కాంగ్రెస్ కు భారీ షాక్.. కీలక నేతలు టీఆర్ఎస్ లోకి


తెలంగాణ రాష్ట్రంలో వలసలు ఇంకా జోరుగానే సాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు నేతలు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి జంప్ అవ్వగా.. ఇప్పుడు మరో నలుగురు కాంగ్రేస్ నేతలు గులాబీ కండువా కప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎంపీ గుత్తా, మాజీ ఎంపీ వివేక్ మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ లు టీఆర్ఎస్లో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఈసందర్బంగా గుత్తా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను వీడటం బాధాకరంగా ఉందని..తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఆకర్షించాయి.. అందుకే కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్లో చేరుతున్నాం.. ప్రభుత్వానికి, కేసీఆర్ కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అని అన్నారు.

 

ఇంకా మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్య‌క్ర‌మాలు కొన‌సాగించ‌డానికి తెలంగాణ‌ ప్ర‌భుత్వానికి సంపూర్ణ మ‌ద్ద‌తునిస్తామ‌ని, ఈనెల 15న టీఆర్ఎస్‌లోకి చేరుతున్నామ‌ని పేర్కొన్నారు. ము గ‌తంలో తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ నివేదిక ఇచ్చామ‌ని, ఆ నివేదిక‌లో ఉన్న ఆ అంశాలు ఇప్పుడు కేసీఆర్ చేసి చూపుతున్నారని వివేక్ వ్యాఖ్యానించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu