ఓ ముసలావిడ మీద 113 కేసులు

అది దిల్లీలోని సంగమ్‌ విహార్‌ ప్రాంతం. అక్కడ ఓ లేడీ డాన్‌- పేరు బష్రీన్‌. డాన్‌ అంటే అలాంటి ఇలాంటి డాన్ కాదు! మంచి కరుడుగట్టిన మహిళ. ఆ ప్రాంతంలో ఎవరికి ప్రభుత్వ నీళ్ల అందాలో కూడా బష్రీనే నిర్ణయిస్తుంది. వాళ్ల నుంచి గంటల లెక్కన పన్నులు వసూలు చేస్తుంది. బష్రీన్‌కి 8 మంది పిల్లలు. బష్రీన్ వాళ్లందరినీ కూడా దందాలోకి దింపేసింది. వందలమంది మైనర్లకి డ్రగ్స్‌ అలవాటు చేసి, వాళ్లని తన గ్యాంగ్‌లోకి చేర్చుకుంది. బష్రీన్‌ కుటుంబం మీద ఒకటీ రెండూ కాదు ఏకంగా 113 కేసులు ఉన్నాయి. అయినా కూడా తన చుట్టూ ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా ఎవరన్నా పోలీసు వస్తే గమనించి వెంటనే పారిపోతూ ఉండేది. ప్రస్తుతం ఈమధ్యనే బష్రీన్‌ మీద ఓ హత్యకేసు నమోదైంది. ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆమె వెంటపడటంతో పరారీలోనే ఉంది. బష్రీన్ పరారీలో ఉండటంతో, ఆమె పీడ విరగడ అయ్యిందనుకుని స్థానికులు వేడుకలు చేసుకుంటున్నారు. మరి బష్రీన్‌ తిరిగి వచ్చేస్తే!