అమీర్ భార్య కిరణ్ రావ్ ది తెలంగాణనా?
posted on Nov 26, 2015 10:35AM

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ దేశ అసహనంపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. తన భార్య కిరణ్ రావు దేశం విడిచి వెళ్లిపోదాం అని తనతో అన్నదని అమీర్ చెప్పడంతో అమీర్ ఖాన్ తో పాటు ఆమె భార్య కిరణ్ రావు కూడా వార్తల్లోకి ఎక్కారు. అంతకుముందు ఎక్కడా పెద్దగా వార్తల్లోకి ఎక్కని కిరణ్ రావు తన భర్త అమీర్ ఖాన్ తో చేసిన వ్యాఖ్యలవల్ల ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిపోదామన్న ప్రతిపాదన తెచ్చిన కిరణ్ రావుది అసలు ఏ దేశమనే విషయంపై ఫోకస్ పెట్టారు. అయితే దీనిలో ఆసక్తికర విషయం ఏంటంటే కిరణ్ రావుకి తెలంగాణకి చెందిన మాలాలు ఉన్నట్టు తెలిసింది. ఆమె పూర్వీకులు తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజవంశీకులన్న కొత్త విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
కిరణ్ రావు తాత మహబూబ్ నగర్లోని వనపర్తి రాజవంశీకులు కుటుంబానికి చెందిన వారు. కిరణ్ తండ్రిది కూడా తెలంగాణ ప్రాంతమే. కాకపోతే కిరణ్ తండ్రి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో భాగంగా బెంగళూరు.. కోల్ కతా.. ముంబయి మహానగరాల్లో స్థిరపడాల్సి వచ్చింది. దీంతో.. కిరణ్ రావ్ కూడా చిన్నప్పటి నుండి అక్కడే పెరిగి చదువుసంధ్యలు కూడా అక్కడే సాగడంతో ఈ ప్రాంతానికి దూరం కావాల్సి వచ్చింది. ఈ వివాదం వల్ల కిరణ్ రావ్ తెలంగాణ వాసి అనే ఓ కొత్త విషయం తెలిసింది. మొత్తానికి కిరణ్ రావ్ తన మాటను చెప్పడమేమో కాని అమీర్ ఖాన్ ను మాత్రం ఒక్క మాటతో వివాదాల్లోకి నెట్టేసింది.