మహిళలలో చిన్నతనంలోనే వచ్చే  బోలు ఎముకల వ్యాధి  నివారణకు ఇలా చేయండి..!

మహిళలలో చిన్నతనంలోనే వచ్చే  బోలు ఎముకల వ్యాధి  నివారణకు ఇలా చేయండి..!     మహిళలు తమ భర్త, పిల్లలు, అత్తమామలు ఇలా కుటుంబం మొత్తాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ తమ ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.  ఈ అజాగ్రత్తల వల్ల చాలామంది మహిళలు చిన్న వయసులోనే ఎముకలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాటిలో ఆస్టియోపోరోసిస్ కూడా ఒకటి. దీన్నే బోలు ఎముకల వ్యాధి అంటుంటారు. మహిళలలో మెనోపాజ్ తరువాత ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్  హార్మోన్లు తగ్గుతాయి.  దీని కారణంగా ఎముకలు బలహీనపడతాయి. బోలు ఎముకల వ్యాధిని నివారించాలంటే మహిళలు 30 ఏళ్ళ తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పురుషుల కంటే చిన్న వయస్సులోనే స్త్రీలలో ఎముకల సాంద్రత తక్కువగా ఉంటుంది. దీనికి కారణం మెనోపాజ్ ఒకటి అయితే స్త్రీల  జీవనశైలి సరిగా లేకపోవడం మరొకటి. సాధారణంగా 60 ఏళ్ల తర్వాత, ఎముకలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. కానీ 30 ఏళ్ల తర్వాత ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోని మహిళల్లో ఎముకలు త్వరగా బలహీనపడతాయి.  ఇలాంటి మహిళలు వయసుకు ముందే ఎముకల వ్యాధుల బారిన పడవచ్చు. ఎముకలు బలహీనంగా ఉన్న మహిళలకు పగుళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా స్త్రీలకు 40 ఏళ్ల తర్వాత ఎముకల సాంద్రత సమస్యలు మొదలవుతాయి. మహిళలు ఫ్రీ-మెనోపాజ్ దశలో ఉంటారు.  అంటే వారి పీరియడ్స్ క్రమంగా ఆగిపోవడం ప్రారంభమవుతుంది. ఈ వయస్సులో మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ హార్మోన్ల లోపం ఉంటుంది. ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ హార్మోన్లు శరీరంలో కాల్షియంను గ్రహించడంలో సహాయపడతాయి. శరీరంలో వీటి లోపం ఏర్పడినప్పుడు ఎముకలు బలహీనపడతాయి. దీని వల్ల రక్తపోటు కూడా ప్రభావితమవుతుంది. మెనోపాజ్ సమయంలో స్త్రీల ఎముకలు బలహీనపడటంతో పాటు రక్తపోటు స్థాయి కూడా అస్తవ్యస్తం కావడానికి కారణం ఇదే. పారాథైరాయిడ్ హార్మోన్ స్థాయి తగ్గిపోవడం  ప్రారంభించినప్పుడు ఎముకలు మృదువుగా,  బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా బోలు ఎముకల వ్యాధి,  ఆస్టియోమలాసియా సమస్యలు మొదలవుతాయి. ఆస్టియోమలాసియాలో ఎముకలు మృదువుగా మారుతాయి.  బోలు ఎముకల వ్యాధిలో అవి బలహీనమవుతాయి. చిన్నపాటి గాయమైనా, కిందపడినా ఎముక విరిగిపోతుందేమోనని భయం. కీళ్ల ఎముకలు అరిగిపోవడం ప్రారంభించినప్పుడు కీళ్ళు సరిగ్గా పనిచేయవు. వాటి కదలిక ఆగిపోతుంది. దీని వల్ల కీళ్లలో నొప్పి మొదలవుతుంది. దీనినే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. విటమిన్ డి శరీరంలోని అనేక కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది. విటమిన్ డి ఆహారం నుండి కాల్షియంను గ్రహిస్తుంది. విటమిన్ డి లోపం చర్మం ఆకృతిని పాడు చేస్తుంది. చర్మం క్షీణిస్తున్నట్లయితే విటమిన్ డి సప్లిమెంట్లను వైద్యుల సలహాతో తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మెనోపాజ్ తర్వాత శరీరంలో విటమిన్ డి లోపం వల్ల స్త్రీల చర్మం మెరుపు తగ్గి ముఖంపై ముడతలు వస్తాయి. సూర్యకాంతి పడని స్త్రీల శరీరంలో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుంది. ఎముకలు దీర్ఘకాలం పాటు బలంగా ఉండాలంటే  జీవనశైలిలో 5 మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, ప్రతిరోజూ సూర్యరశ్మిలో  యోగా,  వ్యాయామం చేయాలి. ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారి ఎముకలు కూడా త్వరగా బలహీనపడతాయి, దానిని నివారించాలి. ఆహారంలో కాల్షియం, ఫాస్పరస్,  ప్రోటీన్ల లోపం ఉండకూడదు. శరీరంలో విటమిన్ డి తగినంత మొత్తంలో ఉండటానికి ఆహారంలో విటమిన్ డి ఉన్న ఆహారాలను చేర్చుకోవాలి. నిమ్మ, నారింజ, యాపిల్, స్ట్రాబెర్రీ, పైనాపిల్, గుడ్డు, చేపలు, పుట్టగొడుగులు, పాలు, పెరుగు, బాదం వంటి వాటిని తినడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపం ఉండదు.                                                *రూపశ్రీ.

read more
ఆడవారు PCOS ను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?

  ఆడవారు PCOS ను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?      మహిళలకు నెలసరి సమస్యలు చాలా ఎక్కువగా వస్తుంటాయి.  నెలసరి సరిగా రాకపోవడం,  పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం, బరువు పెరగడం,  వంటి సమస్యలు చాలామంది ఫేస్ చేస్తుంటారు. ఈ సమస్యలకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కారణం అవుతుంది.  దీన్నే పిసిఓయస్ అని అంటారు.  భారతదేశంలో ప్రతి 5 మంది మహిళలలో ఒకరు పిసిఓయస్ సమస్యతో పోరాడుతున్నారు.  అంటే.. ఈ సమస్య మహిళలను ఎంతగా ఇబ్బంది పెడుతోందో అర్థం చేసుకోవచ్చు. అయితే చాలామంది మహిళలు తమకు పిసిఓయస్ సమస్య ఉందనే విషయం కూడా తెలియకుండానే కాలం వెళ్లబుచ్చుతూ ఉంటారు. మరికొందరు తమకు సమస్య  ఉందని తెలిసినా కుటుంబ విషయాల్లో పడి తమ గురించి తాము పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. కానీ పిసిఓయస్ సమస్యను పట్టించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తే నష్టాలు తప్పవని గైనకాలజిస్టులు చెబుతున్నారు. మహిళలలో అకస్మాత్తుగా బరువు పెరగడం,  ముఖం పై మొటిమలు రావడం,  అవాంఛిత రోమాలు అతిగా పెరగడం,  నెలసరి సరిగా రాకపోవడం,  ఆలస్యంగా నెలసరి వస్తే అది తొందరగా తగ్గకపోవడం,  నెలసరిలో రక్తం ఎక్కువగా పోవడం వంటి లక్షణాలు పిసిఓయస్ ను సూచిస్తాయి. నిజానికి పిసిఓయస్ అనేది వ్యాధి కాదు.  ఇది శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది.  ఇది సాధారణంగా పెద్ద తీవ్రత లేకుండా ఉంటుంది.   మహిళలను కొన్ని రోజులు అసౌకర్యానికి గురి చేస్తుంది. కానీ కొన్నిసార్లు మాత్రం ఇది విశ్వరూపం చూపిస్తుంది.  పిసిఓయస్ కారణంగా మహిళలలో ఇతర వ్యాధులు కూడా వస్తాయి.  ఇవి మహిళలకు చాలా ఇబ్బందులు కలిగిస్తాయి. మహిళలు పిసిఓయస్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అవి ప్రాణాంతక వ్యాధులను ప్రేరేపిస్తుంది.  వాటిలో ముఖ్యమైనది మధుమేహం.  చిన్న వయసులోనే మహిళలకు మధుమేహం రావడంలో పిసిఓయస్,  హార్మోన్ల అసమతుల్యత ప్రధాన కారణం.   పిసిఓయస్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి.  పిసిఓయస్ లో బరువు పెరగడం అనే సమస్య ప్రధానంగా ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది క్రమంగా ఊబకాయంకు దారితీస్తుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా పిసిఓయస్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల వస్తుంది. మహిళలలో మానసిక సమస్యలు కూడా పిసిఓయస్ కారణంగా వస్తాయి.  సాధారణంగానే మహిళలలో హార్మన్ల మార్పు జరిగే పీరియడ్స్ సమయంలో మూడ్ స్వింగ్స్,  చిరాకు, కోపం, అసహనం వంటివి వస్తుంటాయి.  అలాంటిది పిసిఓయస్ సమస్యలో ఈ హార్మోన్ల అసమతుల్యత చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇది మానసిక సమస్యలు ఎక్కువగా కలిగిస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా పిసిఓయస్ ఉన్న మహిళలు గర్బం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఈ సమస్య తగ్గే వరకు గర్భం దాల్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి గర్భం దాల్చే ప్రయత్నాలు చేసే మహిళలు పిసిఓయస్  లేకుండా చూసుకోవాలి. పరిష్కారాలు.. పిసిఓయస్ సమస్యకు ఒక నిర్ణీత వైద్యం అంటూ లేదు. ఇది హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే సమస్య కాబట్టి మహిళలు హార్మోన్లు తిరిగి బ్యాలెన్స్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాలి.  అదేవిధంగా ఆహారంలో ప్రోటీన్లను చేర్చుకోవాలి. ఆకుకూరలు బాగా తినాలి. ఆహారం విషయంలోనే కాదు.. ఆహారం తినడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తం ఆహారం తినకుండా చిన్న చిన్న మొత్తాలను ఎక్కువ సార్లు తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇది పిసిఓయస్ తగ్గించడానికి సహాయపడుతుంది.                                              *రూపశ్రీ.

read more
గర్భిణి స్త్రీలు ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ ను అస్సలు వాడకూడదు..!

ప్రతి అమ్మాయి తన జీవితంలో బోలెడు సౌందర్య ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంది, వాడుతుంది కూడా.  అయితే అమ్మాయిల జీవితంలో సాధారణ దశలు వేరు.. గర్బవతులుగా ఉండే దశ వేరు.  ఈ కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భానికి హాని కలిగించే ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గర్భవతులకు హాని కలిగించే వాటిలో బ్యూటీ ఉత్పత్తులు కూడా ఉంటాయి. కొన్ని రకాల బ్యూటీ ఉత్పత్తులు గర్బంలో పెరుగుతున్న శిశువుకు హాని కలిగిస్తాయి. పుట్టుక లోపాలు రావడానికి కారణం అవుతాయి.   ఏ బ్యూటీ ఉత్పత్తులు గర్భవతులకు హాని చేస్తాయంటే.. రెటినోల్ కలిగిన ఉత్పత్తులు.. రెటినోల్ ఉత్పత్తులలో విటమిన్-ఎ ఉంటుంది.  ఇది ముడతలు,  మొటిమలు రాకుండా చేస్తుంది.  అయితే ఈ రకమైన ఉత్పత్తులు గర్బధారణ సమయంలో వాడితే కడుపులో బిడ్డకు హాని చేస్తుంది. సాలిసిలిక్ యాసిడ్.. సాలిసిలిక్ యాసిడ్ అనే రసాయనం  మొటిమలు తొలగించడం కోసం ఉపయోగించే క్రీములలో ఉంటుంది.  డాక్టర్ల సలహా లేకుండా సాలిసిలిక్ యాసిడ్ ఉన్న క్రీములు వాడటం మంచిది కాదు. హైడ్రోక్వినోన్.. చర్మాన్ని కాంతివంతం చేయడానికి హైడ్రోక్వినోన్ ఆధారిత క్రీములు వాడతారు. గర్భాధారణ సమయంలో దీన్ని వాడితే పిల్లలలో ఎదుగుదల మందగిస్తుంది. థాలేట్స్.. థాలేట్స్ అనే రసాయం ఎక్కువగా నెయిల్ పాలిష్,  సబ్బులు, హెయిర్ స్ప్రే వంటి అనేక ఉత్పత్తులలో ఉంటుంది.  ఇది పిండంలో హార్మోన్ల మార్పులు రావడానికి కారణం అవుతుంది. గర్భవతులు వీటికి దూరంగా ఉండాలి. ఆక్సిబెంజోన్, ఆక్సినోక్సేట్.. ఆక్సిబెంజోన్,  ఆక్సినోక్సేట్ అనే రసాయనాలు సన్ స్క్రీన్ లో ఉంటాయి.  ఇవి హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతాయి.  ఈ రసాయనాలు  లేని సన్ స్క్రీన్ ను గర్భవతులు ఉపయోగించాలి. అసిటోన్.. అసిటోన్ అనే రసాయనం నెయిల్ పాలిష్ లో ఉంటుంది.  గర్భిణీ స్త్రీలు నెయిల్ పాలిష్ వేసుకోవడానికి, దాని వాసనకు దూరంగా ఉండాలి.  ఇది చాలా హానికరం. విటమిన్-ఇ.. వైద్యుల ప్రకారం గర్భధారణ సమయంలో విటమిన్-ఇ టాబ్లెట్లు తీసుకోకూడదు.  ఇది మెదడుపై ప్రబావం చూపిస్తుంది.                                                *రూపశ్రీ.  

read more
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
మహిళలు గర్బం దాల్చడంలో మరింత గొప్ప ఫలితాలు పొందాలంటే ఈ టెస్ట్ బెస్ట్..

