రాష్ట్రపతి పాలన విధించండి
posted on Aug 19, 2013 4:41PM
ఇరుప్రాంతాల్లో వెల్లువెత్తుతున్న నిరసనల నేపధ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం విచారణను ఈ నె ల26 కు వాయిదా వేసింది. దీనికి తోడు సీమాంద్ర జిల్లాల్లో నిరసనలతో అన్నిచోట్ల ఎంసెట్ కౌన్సిలింగ్ నిలిచిపోవడంతో కౌన్సిలింగ్ సజావుగా జరిగేలా చూడాలని కొందరు విద్యార్ధులు కోర్టులో పిటిషన్ వేశారు.
ఈ రెండు పిటిషన్‌లను విచారణకు స్వీకరించిన కోర్టు, దీనిపై వివరంగా ఆయా ప్రాంతాల అధికారుల నుంచి నివేదికలు తెప్పించి సమర్పించాలని డీజీపీతో పాటు ఆయా ప్రాంతాల ఐజీపీలను ఆదేశించింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో పాలన స్ధంబించిందని ఇప్పటికే దాదాపుగా అందరూ ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు కనుక ప్రభుత్వాన్నికొనసాగించేకన్నా రాష్టపతి పాలన విధించిన పరిస్థితిని చక్కదిద్దాలని పిటీషనర్ కోరారు.
వీటికి తోడు ఏపీఎన్జీవోల సమ్మె చట్ట విరుద్ధమంటూ దాఖలైన మరో పిటిషన్ను కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ప్రభుత్వానికి నోటిసులు పంపిన కోర్టు సమ్మెను నిరోధించేందుకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నించింది.