రష్యన్ బ్యూటీ జిమ్నాస్ట్ కేలండర్ అదరహో...

 

రష్యాకి చెందిన జమ్నాస్ట్ కమ్ అందగత్తె అయిన బార్కోఫ్ట్ మేడియా జియాటా అనే ముద్దుగుమ్మ తాను జమ్నాస్టిక్‌ విన్యాసాలను ఫొటోలు తీసి, వాటితో 2015 సంవత్సరానికి క్యాలండర్ని రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కేలెండర్లు ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఈ కేలెండర్లో జియాటా ఇచ్చిన పోజుల్ని చూసి జనాల మతిపోతోంది. జియాటా ఇచ్చిన పోజులు చూసి ఆమెది ఒళ్ళా రబ్బరా అని అనుకుంటున్నారు. చాలా కష్టమైన పోజులు ఇచ్చి కూడా ముఖంలో ఎంతమాత్రం అలసట అనేదే లేకుండా కనిపించిన జియాటాకి అందరూ హేట్సాఫ్ చెబుతున్నారు. ఈ కేలెండర్లో ఆమె ఇచ్చిన పోజుల్లో అసలే అందగత్తె అయిన ఆమె మరింత అందంగా కనిపిస్తోందని చాలామంది సౌందర్యోపాసకులు కితాబు ఇస్తున్నారు. రష్యన్ అయినప్పటికీ జియాటా జర్మనీలో సెటిలైంది. ఇప్పుడు జియాటా కేలెంటర్లు ఇటు జర్మనీ, అటు రష్యాతోపాటు చుట్టుపక్కల దేశాల్లో కూడా విపరీతంగా అమ్ముడౌతున్నాయి.