మహిళలు గర్బం దాల్చడంలో మరింత గొప్ప ఫలితాలు పొందాలంటే ఈ టెస్ట్ బెస్ట్..   గర్బం దాల్చడం, తల్లి కావడం ప్రతి ఆడపిల్ల కల. కానీ దురదృష్టవశాత్తూ  ప్రస్తుతకాలంలో 12నుండి 15శాతం జంటలు  పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భార్యాభర్తల ఇద్దిరలోనూ పిల్లలు పుట్టడంలో తగినంత సామర్థ్యం లేకపోవడం వల్ల  చాలామంది పిల్లల కోసం వైద్యుల చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు. లోపం ఎవరిలో ఉన్నా అది ప్రత్యక్షంగా మహిళల మీదే  కనిపిస్తుంది. కానీ చాలామంది మహిళలు గర్భం దాల్చడంలో  అవకాశాలు ఉన్నా కూడా విఫలమవుతుంటారు. దీనికి కారణం మహిళలకు గర్బం ధరించే సమయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో సరిగా అవగాహన లేకపోవడం. అయితే ఇప్పుడు దీన్ని కనుక్కోవడం సులభం. దీని వల్ల మహిళలు గర్బం ధరించే అవకాశాలు 20 నుండి 25శాతం ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎలా కనుక్కోవాలి? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. గర్భం దాల్చడానికి అద్బుతమార్గం.. మహిళలలో గర్బం దాల్చే అవకాశాలు  అండాలు విడుదల అయ్యే సమయంలో ఎక్కువగా ఉంటాయి. మూత్ర పరీక్ష ద్వారా అండోత్సర్గ పరీక్ష చేయించుకోవచ్చు.  ఈ అండోత్సర్గ పరీక్ష కిట్ సాధారణ మెడికల్ స్టోర్స్ లో దొరుకుతుంది. లేదా దీన్ని వైద్యుల పర్యవేక్షణలో కూడా చేసుకోవచ్చు.  సాధారణంగా మహిళలలో ఋతుచక్రం  28రోజులుగా ఉంటుంది. చివరిసారి ఋతుక్రమం ప్రారంభమైన 11వ రోజున ఈ పరీక్షను చేసుకోవాలి. అండాలు విడుదల కావడానికి మూడు నుండి ఐదు రోజుల ముందు ఈ పరీక్షను చేసుకోవాలి.  ఈ పరీక్షలో టెస్ట్ కిట్ రంగు మార్పు కనబడితే మరొక 24నుండి 36గంటలలో అండాలు విడుదల కావడం ప్రారంభమవుతుందని అర్థం. దీన్ని అర్థం చేసుకుని భార్యాభర్తలు సంభోగంలో పాల్గొంటే ఆ సమయంలో మహిళలు గర్బం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండోత్సర్గానికి ఐదు రోజుల ముందు నుండి అండోత్సర్గము తర్వాత చాలా గంటల వరకు గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఈ కాలాన్ని ఫెర్టిలిటీ విండో అంటారు.  అండోత్సర్గము కాలం గురించి తెలుసుకోవడానికి  అల్ట్రాసౌండ్ కూడా  చేయవచ్చు లేదా ఋతు చక్రానికి సంబంధించిన హార్మోన్ల స్థాయిలను తెలుసుకోవడానికి మూత్ర పరీక్ష చేయించుకోవచ్చు.  ఇంకొక మార్గం ఏమిటంటే  గర్భాశయ శ్లేష్మం పర్యవేక్షణ సహాయంతో  అండోత్సర్గము కాలాన్ని కూడా తెలుసుకోవచ్చు. అండాలు పర్ఫెక్ట్ గా విడుదల అయ్యే సమయాన్ని తెలుసుకోవడానికి ఈ మార్గాలు  ఉన్నాయి. ఇవే కాకుండా  పీరియడ్ ట్రాకింగ్ యాప్ ద్వారా కూడా దీన్ని తెలుసుకోవచ్చు.  గర్భం దాల్చాలనుకుంటే లేదా చాలా కాలంగా గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నట్లయితే,  వైద్యుని సలహా,  సహాయంతో ఈ మూత్రం అండోత్సర్గము పరీక్షను చేయవచ్చు. ఈ పరీక్ష సహాయంతో అండోత్సర్గము గురించి సమాచారాన్ని పూర్తీగా అర్థమవుతుంది కూడా.  తద్వారా  తొందరలోనే  గర్భం దాల్చవచ్చు.                                                             *నిశ్శబ్ద. 

read more
మహిళలలో PCOS, PCOD సమస్యలు తగ్గించే మూలికలు ఇవి..!

మహిళలలో PCOS, PCOD సమస్యలు తగ్గించే మూలికలు ఇవి..!   ఈ రోజుల్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (PCOD లేదా PCOS) మహిళల్లో అత్యంత సాధారణ సమస్యగా మారింది. అనారోగ్యకరమైన ఆహారం,  జీవనశైలి కారణంగా PCOD,  PCOS సమస్యలు పెరగుతున్నాయి. ఇది కాకుండా మహిళల్లో అనేక హార్మోన్ల మార్పులు కూడా కారణమవుతాయి. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) సమస్య గర్భధారణ సమయంలో మహిళల్లో కనిపిస్తుంది. 16 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. చాలా సార్లు ఈ వ్యాధి గురించి మహిళలకు కూడా తెలియదు. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా అండాశయాలలో గడ్డలు ఏర్పడతాయి.  వీటిని  సిస్ట్ అని పిలుస్తాము. ఇవి ఉంటే  గర్భం నేరుగా ప్రభావితమవుతుంది. అయితే జీవనశైలిని మార్చుకోవడం,  కొన్ని మందుల ద్వారా దీనిని నియంత్రించవచ్చు.  అలాగే కొన్ని రకాల మూలికలు తీసుకోవడం వల్ల కూడా  ఈ సమస్యలు తగ్గుతాయి. తిప్పతీగ.. ఈ మధ్యకాలంలో  తిప్పతీగ  మొక్క చాలా వైరల్ అవుతోంది. ఆయుర్వేదంలో తిప్పతీగ  చాలా ప్రభావవంతమైన మూలికగా పరిగణించబడుతుంది. తిప్పతీగ  తీసుకోవడం   PCOSని నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో ఎక్కువ ఆండ్రోజెన్ ఉత్పత్తి అయినప్పుడు మగ హార్మోన్లు పెరగడం ప్రారంభిస్తాయి. అలాంటి పరిస్థితిలో ఈ హార్మోన్లను సమతుల్యం చేయడంలో తిప్పతీగ  సహాయపడుతుంది. దాల్చినచెక్క..   శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగకుండా దాల్చిన చెక్క నిరోధిస్తుందని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంతో బరువు తగ్గుతారు.  ఇది PCOS రోగులకు సహాయపడుతుంది. పుదీనా.. PCOSలో  పుదీనా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పుదీనా టీ తాగడం వల్ల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది.  శరీరంలో అధిక జుట్టు పెరుగుదలను తగ్గిస్తుంది. అతిమధురం.. ఆయుర్వేదంలో అతిమధురం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అతిమధురం తీసుకోవడం వల్ల అండోత్సర్గ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది.                                                 *రూపశ్రీ.

