బీజేపీ రాజ్యసభ అభ్యర్ధులు.. ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాలు ఇవే..
posted on May 30, 2016 3:10PM
.jpg)
బీజేపీ తరపున రాజ్యసభకు వెళ్లే అభ్యర్ధులను పార్టీ పెద్దలు ఇప్పటికే ప్రకటించారు. దాదాపు 12 మంది అభ్యర్ధుల పేర్లను బీజేపీ ప్రకటించింది. రేపటితో నామినేషన్ గడువు పూర్తవుతున్న సందర్భంగా మరిన్ని పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీ కి ఉన్న సంఖ్యా బలం దృష్ట్యా ఇంకా 18 నుండి 19 మంది సభ్యులను రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
కాగా ప్రస్తుతం బీజేపీ ప్రకటించిన అభ్యర్దుల పేర్లు వారు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాల వివరాలు
1. వెంకయ్య నాయుడు - రాజస్థాన్
2. నిర్మలా సీతారామన్ - కర్ణాటక
3. ఓం ప్రకాశ్ మాథుర్ - రాజస్థాన్
4. హర్షవర్ధన్ సింగ్ - రాజస్థాన్
5. రాంకుమార్ వర్మ - రాజస్థాన్
6. పియూష్ గోయెల్ - మహారాష్ట్ర
7. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - ఝార్ఖండ్
8. బీరేంద్ర సింగ్ - హరియాణా
9. పురుషోత్తం రూపాల - గుజరాత్
10. గోపాల్ నారాయణ్ సింగ్ - బీహార్
11. అనిల్ మాధవ్ దవే - మధ్యప్రదేశ్
12. రాంవిచార్ నేతం - ఛత్తీస్ గఢ్