జయంతి ఆశ్చర్యంగా చూసింది. ప్రపోజలా - ఏం ప్రపోజల్ అనడిగింది తెల్లబోయి ,
    "మీతో మీవాళ్ళెం మాట్లాడలేదా నిన్న మీ అమ్మగారు నన్ను మళ్ళీ పెళ్ళి చేసుకోమన్నారు. వంటరిగా పిల్లలతో ఎన్నాళ్ళు కష్టపడతావు ఆడదిక్కు లేకుండా - జయంతికి పిల్లలు దగ్గిరయ్యారు , పిల్లల కోసమన్నా జయంతిని నీవు చేసుకో బాబూ అంటూ అడిగారు ....అంటూ ఆగి జయంతి మోహంలో ఆశ్చర్యంగా చూసి 'ఓ, ఇది మీకు తెలియదన్న మాట ....బహుశా నేనేమంటానో విన్నాక మీకు చేపుదామనుకున్నారు గాబోలు ' ' - జయంతి మొహం ఎర్ర బడింది సిగ్గుతో - కళ్ళు వాల్చుకుంది. 'జయంతి గారూ నన్ను క్షమించండి - దమయంతి స్థానం నేనెప్పటికీ ఎవరికి ఇవ్వలేను. పెళ్ళి చేసుకుని ఇంకో అమ్మాయికి ఆ విధంగా అన్యాయం ఎలా  చెయ్యను చెప్పండి. నిజమే పిల్లలని మీరు తల్లిలా చూస్తున్నారు. కాని మిమ్మల్ని నేను దమయంతను కోలేను. నన్నర్ధం చేసుకోండి."
    'జయంతి మొహంలో ఓ క్షణం నిరాశ నీడలు కదిలాయి - ఈ ఆఖరి ఆశ కూడా అయిపోయిందనుకుంది. మనసు భారంగా మూలిగింది తను నిజంగా దురదృష్ట వంతురాలే - దమయంతి ఎంత అదృష్ట వంతురాలో - భర్త మనసులో ఇంతటి స్థానం సంపాదించుకోవడం ఎంతో అదృష్టం - ఒక్క క్షణంలో భావం మార్చేసి అతని వంక ఆరాధనా పూర్వకంగా చూసి 'గోపాలకృష్ణగారు మీ మీద నా గౌరవం రెట్టింపయింది. భార్య పట్ల మీ అభిమానం, అనురాగం చూసి  చూసి మీ పట్ల ఇంకా నా అభిమానం ఎక్కువైంది ఫర్ గెటిట్ - అమ్మా వాళ్ళేదో ఇద్దరం వంటరిగా వున్నామనుకుని సజెస్ట్ చేసి వుంటారు.
    గోపాలకృష్ణ రిలీఫ్ గా ఫీలయ్యాడు . 'డోంట్ ఫీల్ బాడ్ ' అన్నాడు.
    'నాట్ టాల్ ..... చెప్పాగా ఫర్ గెట్ యిట్ - నిత్యని నేను తీసు కేడుతున్నాను తగ్గాక పంపిస్తాను ' అంది.
    

                              *    *    *

    'జయంతి ఉద్యోగానికి రాజీనామా చేసిందట' పద్మావతి వెంకటేశ్వరరావుతో అంది. అయన తెల్లబోయి 'ఎందుకు? ఏం జరిగింది?' ఆరాటంగా అడిగాడు. 'ఏమో ఇందాక ఫోను చేసింది. ఉద్యోగం మానేసి పక్క ప్లాటు అద్దెకు తీసుకుని క్రష్ , నర్సరీ స్కూలు నడుపుతుందిట' 'అదేం పిచ్చిపని, పదిహేను వేలు వచ్చే ఉద్యోగం వదులుకుని ....' అర్దోక్తిలో ఆగిపోయారాయన. పద్మావతి నిట్టూర్చింది. 'ఇంక ఈ జన్మకి తనకి పెళ్ళి , పిల్లలు వుండరు అని ఇలా పిల్లలతో కాలక్షేపం చేస్తూ వంటరితనం పోగొట్టుకుంటుందేమో ....' అంది ఆవేదనగా.


                                 *    *    *

    'అనురాగ్ క్రష్ , నర్శరీ ...ప్రారంభోత్సవం కాస్త అట్టహాసంగానే తన బ్యాంక్ జనరల్ మేనేజర్ చేత ప్రారంభింపచేసింది. తెల్సిన వాళ్ళందరికీ చిన్న పార్టీ ఇచ్చింది. బయట బోర్డు పెట్టి చుట్టుపక్కల ఉద్యోగాలు చేసే ఆడవాళ్లందరికీ పాంప్లెట్లు పంచింది. అంతా వెళ్ళాక గోపాలకృష్ణ జయంతి వంక చూసి 'జయంతి , మీ ఈ నిర్ణయం , నా నిరాకరణలోంచి వచ్చిందని నాకు చాలా బాధగా వుంది ' విచలితుడై అన్నాడు. 'నేను మిమ్మల్ని తిరస్కరించానని ....' చా....అదేం లేదు గోపాలకృష్ణ గారు, నిజం చెప్పాలంటే ఆరోజు చెప్పినట్టు మీ పట్ల నా గౌరవం, అభిమానం ఆ జవాబుతో ఎక్కువైంది. మీరు అందరి మగవారిలా కాక ఓ ఆదర్శానికి కట్టుబడడం....మిమ్మల్ని అభినందిస్తున్నాను ' 'మీరి నిర్ణయం తీసుకున్న దగ్గిర నించి నేను చాలా గిల్టిగా పీలవుతున్నాను - ఏం చేసి నేనీ బాధ తగ్గించుకోవాలో అర్ధం కావడం లేదు ' 'చెప్పనా , నా మొదటి బోణిగా మీ పిల్లలిద్దరిని చేర్పించి డబ్బు కట్టి ఆ బాధ తొలగించుకొండి' జయంతి నవ్వుతూ చనువుగా అంది. గోపాలకృష్ణ నవ్వాడు. 'ఇది వరకు అనాధ శరణాలయానికి ఎవరో చందా అడిగితె అరడజను మంది అనాధ పిల్లలని పంపుతానన్నాడుట' ఇద్దరూ నవ్వారు. గోపాలకృష్ణ నవ్వి జేబులోంచి పర్సు తీసి వున్న ఓ వంద రూపాయల నోటు జయంతి చేతికి కిచ్చి ;ఇది నా అడ్వాన్స్ ... మా ఇద్దరి పిల్లల బాధ్యత మీ చేతిలో పెడ్తున్నాను." అన్నాడు. జయంతి మనస్పూర్తిగా నవ్వి - 'జీవితంలో నే కోల్పోయిన అనందం ఈ పసి మొగ్గల్లో వెతుక్కోవాలని నా తాపత్రయం ' అంది. గోపాలకృష్ణ 'మే గాడ్ బ్లెస్ యూ' అన్నాడు- అభిమానంగా. వెడుతున్న గోపాలకృష్ణని చూసి జయంతి నిట్టూర్చింది. 'నిన్ను నిన్నుగా ప్రేమించుటకు , నీకోసమే కన్నీరు నింపుటకు ..... నేనున్నానని నిండుగా పలికే తోడోకరుండిన అదే భాగ్యమా .....అదే స్వర్గమూ."'తను ఆ భాగ్యానికి నోచుకోలేదు ఈజన్మలో - కన్నీటి పోరా మధ్య నించి గోపాలకృష్ణ కనుమరుగయ్యే వరకు చూసింది.


                                            --------**----------