టీమిండియా కోచ్ క్రేజ్.. రవిశాస్త్రి సహా 57 మంది దరఖాస్తులు..
posted on Jun 13, 2016 10:41AM
.jpg)
టీమిండియా కోచ్ పదవి చాలా కాలంగా ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పదవికి మాత్రం చాలా క్రేజ్ ఉన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ పదవికి బాధ్యతలు చేపడతామంటూ పెద్ద సంఖ్యలోనే మాజీ క్రికెటర్లు బీసీసీఐ ముందు క్యూ కట్టారు. రవిశాస్త్రితో పాటు మరో మాజీ దిగ్గజం సందీప్ పాటిల్ సహా మొత్తం 57 మంది క్రికెటర్లు కోచ్ పదవి చేపడతామంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 10తో దరఖాస్తులకు గడువు ముగిసిన నేపథ్యంలో కోచ్ పదవికి ఎంతమంది దరఖాస్తు చేశారన్న విషయంపై బీసీసీఐ నిన్న ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం దరఖాస్తులను పరిశీలించి త్వరలోనే కోచ్ పదవికి సరైన వ్యక్తిని ఎంపిక చేస్తామని బీసీసీఐ ఆ ప్రకటనలో తెలిపింది.