తన భూమి కోసం ఏడుకొండలవాడి 80 ఏళ్ల న్యాయ పోరాటం

 

 

సాక్షాత్తు ఏడుకొండలవాడికే 80 ఏళ్ళు పట్టింది తన భూమిని దక్కించుకోవడానికి. సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత టిటిడి ఈ భూమి ని దక్కించుకోగలిగింది.వివరాలలోకి వెళితే 1865 లో వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య వంశస్థులకు వేద పఠనం చేసినంత కాలం వారు వినియోగించుకునే కండిషన్ తో టీటీడీ కేటాయించింది. ఐతే  1925 లో అన్నమయ్య వంశస్థులు ఆ సేవలను అందించడం నిలిపి వేశారు, అలాగే ఆ భూమిని కూడా టిటిడికి  వెనక్కు ఇవ్వలేదు. అంతే కాకుండా వారు ఆ భూమిని 1927 లో సుబ్బారెడ్డి, గురువా రెడ్డి అనే వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. ఆ తరువాత గురువా రెడ్డి పేరు మీదే పట్టాలు పొంది వారు దానిని అనుభవిస్తున్నారు. ఐతే 1940 లో టిటిడి దీనికి వ్యతిర్వేకంగా అక్కడి సబ్ కలెక్టర్ ఆశ్రయించడంతో అయన ఆ భూమిని టీటీడీ దేనని తేల్చారు. తరువాతి కాలంలో ఎమ్మెల్యే ఐన గురువారెడ్డి కుటుంబసభ్యులు ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో భూవివాదం అనేక ఏళ్లుగా సాగుతోంది. తాళ్లపాక వంశానికి చెందినవారు సీసీఎల్ ఏ కమిషనర్ ని కలిసి పరిష్కరించాలని కోరటంతో  దీనిపై విచారణ జరిపించాలని చిత్తూరు ఇనామ్స్ డిప్యూటీ తహసీల్దార్ ని కమిషనర్ ఆదేశించారు. దీని పై పూర్తి విచారణ జరిపిన తర్వాత ఆగస్టు 27న చిత్తూరు ఇనామ్స్ డిప్యూటీ తహసీల్దార్ తన తీర్పు ఇచ్చారు. ఆ భూములపై తాళ్లపాక కుటుంబసభ్యులకు కానీ గురువారెడ్డి కుటుంబసభ్యులకు కానీ ఎలాంటి హక్కులు లేవని, ఆ భూములకు నిజమైన ఓనర్ టీటీడీ అని అయన స్పష్టం చేశారు. దీనితో దాదాపు 1000  కోట్ల విలువైన 188 ఎకరాల ఆస్థి మళ్ళీ ఏడుకొండల వాడి సొంతమైంది.