read more
45 ఏళ్లు దాటినా యవ్వనంగా కనిపించాలంటే ఇవి ఫాలో కావాలి..!

45 ఏళ్లు దాటినా యవ్వనంగా కనిపించాలంటే ఇవి ఫాలో కావాలి..!   ప్రతి మహిళను అడిగినా తన వయసు ఉన్నదాని కంటే 5 నుండి 10 ఏళ్లు తక్కువ గా చెప్తుంది.  అయితే ఇది కొందరికి బాగా సెట్ అవుతుంది. కానీ మరికొందరికి సెట్ కాదు. ఎందుకంటే శరీరాన్ని చూసి కొందరు వయసు తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా చెప్పేస్తుంటారు.  అయితే ఎంత వయసు వచ్చినా యవ్వనంగా కనిపించాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు.. కానీ దానికి తగిన జీవినశైలి,  ఆహారపు అలవాట్లు, యవ్వనంగా కనిపించేలా చేసే చిట్కాలు పాటించకపోవడమే తప్పు.  ఈ కింద ఉన్న టిప్స్ పాటిస్తే 45 ఏళ్లు దాటినా స్కూల్లకు, కాలేజీలకు వెళ్లే పిల్లలు ఉన్నా హ్యాపీగా యూత్ లాగా కనిపించవచ్చు.   మహిళలు ఇంట్లో ఆహారాన్ని వండినప్పుడు కొన్ని ఆహారాలు మిగిలిపోతాయి. దానిని పారేసే బదులు దానిని మరుసటి రోజు తినడం చాలామంది మహిళల అలవాటు. కానీ  ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటిరోజు  తినడం     రోగనిరోధక శక్తికి,  పేగు ఆరోగ్యానికి చాలా హానికరం.  యవ్వనంగా కనిపించాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా ఉదయం నుండి రాత్రి వరకు తాజా ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. రోజుకు 4 లీటర్ల నీరు త్రాగితే బరువు తగ్గడానికి,  ఆరోగ్యకరమైన చర్మ సంరక్షణ కోసం అనువుగా ఉంటుంది.   నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీరు త్రాగవలసిన అవసరం లేదు. కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు త్రాగడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చు.  చర్మాన్ని మెరిచేలా, యవ్వనంగా ఉంచుకోవచ్చు. ఆహారాన్ని తీసుకునే విధానాన్ని ఆయుర్వేదం మూడు ముక్కలలో చెప్పింది.  ఉదయం భోగి లాగా,  మధ్యాహ్నం యోగి లాగా,  రాత్రి రోగి లాగా ఆహారం తీసుకోమని చెబుతుంది.  అంటే ఉదయం బాగా తినవచ్చు. అది రోజంతా పనిచేయడానికి శక్తిని ఇస్తుంది. మధ్యాహ్నం బోజనం మితంగా తినాలి. భోజనంలో కార్బోహేడ్రేట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నియంత్రణలో పెట్టాలి. ఇక రాత్రి సమయంలో చాలా తేలికగా తినాలి. రాత్రి నిద్రించే సమయం కాబట్టి బరువుగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు. రోజూ 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు వ్యాయామం చేయడం వల్ల  ఆరోగ్యంగా యవ్వనంగా ఉండవచ్చు. కానీ చాలామంది  వర్కవుట్ చేయడానికి సమయం ఉండదని చెబుతుంటారు. కానీ  ఈ అలవాటు భవిష్యత్తులో అనేక వ్యాధులకు దారి తీస్తుంది.  మహిళలు ఎంత బిజీగా ఉన్నా, 24 గంటలలో మీ కోసం అరగంట నుండి 45 నిమిషాల సమయం కేటాయించుకోవాలి.  తేలికపాటి వ్యాయామం చేయవచ్చు, వాకింగ్ చేయవచ్చు, యోగా చేయవచ్చు లేదా బరువులను ఎత్తవచ్చు. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.  ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది.                                                *రూపశ్రీ.

read more
మహిళలలో మెనోపాజ్ సమయంలో వచ్చే నిద్రలేమికి భలే పరిష్కారాలు.!

