హైదరాబాద్ ను తలదన్నేలా అమరావతి ఓఆర్ఆర్

ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. అమరావతి చుట్టూ భారీ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రణాళిక మేరకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కంటే పెద్దదిగా ఉంటుంది. మొత్తం 189.9 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూమి సేకరణకు ఇప్పటికే అధికారుల నియామకం పూర్తయ్యింది.  

అమరావతి ఔటర్ రింగు రోడ్డు మొత్తం ఐదు జిల్లాల్లోని   121 గ్రామాల గుండా వెళుతుంది.  గుంటూరు జిల్లాలో.. మంగళగిరి మండలం కాజా, చినకాకాని, గూటూరు, బుడంపాడు, ఏటుకూరు, పొత్తూరు, అంకిరెడ్డిపాలెం, సిరిపురం, వర్గాని, వెలవర్తిపాడు, మేడకొండూరు, డోకిపర్రు, విషాదాల, పేరేచర్ల, మండపాడు, మంగళగిరిపాడు, పాములపాడు, రావెల్, చిలువూరు, ఏమన్ని, చింతలపూడి, పెనుమూలి, కంఠంరాజు కొండూరు,  నంబూరు, అనుమర్లపూడి, దేవరాయబొట్లపాలెం,  కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగలకుదురు, కఠేవరం, సంగం జాగర్లమూడి,  వల్లభాపురం, మున్నంగి, దంట్లూరు, కుంచవరం, అత్తోటగొడవర్రు, నారాకోడూరు, వేజెండ్ల, సుద్దపల్లి, శేకూరు, కొర్నెపాడు, అనంతవర్రపాడు, చామళ్లమూడి, కర్నూలు గుండా అమరావతి ఓఆర్ఆర్ వెడుతుంది. అలాగే పల్నాడు జిల్లా  ముస్సాపురం, పాటిబండ్ల, తాళ్లూరు, లింగగుంట్ల, జలాల్పూరు, కంభంపాడు, కాశిపాడు, ధరణికోట, లింగాపురం, దిడుగు, నెమలికల్లు గ్రామాలు, ఎన్టీఆర్ జిల్లా పొన్నవరం, జగన్నాథపురం, తిమ్మాపురం, గూడెం మాధవరం, జూజూరు, చెన్నారావుపాలెం, అల్లూరు, నరసింహారావు పాలెం, కంచికచెర్ల, మున్నలూరు, మొగులూరు, పేరేకలపాడు, గొట్టుముక్కల, కూణికినపాడు, జి.కొండూరు, దుగ్గిరాలపాడు, పెట్రంపాడు, కుంటముక్కల, గంగినేనిపాలెం, కోడూరు, నందిగామ,  మైలవరం, పొందుగుల, గణపవరం గుండా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెడుతుంది.

ఇక కృష్ణా జిల్లాలొ సగ్గూరు ఆమని, బుతుమిల్లిపాడు, బల్లిపర్రు, బండారుగూడెం, అంపాపురం, పెద్దవూటపల్లి, తేలప్రోలు, వెలినూతల, ఆత్కూరు, పొట్టిపాడు, వెల్దిపాడు, తరిగొప్పుల, బోకినాల, మణికొండ, వేంపాడు, మరిదుమాక, కొణతనపాడు, దావులూరు, కోలవెన్ను, ప్రొద్దుటూరు, చలవేంద్ర పాలెం, నెప్పల్లె, కుందేరు, రొయ్యూరు, ఉత్తర వల్లూరు, చినపులిపాక, బొడ్డెపాడు, దక్షిణ వల్లూరు, ఏలూరు జిల్లా  బొద్దనపల్లె, గరికపాటివారి కండ్రిక, ఆగిరిపల్లి, చొప్పరమెట్ల, పిన్నారెడ్డిపల్లి, నూగొండపల్లి, నర్సింహపాలెం, కృష్ణవరం, సగ్గూరు, సురవరం, కల్లటూరుల గుండా వెడుతుంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu