ఎవరి కితాబు అవసరం లేదు.. అమీర్ ఖాన్


దేశంలో అసహనం పై అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం ఇంకా రేగుతూనే ఉంది. అమీర్ పై అందరూ విమర్శల బాణాలు విసురుతున్నారు. అయితే ఇప్పుడు అమీర్ తనపై చేస్తున్న విమర్శలకు స్పందించి ఘాటుగా సమాధానం చెప్పారు. ఈ గడ్డపై జన్మించడం నా అదృష్టమని.. ఈ దేశాన్ని విడిచి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. నా ఇంటర్వ్యూని పూర్తిగా చూడని వారే నా వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తున్నారని.. నాకున్న దేశ భక్తికి ఎవరి కితాబు అవసరం లేదని మండిపడ్డారు. మరి అమీర్ ఇచ్చిన క్లారిటీతో అయినా ఇక విమర్శలు ఆగుతాయో? లేదో చూడాలి.