హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సోనియా..

 

తరచూ ఏదో ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కాస్త రిలీఫ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టున్నారు. అందుకే తన కూతురు ప్రియాంకగాందీతో కలిసి హాలిడే ట్రిప్ వెళ్లారు. తన కూతురు ప్రియాంకా గాంధీతో కలిసి సిమ్లాలో ప్రత్యక్షమయ్యారు. ఇద్దరూ ఢిల్లీ నుంచి కలిసి వెళ్లి అక్కడి నుండి సిమ్లాలో హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారట. అంతేకాదు హాలీడేస్ కే వెళ్లినప్పటికీ ఛారబ్రాలో తాము కొత్తగా కట్టుకుంటున్న ఇంటిని వారు ఓసారి పరిశీలించారు. ప్రస్తుతం నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చిన సదరు భవంతిని ప్రియాంకా గాంధీ తన అభిరుచికి అనుగుణంగా కట్టించుకుంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu