నటుడు మణివన్నన్‌ కన్నుమూత

 

 Actor director Manivannan dead, Actor director Manivannan death,Actor director Manivannan died

 

 

ప్రముఖ దర్శక, నటుడు మణివన్నన్‌ (59) శనివారం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన ఈ రోజు చెన్నైలో మృతి చెందారు. తెలుగులో పలు చిత్రాల్లో మణివన్నన్ హాస్యనటుడుగా, క్యారెక్టర్ నటుడిగా ప్రధాన పాత్రలలో నటించారు. తమిళంలో సుమారు 50 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. మణివన్నన్ మృతికి తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖలు సంతాపం తెలిపారు. సత్యరాజ్‌ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ‘నాగరాజచోళన్‌ ఎంఏ, ఎంఎల్‌ఏ’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్ నటించే ప్రతి సినిమాలో ఆయన ముఖ్యపాత్రలో నటిస్తారు. శంకర్ అర్జున్ ల కాంబినేషన్ లో వచ్చిన ఒకేఒక్కడు సినిమాలో ఆయన ముఖ్యమంత్రి సహాయకుడి పాత్రలో ప్రేక్షకులను అలరించారు.