ఆప్ .. గెలవలేదు గెలిపించింది!

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేనున్నానంటూ బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ,ఆశించిన ఫలితాలను అందుకోలేక పోయింది, కానీ, రెండు రాష్ట్రాలలో గెలుపు ఓటములను నిర్ణయించడంలో, చీపురు పార్టీ  కీలక పాత్రను పోషించింది. గుజరాత్’లో బీజేపీకి చారిత్రక విజయాన్ని అందించిన ఆప్, హిమచల్’ ప్రదేశ్’లో కాంగ్రీస్’ను  గట్టేక్కించింది.  అందుకే, దేశ భవిష్యత్ రాజకీయాల్లో ఆప్’ ఫాక్టర్ కీలకంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.వివరాలోకి వెళితే ...

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పాత రికార్డులను చెరిపేశాయి.కొత్త చరిత్రను సృష్టించాయి.ఎప్పుడో 1985లో  మాధవ సింగ్ సోలంకి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, 182 కు 149 స్థానాలు గెలుచుకుని, సృష్టించిన రికార్డును, 2022లో బీజేపీ బద్దలు కొట్టింది. ముందుగానే, ‘గత చరిత్రను తిరగరాస్తాం.. కొత్త చరిత్రను సృష్టిస్తాం’ అని ‘ఆత్మ’ విశ్వాస ప్రకటన చేసిన కమల దళం, అన్నంత పని చేసింది. సోలంకీ రికార్డును బద్దలు కొట్టింది. అదే 182 స్థానాల్లో 52 శాతానికి పైగా ఓట్లతో 156 స్థానాలు సొంతం చేసుకుంది.నిజంగా ఇది అద్భుత విజయం. అపూర్వ విజయం. అవును.  రెండున్నర దశాబ్దాలకు పైగా అధికారంలో కొనసాగడం ఒక చరిత్ర అయితే, అంత సుదీర్ఘ పాలన తర్వాత పాత రికార్డులు చెరిపేస్తూ, చరిత్రను తిరగరాయడం, మరో చరిత్ర. అందులో సందేహం లేదు.
అయితే ఇది నాణ్యానికి ఒక వైపు మాత్రమే. మరో వైపు చూస్తే, ఈ గెలుపును ప్రభావితం చేసింది, బీజేపీ ప్రభుత్వం అందించిన సుపరిపాలన ఒక్కటే కాదు. అదికూడా ఒక కారణమే కావచ్చును కానీ, అదొక్కటే కారణం కాదు.అలాగే, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా జోడీ, చరిష్మా, వ్యూహ చరుతలతోనే కమల దళం అంతలా వికసించింది అనుకోవడం కూడా కొంత వరకే నిజం. 

నిజానికి, ఒక గుజరాత్ అనే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా, చివరకు ఒక ఉప ఎన్నికలో అయినా, ఏదో ఒక అంశం ఆధారంగానే ప్రజలు తీర్పు ఇస్తారానుకోవదం పొరపాటు. అలా ఏదో ఒక అంశం, ఒక జంట నాయకత్వం ప్రభావంతోనే ఫలితాలు వస్తాయనుకుంటే, హిమాచల్’లో, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, నిన్న మొన్న జరిగిన మన మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఒడి పోయింది? సో.. గుర్తుంచుకోవలసిన విషయం ఏమంటే, ఏదో ఒక కారణంతో, గెలుపు సాధ్యం అవుతుందని అనుకుంటే, అది అయ్యే పని కాదు. 

నిజం. గుజరాత్’లో బీజేపీ విజయానికి వంద కారణాలుంటే,  హిమాచల్ ప్రదేశ్’లో అదే బీజేపీ ఓటమి,కాంగ్రెస్ గెలుపుకు నూటొక్క కారణాలుంటాయి. అయితే, గుజరాత్, హిమాచల్, ఢిల్లీ (ఎంసిడి) ఎన్నికలుమ దేశ రాజకీయాల్లో ఒక కొత్త కోణాన్ని, గెలుపు ఓటములను నిర్ణయించే ఒక కొత్త ఫాక్టర్’ను  ఆవిష్కరించాయి. అదే, ఆప్’ ఫాక్టర్. ఢిల్లీకే పరిమితం అనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ, మెల్ల మెల్లగా దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు  గుజరాత్ ఆ పార్టీ గెలిచింది ఐదు సీట్లే అయినా, 13 శాతం ఓట్లను పట్టుకుపోయింది. ఇప్పటికే, ఢిల్లీ, పంజాబ్’లలో అధికారంలో ఉన్న ఆప్’ గుజరాత్, హిమచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యంగా, గుజరాత్’లో ఆశించిన ఫలితాలు సాధించలేక పోయినా, ఈ ఎన్నికల తర్వాత జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. సో... గెలుపు ఓటములను పక్కన పెడితే,దేశ భవిష్యత్’ రాజకీయాల్లో ఆప్’ ఒక కీలక ఫాక్టర్’గా నిలుస్తుందని అయితే గట్టిగా చెప్పవచ్చుననే మాట అయితే, రాజకీయ చర్చల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.

గుజరాత్ విషయాన్నే తీసుకుంటే, 2017 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే, బీజేపీ ఓటు షేరు పెరిగింది జస్ట్ మూడున్నర శాతమే, కానీ, కాంగ్రెస్ పార్టీ. ఆప్ రంగంలో దిగడం వలన 2017లో పొందిన 41.44 శాతం ఓట్లలో 14 శాతం పట్లు, 60 అసెంబ్లీ సీట్లు కోల్పోయింది.బీజేపీ కేవలం మూడున్నర శాతం ఓటలతోనే 57 స్థానాలు అదనంగా గెలుచుకుంది. 

ఆప్’ ఐదు సీట్లు గెలుచుకున్న గుజరాత్’లోనే కాదు,  ఒక్క సీటూ గెలవని, హిమాచల్ ప్రదేశ్’లోనూ ఆప్  ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసింది. కాంగ్రస్, బీజేపీల మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం చాల స్వల్పం. కాంగ్రెస్ పార్టీకి 43.9 శాతం ఓట్లు పోలయితే, బీజేపీకి 43 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే రెండు పార్టీల మధ్య తేడా ఒక శాతం కంటే తక్కువ  జస్ట్ .9 (పాయింట్.9) శాతం. ఆప్ ఒక్క సీటు గెలుచుకో లేక పోయినా, ఆల్మోస్ట్ అన్ని నియోజక వర్గాల్లో డిపాజిట్ కోల్పోయినా, ఆ పార్టీకి 1.1 ( వన్ పాయింట్ వన్) శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ స్వల్ప తేడాతో, కాంగ్రెస్ 40 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తే, బీజేపే 25 సీట్లకే పరిమితమై అధికారం కోల్పోయింది. 

సో.. ఢిల్లీ, పంజాబ్ వెలుపల ఆప్’ గెలుస్తుందా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, గే;లుపు ఓటములను ప్రభావితం చేయడంలో మాత్రం ఆప్’ ఫాక్టర్ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా, ఇంతవరాకు ద్విముఖ పోటీ ఉన్న చోట, ఆప్’ ఫాక్టర్ పనిచేస్తుంది. స్వల్ప తేడాతో గెలుపు ఓటములను నిరంయైస్తుందని, అందుకే, ఆప్’ ను ఇగ్నోర్ చేయలేమని పరిశీలకు తాజా ఫలితాలను విశ్లేషిస్తున్నారు.