బుంగమూతి పెట్టుకున్న లక్ష్మీపార్వతి!

లక్ష్మీపార్వతి అలిగారు.. బుంగమూతి పెట్టుకున్నారు. జగన్ తనను చిన్నచూపు చూస్తున్నారని హర్టయ్యారు. ఇంత అనుభవం వున్న తనను పక్కనపెట్టి, ఎంతమాత్రం రాజకీయ అనుభవం లేని వాళ్ళకి పదవులు ఇచ్చారని తెగ ఫీలైపోతున్నారు. తన బాధనంతా సన్నిహితుల దగ్గర వ్యక్తం చేస్తూ, తనను అందరూ చిన్నచూపు చూస్తున్నారంటూ లబోదిబో అంటున్నారు. ఇంతకీ మేడమ్ గారు ఇంతలా ఫీలైపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇటీవల వైసీపీ పార్టీకి సంబంధించిన పదవులను జగన్ ప్రకటించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితర పెద్ద తలకాయలకు పదవులు ఇచ్చారు. వాళ్ళతోపాటు ఒక చిన్న తలకాయ అయిన యాంకర్ శ్యామలకి కూడా ఒక పదవి ఇచ్చారు. అదికూడా ‘అధికార ప్రతినిధి’ లాంటి ప్రాధాన్యం వున్న పదవి ఇచ్చారు. ఇది లక్ష్మీపార్వతిని బాగా బాధపడుతున్నట్టు సమాచారం. చంద్రబాబు మీద విషం కక్కే విషయంలో జగన్ ఆశయాలకు అనుగుణంగా తాను పని చేస్తున్నప్పటికీ తనకు పదవి ఇవ్వకుండా, శ్యామలలాంటి రాజకీయానుభవం లేని వ్యక్తికి పదవి ఇవ్వడాన్ని లక్ష్మీపార్వతి జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం. ఈమధ్య కాలంలో లక్ష్మీపార్వతిని జగన్‌కి చెందిన డిబేట్లకు కూడా పిలవటం లేదని తెలుస్తోంది. లక్ష్మీపార్వతి తిట్లు జనానికి రొటీన్ అయిపోయాయని, చంద్రబాబును లక్ష్మీపార్వతి విమర్శిస్తుంటే జనం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని ఆమెను జగన్ టీవీకి దూరంగా పెట్టాలరని తెలుస్తోంది. చంద్రబాబు విషయంలో అగౌరవంగా మాట్లాడుతున్నందుకు గతంలో లక్ష్మీపార్వతికి నెలనెలా ఇచ్చిన గౌరవ వేతనాన్ని కూడా జగన్ పార్టీ బంద్ చేసినట్టు తెలుస్తోంది. గౌరవ వేతనం ఆగిపోవడం, పదవి ఇవ్వకపోవడం, తనను పక్కన పెట్టేయడంతో లక్ష్మీపార్వతి ఫ్రస్టేషన్లో వున్నట్టు తెలుస్తోంది.