పెన్షన్ భామ.. టీనేజ్ ప్రేమికుడు  

పడ్డానండి ప్రేమలో మరి.. విడ్డురంగా ఉందిలే మరి.. నిజంగా నిజంగా ఇలా ఈరోజే  తొలిసారిగా.. పడ్డానండి ప్రేమలో మరి విడ్డురంగా ఉందిలే మరి.. అనే పాట మీరు వినే ఉంటారు. ప్రేమ గురించి కవులు, రచయితలు ఎవడి నచ్చినట్లు వాళ్ళు రాసుకున్నారు.ఒకడు ప్రేమ గుడ్డిది అన్నాడు.  మరొకడు  ప్రేమకు కులం, మతం, వర్గం.. ఇలా ఏదీ ఉండదు అని అన్నాడు. ఇంకొకడు  ప్రేమ స్వచ్ఛమైనది అన్నాడు.. మూడో వాడు ప్రేమకు వయసుతో  పనిలేదు అన్నాడు..  ఇంతకీ ఈ ఎలాంటిదో ఏలుసుకుందాం రండి..?

 చివరికి ప్రేమకు వయస్సు బేధం కూడా ఉండదు. ఆ విషయాన్నీ వీరిద్దరూ మరో సారి నిరూపించారు. ఇందుకు ఈ జంటే నిదర్శనం. ప్రేమికుని  పేరు క్యురన్. అతని వయసు  23 ఏళ్లు.. ఆ ప్రేమికురాలి పేరు  చెర్లీ ఆమెకు 60 ఏళ్లు.. ఇద్దరి మధ్య వయస్సు బేధం సుమారు 37 ఏళ్లు. కానీ, వారి మధ్య ఉండే కెమిస్ట్రీని చూస్తే.. కుర్ర ప్రేమికులు కూడా కుళ్లుకుంటారు. లోకం ఏమనుకుంటే మాకేంటీ.. మా ప్రేమ కంటే గొప్పదా ఈ సమాజం అని ప్రశ్నిస్తున్నారు. అయితే, సోషల్ మీడియాకు మాత్రం వీరి ప్రేమ అస్సలు నచ్చడం లేదు. వారి మధ్య వయస్సు వ్యత్యాసమే కారణం.

అమెరికాకు చెందిన క్యూరన్ప్రే, చెర్లీ ప్రేమలో మునిగి  స్నానం చేస్తున్నాడు. ఆమెకు ముద్దులు పెడుతూ.. హగ్గులిస్తూ.. అప్పుడపుడు డ్యాన్సులు చేస్తూ.. క్షణం తీరిక లేకుండా రొమాన్స్ చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా టిక్‌టాక్ వీడియోలతో ఆ యువ ప్రేమికుడు , ఆ వృద్ధ ప్రేమికురాలు  ఇద్దరూ పిచ్చెక్కిస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో చాలామందికి నచ్చడం లేదు. ‘‘అమ్మమ్మతో రొమాన్స్ ఏమిట్రా బాబు’’ అని క్యురన్‌ను ట్రోల్ చేస్తున్నారు. మీ ప్రేమకు కుటుంబం అంగీకరించిందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు చెర్లీ స్పందిస్తూ.. ‘‘ఔను మా పెద్దలు ఒప్పుకున్నారు’’ అని తెలిపింది. అంతేకాదు.. తన ప్రియుడు క్యురన్ కంటే పెద్దవాళ్లైన తన పిల్లలు కూడా తమ ప్రేమను అంగీకరించారని పేర్కొంది. అయితే.. నెటిజనులు మాత్రం వారిని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆమె ముఖం మీద ముడతలు గురించి చెత్తగా కామెంట్లు చేస్తున్నారు. ఆమె బాగా రిచ్ కావడం వల్లే అతడు అంతగా ప్రేమిస్తున్నాడని అంటున్నారు. ఏమిటో ఈ వింత అలవాట్లు ఇంకా ఎక్కడి దాకా వెళ్తుందో ఈ అభివృద్ధి