సమంత లవరుడు ఎవరు?

 

సినిమా హీరోయిన్లు రీల్ లైఫ్ లో సినిమాకొక హీరోని మార్చినట్టే రియల్ లైఫ్ లో లవర్స్ ని మార్చేస్తుంటారు. మొన్నటి వరకు సిద్ధార్ధ్ తో ప్రేమాయణం సాగించిన సమంత వాళ్లు ప్రేమలో ఉన్న సంగతి తనే చెప్పింది. వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకూ దారి తీస్తుందనుకున్నాం. కానీ వారి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఈ సంగతి కూడా వారే బహిరంగంగా చెప్పారు. అయితే ఈ అమ్మడు ఒక వ్యాపారితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నట్లు కోలీవుడ్ లో వినిపిస్తున్న లేటెస్ట్, హాటెస్ట్ న్యూస్. అతను చెన్నైకి చెందిన వ్యాపారవేత్తట. ఈమధ్య కథానాయికలు ఎక్కువగా వ్యాపారవేత్తలను ప్రేమించి, పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సమంత కూడా అదే రూట్ లో వెళ్తున్నట్లుంది. చూద్దాం ఈ ప్రేమైనా పెళ్లి పీటలెక్కుతుందో లేక పటాపంచలవుతందో. చాలామంది హీరోయిన్లకు లవరు ఒకరయితే వరుడు మరొకరు అవుతున్నారు. లవరు వరుడయ్యే ఛాన్స్ ఈ మధ్యకాలంలో లేకుండా పోయింది. మరి ఇప్పుడు సమంత లేటెస్ట్ లవరు వరుడిగా మారతాడా... లవరు వరుడు అయ్యి.... ‘లవరుడు’ అవుతాడా... వేచి చూద్దాం.