ఫైనాన్సియర్ పై బెల్లకొండ దాడి, కేసు నమోదు
posted on Jan 24, 2013 11:43AM

తరచూ ఏదోక వివాదంతో వార్తల్లో నిలిచే టాలీవుడ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఫైనాన్సియర్‌పై దాడికి పాల్పడ్డట్లు ఆయన పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
సిద్ధార్థ్ మరియు నిత్యమినన్ హీరో, హీరోయిన్లు గా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం "జబర్ దస్త్". ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఫైనాన్సియర్ రాధాకృష్ణ కి కోటి రూపాయలకు తీసుకున్నాడు. అడ్వాన్సుగా రూ. 25 లక్షలు చెల్లించాడు. అయితే ఏమైందో తెలియదు కానీ అగ్రిమెంటు విషయంలో ఇరువురి మధ్య విబేధాలు వచ్చాయి.
అయితే అగ్రిమెంట్ విషయంలో విభేదాలు రావడంతో తీవ్రంగా వాదులాడుకున్నారని, మాట మాటా పెరిగి బెల్లంకొండ కోపం అపుకోలేక రాధాకృష్ణ దాడి చేశారని తెలుస్తోంది. దీంతో ఫైనాన్సియర్ బెల్లంకొండ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. బెల్లంకొండ పై ఇలాంటి ఆరోపణలు రావడం తొలిసారి కాదు, గతంలో కిందట కందిరీగ డైరెక్టర్ పై కూడా చెయ్యి చేసుకున్నట్టు వార్తలోచ్చాయి.