ఆలీకి బ్రహ్మనందం సత్కారం

 

Brahmanandam felicitates Ali, Ali Brahmanandam

 

 

టాలీవుడ్ స్టార్ కామెడియన్ ఆలీ ఇటీవల డాక్టరేట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో టాలీవుడ్ సీనియర్ హాస్యనటుడు బ్రహ్మానందం తన ఇంట్లో ఆలీ ని సత్కరించారు. తెలుగులోని ఇతర హాస్యనటులు, బ్రహ్మనందం దంపతుల సమక్షంలో ఈ సత్కారం జరిగింది. ''అలీకి గౌరవ డాక్టరేట్ రావడం ఆనందదాయకం, మన పరిశ్రమలో గౌరవ డాక్టరేట్ కు అర్హులైన వారు ఇంకా చాలామంది ఉన్నారు, అలీతో ఆ పరంపర మొదలైందని అనుకుంటున్నాను” అని బ్రహ్మనందం అన్నారు. అలీ నాకు తమ్ముడి లాంటి వాడు, ఇంకా ఇలాంటి పురస్కారాలెన్నో ఆయన అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

 

గౌరవ డాక్టరేట్ రావడం కన్నా ఆ సందర్భంగా తనింట్లో నన్ను మా సీనియర్ బ్రహ్మానందం గారు సత్కరించడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిందని అలీ అన్నారు. 'బ్రహ్మానందం గారికి డాక్టరేట్ వచ్చినప్పుడు నా తర్వాత నీకే వస్తుందిరా అన్నారు. ఆయన మాటలను తథాస్తు దేవతలు విని ఆశీర్వదించినట్లున్నారు. నాకు ఆ గౌరవం దక్కింది' అన్నారు. ఈ కార్యక్రమానికి సునీల్, బ్రహ్మాజీ, కృష్ణభగవాన్, పోసాని, గుండు హనుమంతరావు తదితర సినీనటులు హాజరయ్యారు.