మహిళలలో మెనోపాజ్ సమయంలో వచ్చే నిద్రలేమికి భలే పరిష్కారాలు.!   ఆడవారి జీవితంలో ప్రతి దశలోనూ చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. 10 నుండి 15 ఏళ్ల మద్య మొదలయ్యే ఋతుచక్రం 40ఏళ్లు వచ్చేవరకు ఉంటుంది. ఆ తరువాత ఋతుచక్రం ఆగిపోతుంది. అన్నేళ్లు శరీరంలో క్రమానుసారంగా సాగిన ఈ ప్రక్రియ ముగిసిపోవడం కారణంగా మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమస్యలలో నిద్రలేమి ప్రధానంగా ఉంటుంది. సరిగా నిద్రలేకపోవడం, కలత నిద్ర, తలనొప్పి, శరీరంలో అసౌకర్యంగా అనిపించడం, హార్మోన్ సమస్యల కారణంగా నిద్ర సమస్యలు వస్తాయి. దీన్ని పరిష్కరించడానికి ఈ కింది చిట్కాలు సహాయపడతాయి. మెగ్నీషియం.. శరీరంలో స్కిరాడియన్ సైకిల్ లేదా సహజ గడియారం నియంత్రణ కోల్పోయినప్పుడు కండరాల కదలిక ఎక్కువగా ఉంటుంది. దీన్ని పరిష్కరించడానికి మెగ్నీషియం సహాయపడుతుంది. మెగ్నీషీయం తీసుకోవడం ద్వారా కండరాలు సడలించబడతాయి, నిద్ర గడియారం కంట్రోల్ లోకి వస్తుంది. నిద్ర బాగా పడుతుంది. అల్లం, జీడిపప్పు, బాదం, నువ్వులలో మెగ్నీషియం బాగుంటుంది. విటమిన్-ఇ మెనోపాజ్ సమయంలో శరీరంలో వేడి ఆవిర్లు పుడుతుంటాయి. రాత్రి సమయంలో చెమటలు కూడా పడతాయి.  విటమిన్-ఇ  శరీరానికి లభించేలా చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, కొబ్బరి, అవిసె గింజలు, పిస్తాపప్పులలో విటమిన్-ఎ సులభంగా దొరుకుతుంది. ఒమెగా-3 ఒమెగా-3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు మానసిక కల్లోలాన్ని, నిద్రలేమి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి.  చేపలు, సజ్జలు, బార్లీ, మొక్కజొన్న, రాగులు  మొదలైన వాటిలో ఒమెగా-3 లభ్యమవుతుంది. సోయా ఉత్పత్తులలో ఐసోప్లేవోన్ లు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ ను అనుసరిస్తాయి. శరీరంలో వేడి ఆవిర్లు తగ్గించడం, ఋతుక్రమం ఆగిపోయినప్పుడు కనిపించే లక్షణాలను నియంత్రించడంలో సహాయపడతాయి. అందువల్ల సోయా ఉత్పత్తులు వాడితే నిద్ర నాణ్యత బాగుంటుంది.                                        *నిశ్శబ్ద.

read more
షుగరింగ్, వ్యాక్సింగ్.. అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి  ఏ పద్దతి మంచిదంటే!

