మోడీనా అతనెవరు.?

 

విదేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ గురించి అందరికీ కాకపోయినా చాలామందికి తెలిసేఉంటుంది. అంతేకాదు అక్కడ కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. కానీ అలాంటి మోడీ ఎవరో తెలియదంటున్నారు స్పెయిన్ వాసులు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు దేశాల పర్యటనలో భాగంగా స్పెయిన్ వెళ్లిన సంగతి తెలసిందే. అయితే స్పెయిన్ వెళ్లిన ఆయనకు గ్రాండ్ వెల్ కమ్ పలికారు. ఇక మిగిలిన దేశాలు కూడా పలు కథనాలు రాశారు. అయితే స్పెయిన్ వాసులు మాత్రం అత్యంత అమాయకంగా, ఈ నరేంద్ర మోదీ ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. మోడీ స్పెయిన్ వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఓ సర్వే నిర్వహించారు. అయితే ఈ సర్వేలో మోడీ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు స్పెయిన్ వాసులు. మోదీ ఫొటోను అక్క‌డివారికి చూపిస్తూ అందులో ఉన్న‌ది ఎవ‌రు అని ప్ర‌శ్నించగా... అందుకు వాళ్లు ఆయ‌నో ప‌వ‌ర్‌ఫుల్ ఇండియ‌న్ లీడ‌ర్ అని చెప్పారు. ఇంకొందరు.. యోగాను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశార‌ని మ‌రికొంద‌రు చెప్పారు. ఇక ఓ వ్య‌క్తి అయితే ట్రంప్ బారి నుంచి అమెరికాను మోదీయే కాపాడ‌తార‌ని చెప్ప‌డం విశేషం. ఇవన్నీ ఒక ఎత్తైతే కొంతమంది మాత్రం.. ఆయనెవరని ప్రశ్నించడం గమనార్హం..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu