నేను వస్తే ఇదంతా మారుతుంది.. ట్రంప్
posted on Jun 14, 2016 3:27PM
.jpg)
ఓర్లాండాలో జరిగిన నరమేథాన్ని అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ బాగానే ఉపయోగించుకుంటున్నట్టు ఉన్నారు. ఈ ఘటనపై స్పందించిన ట్రంప్ ఒబామాపై.. ప్రభుత్వంపై విమర్శలు కురిపించే పనిలో పడ్డారు. మన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది.. ఎవర్ని దేశంలోకి రానిస్తున్నామో తెలియడం లేదు అని అన్నారు. తనిఖీల్లో అధికారులు ఫెయిలయ్యారు.. అయినప్పటికీ మన అధ్యక్షుడు బరాక్ ఒబమా మాత్రం ఇంటెలిజెన్స్ అధికారులను వెనుకేసుకొస్తున్నారు. నేను అధికారంలోకి వస్తే ఇదంతా మారుతుంది' అని ట్రంప్ చెప్పారు. ముస్లింలను అమెరికాలోకి రానివ్వకూడదంటే నన్ను అందరూ తిట్టారు.. కానీ ఇప్పుడు నేనే కరెక్ట్ అంటున్నారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ అమెరికాని టార్గెట్ చేసింది.. రాడికల్ ఇస్లానిక్ భావాలతో ఉన్నారు.. వారిని దేశంలోకి రానివ్వకూడదు అని అన్నారు. అందుకే అమెరికాలోకి ముస్లింలు ప్రవేశించకుండా ఓ తాత్కలిక నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
కాగా అమెరికాలోని ఓర్లాండోలో మతీన్ అనే వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల కారణంగా దాదాపు 50మంది ప్రాణాలుకోల్పోయిన సంగతి తెలిసిందే.