షుగరింగ్, వ్యాక్సింగ్.. అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి  ఏ పద్దతి మంచిదంటే!   అవాంఛిత రోమాలు అమ్మాయిల అందాన్ని పాడుచేస్తాయని నమ్ముతారు. అందుకే ఏదో విధంగా అవాంఛిత రోమాలను తొలగించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇలా అవాంఛిత రోమాలను తొలగించడానికి ఉపయోగించే పద్దతులలో షుగరింగ్, వ్యాక్సింగ్ కూడా ముఖ్యమైనవి. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది? అమ్మాయిలకు ఏదైతే సేప్ గా ఉంటుంది? చర్మ సంరక్షణ నిపుణులు ఏం చెబుతున్నారో ఓ లుక్కేస్తే.. షుగరింగ్.. షుగరింగ్ అనేది మధ్యప్రాచ్యంలో ఉద్భవించిన పురాతన  పద్దతి. అవాంఛిత రోమాలను తొలగించడంలో  ఇది సహజమైన పద్దతి.  షుగరింగ్ పేస్ట్‌ను రూపొందించడానికి చక్కెర, నిమ్మరసం,  నీటిని  ఉపయోగిస్తారు. దీన్ని చిక్కని పాకంలా సిద్దం చేస్తారు. దీన్ని అవాంఛిత రోమాల మీద ఉంచి గట్టిగా వెంట వెంటనే  లాగడం వల్ల   అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. షుగరింగ్ ప్రయోజనాలు..  ఈ పేస్ట్ సాధారణంగా సహజ పదార్ధాలను కలిగి ఉంటుంది.  ఇది సున్నితమైన చర్మ రకాలకు అనుకూలంగా ఉంటుంది. షుగరింగ్ వాక్సింగ్ కంటే తక్కువ చికాకును కలిగిస్తుంది.  ఎందుకంటే ఇది జుట్టును మాత్రమే తొలగిస్తుంది, చర్మానికి అతుక్కుపోదు. ఈ పేస్ట్ చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. జుట్టు తొలగింపు ప్రక్రియ తర్వాత సున్నితంగా,  మృదువుగా ఉంటుంది. చాలా మందికి  వ్యాక్సింగ్ కంటే షుగరింగ్  తక్కువ నొప్పి కలిగిస్తుంది. షుగరింగ్ గురించి కొన్ని నిజాలు.. షుగరింగ్ చేయడం నైపుణ్యంతో కూడినది. ఇది చేయడం రాకపోతే ఫలితాలు వేరేగా ఉంటాయి.   వ్యాక్సింగ్ తో పోలిస్తే షుగరింగ్ ఖరీదైనది. వ్యాక్సింగ్.. వాక్సింగ్ అనేది చర్మంపై వేడిచేసిన మైనపు పొరను అప్లై చేయడం.   అది గట్టిపడిన తరువాత జుట్టు పెరుగుదలకు వ్యతిరేక దిశలో లాగుతారు.  దీనివల్ల చర్మం మీద అవాంఛిత రోమాలు తొలగించబడతాయి. వాక్సింగ్  ప్రయోజనాలు..  వాక్సింగ్ పెద్ద మొత్తంలో జుట్టును త్వరగా తొలగించగలదు.  ఇది జుట్టు తొలగింపును తొందరగా  తొలగించడంలో సమర్థవంతమైన ఎంపికగా మారుతుంది. వాక్సింగ్ షేవింగ్‌తో పోలిస్తే దీర్ఘకాలిక ఫలితాలను అందిస్తుంది. ఎందుకంటే ఇది రూట్ నుండి జుట్టును తొలగిస్తుంది. వాక్సింగ్ కిట్‌లు వాడుకోవడానికి సులభంగా అందుబాటులో ఉంటాయి. వ్యాక్సింగ్ గురించి కొన్ని నిజాలు.. వాక్సింగ్ అనేది షుగరింగ్  కంటే ఎక్కువ బాధాకరంగా ఉంటుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారికి మంచిది కాదు. ఇది జుట్టుకు ,  చర్మానికి  రెండింటికీ అతుక్కుని ఉంటుంది. వ్యాక్సింగ్ వల్ల చర్మం ఎరుపుగా మారుతుంది. దీనివల్ల చికాకు పెట్టి ర్యాషెస్ కూడా వస్తాయి.  కొందరికి  వ్యాక్సింగ్ కు ఉపయోగించే  మైనపులోని పదార్ధాల కారణంగా  అలెర్జీ వస్తుంది.   ఇది చర్మం చికాకు,  అసౌకర్యానికి దారితీస్తుంది.                                             *నిశ్శబ్ద.

read more
ఈ లక్షణాలు కనిపిస్తే ఐరన్ లోపం ఉన్నట్టే..!

ఈ లక్షణాలు కనిపిస్తే ఐరన్ లోపం ఉన్నట్టే..! శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా రకాల పోషకాలు అవసరం.  వీటిలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు తప్పనిసరిగా ఉంటాయి.  భారతదేశంలో చాలామంది మహిళలు అనీమియా సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.  అనీమియా అనేది హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల వచ్చే వ్యాధి.  హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉండటానికి ఐరన్ లోపం ప్రధాన కారణం.  ఆడవారి శరీరంలో ఐరన్ లోపం ఉందా లేదా అనే విషయం వారికి నెలసరి సమస్యలు ఎదురైనప్పుడో లేదా జ్వరం లాంటి సమస్యలు వచ్చి రక్తపరీక్ష చేయించుకున్నప్పుడో బయటపడుతూ ఉంటుంది.  అలా కాకుండా ప్రతి మహిళ తనకు ఐరన్ లోపం ఉందా లేదా తెలుసుకోవాలంటే తమ శరీరంలో కొన్ని లక్షణాలు గమనించుకోవాలి.  ఐరన్ లోపం ఉంటే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే.. చాలామంది మహిళలు ఎప్పుడూ అలసటగా ఉందని కంప్లైంట్ చేస్తుంటారు. ఆహారం ఎంత తీసుకున్నా నీరసంగా ఉన్నట్టు,  బలహీనంగా ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు.  దీనికి కారణం ఐరన్ లోపించడమే. ఐరన్ లోపిస్తే శరీరంలో కణజాలాలకు, కండరాలకు ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉంటుంది.  ఈ కారణంగా బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. మహిళలు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి వైద్యులను కలిసినప్పుడు చాలామంది వైద్యులు చేసే మొదటి పని మహిళల కళ్లు గమనించడం. కనుగుడ్డు కింది భాగంలో కనిపించే చర్మం రంగును బట్టి మహిళలో ఐరన్ లోపాన్ని, హిమోగ్లోబిన్ శాతాన్ని అంచనా వేస్తారు. అంతేకాదు ఐరన్ లోపం ఉన్న మహిళల చర్మం పాలిపోయి, వడలిపోయినట్టు ఉంటుంది. ఏ చిన్న పని చేసినా ఎంతో శ్రమ చేసినట్టు ఫీలయ్యే మహిళలు ఉంటారు.  దీనికి కారణం ఐరన్ లోపించడమే.  ఐరన్ లోపించడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉంటుంది. దీనివల్ల తొందరగా అలసిపతారు.  శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా ఎదుర్కుంటారు. గుండె సమర్థవంతంగా పని చేయాలంటే ఆక్సిజన్ సరఫరా బాగుండాలి. కానీ ఆక్సిజన్ సరఫరా బాగుండేందుకు కావలసిన ఐరన్ లోపించినప్పుడు ఆక్సిజన్ సరఫరా మందకొడిగా సాగుతుంది.  దీని కారణంగా గుండె సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.  ఇది గుండె దడ,  గుండె పనిచేయడంలో ఆటంకాలు, కొన్ని సార్లు రక్తాన్ని పంప్ చేయడంలో అంతరాయం ఏర్పడి గుండె పోటు వంటి సమస్యలు కూడా వస్తాయి. మెదడు సమర్థవంతంగా పని చేయాలంటే మెదడుకు ఆక్సిజన్ సరఫరా బాగుండాలి. కానీ మెదడుకు ఆక్సిజన్ సరఫరా లోపిస్తే అప్పుడు మెదడు నరాల మీద ఒత్తిడి ఏర్పడుతుంది.  ఇది తలనొప్పికి కారణమవుతుంది.  ఐరన్ లోపించడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయి. కొన్ని సార్లు మైకం కూడా కలగవచ్చు. ఐరన్ లోపం ఉన్న మహిళలలో గోర్లు పెళుసుగా ఉంటాయి.  గోర్లు తెల్లగా కనిపించడం,  సున్నితంగా ఉండటం.  ఏమాత్రం తడి తగిలినా లేదా గోర్లను ఏవైనా తెరవడానికి ఉపయోగించినా గోర్లు చాలా సులభంగా విరిగిపోతుంటాయి. చాలామంది మహిళలకు తమ జుట్టు ఎందుకు రంగు మారుతోందో,  ఎందుకు పలుచగా అవుతోందో తెలియని గందరగోళంలో ఉంటారు. ఐరన్ లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయి. అంతేకాదు జుట్టు బాగా రాలిపోవడం, రాగి రంగులో ఉండటం,  తొందరగా తెల్లబడటం కూడా జరుగుతుంది.                                                    *రూపశ్రీ.  

