అస్తమించిన షేర్ ఖాన్
posted on Oct 9, 2013 5:33PM

సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా రియల్ స్టార్ అని పేరుతెచ్చుకున్న ఏకైక నటుడు శ్రీహరి. హీరో, విలన్, కమెడియన్ అనే తేడా లేకుండా అన్ని పాత్రలలో నటించి, ప్రేక్షక మనసు దోచుకున్న నటుడు శ్రీహరి ఇకలేరు. శ్రీహరి గత కొన్ని నెలలుగా క్యాన్సర్ వ్యాధితో భాధ పడుతున్నాడు. అయితే ఈరోజు సాయంత్ర సమయంలో శ్రీహరి లీలావతి హాస్పిటల్(ముంబాయి)లో మృతి చెందారు. ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ కు గురవుతున్నారు. ఉక్కు మనిషిలాగా ఉండే శ్రీహరి ఇలా హఠాత్ మరణంపై ఎవరు కూడా కోలుకొని పరిస్థితుల్లో ఉన్నారు. శ్రీహరి ఒక్క తెలుగులోనే కాకుండా పలు భాషల్లో కూడా తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇటీవలే రామ్ చరణ్ తో కలిసి నటించిన "జంజీర్" చిత్రంతో బాలీవుడ్ లో కూడా నటన పరంగా శ్రీహరికి మంచి స్పందన వచ్చింది. మన అని అనుకున్న మన షేర్ ఖాన్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని అనుకుంటేనే భాదగా ఉంది.
"మగధీర"లో శ్రీహరి చెప్పిన "నువ్వు ఇపుడు అస్తమించవచ్చు. కానీ ఎదో ఒక రోజు ఈ చీకటి కడుపులు చీల్చుకుంటూ మళ్ళీ పుడతవురా..".
శ్రీహరి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ... తెలుగువన్.కామ్