రెండు మామిడి చెట్లకు.. ముగ్గురు  గార్డులు, 9 కుక్కలు కాపల..

ముగ్గురు గార్డులు, 9 కుక్కలు అంతా సెక్యూరిటీ అంటే  ఎంఎల్ఏ సెక్యూరిటీనో , మంత్రి కోసం, లేదంటే సెలబ్రెటీ కోసమో కాదు, బంగారం షాప్ ముందు అంతకన్నా కాదు.. మామిడి కాయల కోసం ముగ్గురు గార్డులు, 9 కుక్కలను కాపలాపెట్టారు.  అదేంటి మామిడి కాయల కోసం అంతా సెక్యూరిటీ ఏంటని అనుకుంటున్నారా..? అది అంతే మార్కెట్ లో ఆ మామిడి కాయల ధర అలా పలుకుతుంది.. అందుకే అంతా సెక్యూరిటీ ని పెట్టారు. అంతక ముందు కూడా మీరు ఈ వార్త చదివే ఉంటారు తాజాగా అక్కడ సెక్యూరిటీ ని ఆరెంజ్ చేశారు. 

అంతే కాదు. ఆ మామిడి కాయలను పసిపిల్లవాడిలా కాపాడుతున్నారు. ఆ మామిడి కాలయాలకు ఎండ నుండి కాపాడ్డానికి కవర్ కట్టారు. నిజంగా మనుషులకంటే ఎక్కువ మామిడికాయలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చూస్తే .. డబ్బులు ఉంటేనే మనుషులకు విలువ అని మరో సారి రుజువైంది. మధ్యప్రదేశ్‌‌లోని జబల్‌పూర్‌కు చెందిన సంకల్ప్, రాణి పరిహార్ అనే జంట మామిడి చెట్ల కోసం ముగ్గురు గార్డులను, తొమ్మిది కుక్కలను కాపాలాగా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆ చెట్లకు కాసే మామిడి పండ్ల విలువ అలాంటిది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన మియాజకీ మామిడి పండ్లను అతడు పండిస్తున్నాడు. జపాన్ జాతికి చెందిన ఈ మామిడి పండ్లు మార్కెట్లో కిలో సుమారు మూడు లక్షల వరకు ఉంటుంది. ముదురు ఎరుపు రంగులో ఉండే ఈ పండ్ల రుచి, నాణ్యత అద్భుతంగా ఉంటుందట. ప్రస్తుతం ఆ తోటలోని 2 మామిడి చెట్లకు 7 పండ్లు కాస్తున్నాయి. గతేడాది కొందరు సంకల్ప్ తోటలోకి ప్రవేశించి పండ్లను ఎత్తుకెళ్లిపోయారు. దీంతో ఈ సారి వాటి కాపాలా కోసం ముగ్గురు గార్డులను, 9 కుక్కలను ఏర్పాటు చేశాడు.