం అన్నారట.