అతనికి 25 ఏళ్ళు .. 28 నేరాలు.. 

అతనికి 25కి అతని ఘనకార్యనలు 28... ఇవి అతను సాధించిన మెడల్స్ కాదు. అలా అని మార్కులు కాదు. అతని కొలతలు అంతకన్నా కాదు. పవన్ కళ్యాణ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన రికార్డుల మాదిరి.. అతను సాధించిన రికార్డులో కావు. ఎందుకంటే.. 25  అతని ఆ యువకుడి వయసు. 28  అనేది అతను చేసిన నేరాల సంఖ్య. పలు నేరాల్లో అరెస్టయిన రికార్డ్వ్య. సనాలకు బానిసైన యువకుడి నేర చరిత ఇది. అందరు చరిత్ర రాయాలి చరిత్ర రాయాలి అంటే వీడు మాత్రం నేర చరిత్ర రాశాడు. 
అతనిపై గత కొంత కాలంగా అతడిపై నిఘా ఉంచిన పోలీసులు.. ఎట్టకేలకు సోమవారం అర్ధరాత్రి రాపూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ. 11.44 లక్షల సొత్తు రికవరీ చేశారు. ఆయా వివరాలను మంగళవారం సాయంత్రం స్థానిక ఉమేష్‌ చంద్ర కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ వెల్లడించారు.  
 
అది నెల్లూరు జిల్లా. కలువాయి మండలం. వెరుబొట్లపల్లి  గ్రామం. అతని పేరు శివ. అతనికి చిన్నపటికి నుండి ఒక అలవాటు ఉంది. అదే విలాసవంతమైన జీవితం గడపడం.. అందుకోసం అప్పుడప్పుడు తన చేతికి పని చెప్పే వాడు. చేతికి పనిచెప్పడం అంటే పని చెయ్యడం కాదు.. దొంగతనం చెయ్యడం. తన చేతి వాటం జువైనల్‌ హోమ్‌ నుంచి. గోగుల శివయ్య 16 ఏళ్ల వయస్సులోనే వ్యసనాలకు బానిసయ్యాడు. విలాస జీవితం గడిపాలని మోజు పడ్డాడు. ఆ వయస్సులోనే నెల్లూరు నగరంలోని ఓ దుకాణంలో దొంగతనానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. వారు అతడిని తిరుపతిలోని జువైనల్‌ హోమ్‌కు తరలించారు. అక్కడి నుంచి బయటకు వచ్చినా.. తీరు మార్చుకోని శివయ్య- రాత్రిళ్లు వాహనంలో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. ఆ క్రమంలో జిల్లా వ్యాప్తంగా నేరాలకు పాల్పడ్డాడు. జిల్లా పోలీసులు ఇప్పటికే 28 నేరాల్లో అరెస్టు చేసి జైలుకు పంపారు. కలువాయి పోలీసు స్టేషన్‌లో రౌడీషీట్‌ తెరిచారు. జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలపై వెంకటగిరి ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.నాగమల్లేశ్వరరావు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేసి.. శివయ్య కోసం ముమ్మరంగా గాలించారు. ఈ నెల 17వతేదీ అర్ధరాత్రి.. రాపూరు పోలీసు స్టేషన్‌ పరిధిలోని మద్దెలమడుగు జంక్షన్‌ వద్ద అరెస్టు చేశారు. అతడి నుంచి రాపూరు, డక్కిలి, చేజర్ల, మనుబోలు, సంగం పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన ఎనిమిది కేసులకు సంబంధించి రూ. 11 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 40వేల నగదు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘరానా దొంగను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు, రాపూరు ఎస్సై ఎన్‌.క్రాంతికుమార్‌, బాలాయపల్లి హెడ్‌కానిస్టేబుల్‌ బి.మధుసూదన్‌రావు, డక్కిలి పీఎస్‌ పీసీ ఎం.పవన్‌కుమార్‌, టి.లక్ష్మీకాంత్‌, వి.మురళి, హోంగార్డు ఎస్‌డీ ఆబిద్‌లను ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటరత్నం పాల్గొన్నారు