కేసీఆర్‌కు సూసైడ్ లెటర్ రాసి చనిపోయింది..
posted on May 30, 2016 3:48PM
.jpg)
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోములలో ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థిని ఝూన్సీ కేసు కీలక మలుపు తిరిగింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూసైడ్ లెటర్ రాసింది. ఆ లేఖను ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపింది. ఆ లేఖలో తన ఆవేదనను సీఎంకు వివరించింది. తనను వ్యభిచారంలోకి దింపేందుకు భర్తతో పాటు తల్లి ప్రయత్నించారని పేర్కింది. సీఎంతో పాటు డీజీపీ అనురాగ్‌శర్మ, నల్గొండ జిల్లా ఎస్పీ, నకిరేకల్ పోలీసులకు చనిపోయే ముందు ఈ లేటర్‌ను ఝూన్సీ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపింది. ఉన్నతాధికారుల ఆదేశంతో ఆమె మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు ఝూన్సీ భర్త, తల్లి పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.