ఎర్రన్నాయుడుకి ప్రవాసాంధ్రుల నివాళి
posted on Nov 6, 2012 11:37AM
.jpg)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడుకు అమెరికాలోని డల్లాస్ నగరంలో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం అక్కడ జరిగిన సభలో ప్రసంగించిన పలువురు వక్తలు రాష్ట్రానికి, ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుని ఆయన కుటుంబానికి సానుభూతిని తెలిపారు. ఆయన మృతికి సంతాపసూచకంగా రెండు నిమషాల పాటు మౌనం పాటించారు.
ఇంగ్లండ్‌లో ఎర్రన్నకు సంతాపం
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడుకు విదేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ గ్లోబల్ యూకే, యూరోప్ విభాగం ఆధ్వర్యంతో ఇంగ్లండ్‌లోని స్టోక్ఆన్‌ట్రెంట్ పట్టణంలో ఆదివారం సంతాప సభ జరిగింది. 150 మంది మౌనయాత్ర నిర్వహించారు. సభలో నివాళులు అర్పించారు.