ఒక రోజు పోలీసు కస్టడీకి వంశీ!
posted on Mar 29, 2025 10:39AM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఒకరోజు పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గన్నవరం కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు గన్నవరం తెలుగుదేశం కార్యాలయం ద్వంసం కేసులో ఫిర్యాదు దారు హర్షవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను ఎస్టీఎస్టీ అట్రాసిటీస్ కోర్టు కొట్టివేసింది.
ఇక ఇప్పుడు తాజాగా ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక భూవివాదానికి సంబంధించి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో వంశీపై నమోదైన కేసులో విచారణ నిమిత్తం వంశీని కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు గన్నవరం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు వంశీని ఒక రోజు పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పోలీసులు శనివారం (మార్చి 29) తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.