కాకి వాలిందని కారునే మార్చిన సీఎం..
posted on Jun 13, 2016 1:23PM

కాకి వాలిందని కారునే మార్చేశారు ఓ ముఖ్యమంత్రిగారు. ఇంతకీ ఎవరా ముఖ్యమంత్రి అనుకుంటున్నారు.. ?నిరంతరం వివాదాలతో వార్తల్లో నిలిచే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య. అసలు సంగతేంటంటే.. పది రోజుల క్రితం సిద్దరామయ్య ఇంట్లో ఆయన కారు పార్క్ చేసి ఉన్నపుడు దానిపై ఓ కాకి కూర్చుంది. విచిత్రం ఏంటంటే.. ఆకాకి కూడా ఎంత ఎగరగొట్టడానికి ప్రయత్నించినా.. పది నిముషాలపాటు కారుపైనే కూర్చుంది. కాకి అలా కూర్చోవడం శని అని, వెంటనే సీఎం కారును మార్చాలంటూ జోతిష్యులు టీవీ చర్చల్లో సూచనలు కూడా చేశారు. దీంతో సిద్దరామయ్య కొత్త కారును కొన్నారు. కొత్త కారు కోసం సీఎం దాదాపు రూ.35 లక్షలు వెచ్చించారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. తనను తాను నాస్తికుడిగా, మూఢ విశ్వాసాలను నమ్మనివాడిగా చెప్పుకునే సిద్దరామయ్య ఈ పని ఎలా చేశారని కొంత మంది అంటుంటే.. ప్రజల ధనం ఇలా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి మరికొంతమంది విమర్శిస్తున్నారు.