సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై జ్యోతిషుడి అత్యాచారం

 

పశ్చిమ బెంగాల్‌కి చెందిన ఒక ఇరవయ్యేళ్ళ యువతి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఆమె తమ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు బెంగుళూరులోని హోయసళ నగరలో నివసించే దామోదర్ అనే ఒక జ్యోతిషుడి దగ్గరకి తన స్నేహితురాలితో కలసి వెళ్ళింది. జ్యోతిషుడు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించాడు. జ్యోతిషం చెప్పే సమయంలో మరో వ్యక్తి పక్కన వుండకూడదంటూ ఆమెని గదిలోకి తీసుకెళ్ళాడు. మూడు గంటల తర్వాత ఆ గదిలోంచి బయటకి వచ్చిన ఆ యువతి సదరు జ్యోతిషుడు గంటసేపు జ్యోతిషం చెప్పి, తాను మత్తులోకి జారిపోవడంతో తనమీద అత్యాచారం జరిపాడని తన స్నేహితురాలికి ఏడుస్తూ చెప్పింది. ఆ తర్వాత ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ జ్యోతిషుడు దామోదర్‌ని అరెస్టుచేశారు.