నా బుద్ధి గడ్డితింది.. అందుకే...

 

హర్యానాలోని హిస్సార్‌లో నానా గందరగోళం చేస్తేగానీ పోలీసులకు పట్టుబడని వివాదాస్పద గురువు రామ్‌పాల్ ప్రస్తుతం పోలీసు రిమాండ్‌లో భాగంగా హిస్సార్‌ పోలీస్ స్టేషన్లో వున్నాడు. పోలీస్ స్టేషన్‌లో పడిన తర్వాత రెండ్రోజులు ఆయన నిద్రే పోలేదట. పాపం 12 ఎకరాల స్థలంలో కట్టిన తన ఆశ్రమంలో స్వర్గ సుఖాలు అనుభవించే ఆయనకి పోలీస్ స్టేషన్లో నిద్రెలా పడుతుంది. మొత్తమ్మీద ఇప్పుడయితే అలవాటైపోయి అప్పుడప్పుడు నిద్రపోతున్నాడట. అయితే మధ్యమధ్యలో ఉలిక్కిపడి లేస్తున్నాడట. పోలీసు అధికారులు జరుపుతున్న విచారణలో ఆయన నుంచి ఒకటే సమాధానం వస్తోందట. ‘‘బుద్ధి గడ్డితింటే ఇలాంటి గతే పడుతుంది. నా బుద్ధి గడ్డితింది’’ అని మాత్రమే ఆయన సమాధానం చెబుతున్నాడట. విచారణ జరిగే సమయంలోనూ ఆయన కూర్చోకుండా ఆయన గొణుక్కుంటూ లాకప్‌లో పచార్లు చేస్తున్నాడట. పోలీసులు ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టి లోపలేశారు. ఆయనకి మావోయిస్టులకి బలమైన సంబంధాలున్నాయని బయటపడింది. ఆయన బెడ్‌రూమ్‌లో గర్భ నిర్ధారణ కిట్లు కూడా దొరికాయి.