డాక్టర్ చిరుమామిళ్ళ మురళీమనోహర్ ఎం.డి. (ఆయుర్వేద)

డాక్టర్ చిరుమామిళ్ళ మురళీమనోహర్ జాతీయస్థాయిలో ఉత్తమ ఆయుర్వేద వైద్యులుగా గుర్తింపు పొందారు. వీరి వంశంలో ఆయన మూడవ తరానికి చెందిన ఆయుర్వేద వైద్యులు. ఆయుర్వేదాన్ని అయిదున్నర ఏళ్ళపాటు అభ్యసించి, బి.ఎ.ఎం.ఎస్. డిగ్రీ, తర్వాత ఎం.డి. పట్టా పొందారు.

 

జాతీయ వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళడానికి ఉద్యమించారు. ఈ నేపథ్యంలో అనేక వ్యాసాలు, పుస్తాకాలు రాశారు. వీరి ఇంగ్లీషు పుస్తకాలు - ఎ రిఫరెన్స్ గైడ్ టు ఆయుర్వేదిక్ ప్రాక్రీస్, ఆయుర్వేద ఫర్ ఆల్ వంటివి మంచి ప్రజాదరణ పొందాయి. తెలుగులో వీరు రాసిన ఆయుర్వేద గృహ చికిత్సలు, ఆయుర్వేదంతో ఆరోగ్యం అనేవి కూడా అద్భుత విజయాన్ని సాధించాయి. వీరి శీర్షికలు దాదాపు అన్ని ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. అలాగే, రేడియోలో, టెలివిజన్ లో వీరి కార్యక్రమాలు అనేకం ప్రసారమయ్యాయి.

 

గ్లోబల్ ఎకనమిక్ కౌన్సిల్ (న్యూఢిల్లీ) డాక్టర్ మురళీ మనోహర్ కు ప్రైడ్ ఆఫ్ ఇండియా బిరుదు ఇచ్చి గౌరవించింది. అలాగే, యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెన్ అవార్డ్ ఆఫ్ ఆనర్ ను, రోటరీ క్లబ్ రోటరీ ఒకేషనల్ అవార్డును ఇచ్చి సత్కరించాయి.

 

డాక్టర్ మురళీ మనోహర్ సోరీయాసిస్, విటిలిగో, రుమటాయిడ్, ఆర్థరైటిస్, డయాబెటిస్, ఆస్త్మా వంటి అనేక మొండివ్యాధులకు సమర్ధవంతమైన మందులు రూపొందించారు. ఆయుర్వేదాన్ని ఇంటింటికి తీసుకువెళితే, ఆరోగ్యాన్ని తీసుకువెళ్ళినట్టేనన్న భావనతో 'ఆయుర్వేద ఫర్ పీపుల్' అనే ప్రజాహిత సంస్థ స్థాపించారు. మందు మొక్కలను నాటించడం, ఆరోగ్యానికి సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ కోర్సులు నిర్వహించడం, వ్యాధులు రాకుండా నివారణ చర్యలు చేపట్టేలా ప్రజలను అప్రమత్తం చేయడం వంటి పలు ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరు ప్రస్తుతం హైదరాబాదు, అమీర్పేటలోని సారధీ స్టూడియో రోడ్ లో రక్ష ఆయుర్వేదిక్ సెంటర్ అనే సంస్థ స్థాపించి దాని ద్వారా సశాస్త్రీయమైన ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

For more information...

Dr. Ch. Murali Manohar MD (Ayurveda)

visit: www.muralimanohar.com

he can be reached at: muralimanoharch@hotmail.com

phones: 040-23742146, 9246575510

address::

Raksha Ayurvedic center, opp. Stare home,

Yousufguda, mainroad, (Sarathi studio road)

Ameerpet, Hyderabad 500075