read more
థైరాయిడ్ సమస్య ఉందా? ఈ ఆహారాలు అస్సలు తినకండి..!

థైరాయిడ్ సమస్య ఉందా? ఈ ఆహారాలు అస్సలు తినకండి..! చాలామంది మహిళలు సరిగా తినకపోయినా సరే లావుగా కనిపిస్తుంటారు. డైటింగ్ ఫాలో అయినా బరువు విషయంలో మార్పు ఉండదు. ఇలాంటి వారిలో థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరు అసమతుల్యంగా మారడం, శరీరంలో హార్మోన్లు హెచ్చుతగ్గులు కావడం వల్ల బరువు పెరుగుతారు. థైరాయిడ్ ఉన్నవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. లేకపోతే థైరాయిడ్ సమస్య మరింత ఉదృతం అవుతుంది. థైరాయిడ్ ఉన్నవారు అస్సలు తినకూడని ఆహారాలేంటో.. ఆయుర్వేదం వీటిని ఎందుకు తినకూడదని చెప్పిందో తెలుసుకుంటే.. పీనట్ బటర్.. (వేరుశనగ వెన్న) పల్లీలు లేదా వేరుశనగలను గ్రైండ్ చేసి పీనట్ బటర్ తయారుచేస్తారు. వేరుశనగలలో ఉండే గాయిట్రేజెన్ కంటెంట్ కారంగా హైపోథైరాయిడిజం మరింత తీవ్రమవుతుంది. హైపోథైరాయిడ్ ఉన్నవారు వేరుశనగ, వేరుశనగలతో తయారుచేసే పీనట్ బటర్ తినకూడదు. రాగులు.. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ రాగులు థైరాయిడ్ ఉన్నవారికి సమస్య పెంచుతాయి. రాగులు సాధారణ వ్యక్తులకు ఎంతో శక్తివంతమైన ధాన్యం.  వీటిలో కాల్షియం, ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. కానీ వీటిలో గోయిట్రోజెనిక్ ఉంటుంది. వీటిని తినాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. రాగులను బాగా నానబెట్టి, బాగా ఉడికించిన తరువాత నెలలో కెవలం రెండు మూడు సార్లు మాత్రమే తినవచ్చు. బాదం.. బాదంలో సెలీనియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ థైరాయిడ్ పనితీరుకు మంచివి. అయితే బాదం కూడా గోయిట్రోజెనిక్ ఆహారం. బాదంను ఎక్కువగా తీసుకుంటే  థైరాయిడ్ సమస్యను తీవ్రతరం చేస్తుంది. థైరాయిడ్ గ్రంధి ఎక్కువ పనిచేస్తే అయోడిన్ ను గ్రహించే సామర్థ్యంను తగ్గిస్తుంది. అందుకే థైరాయిడ్ ఉన్నవారు రోజుకు 3కు మించి బాదం పప్పులు తినకూడదు. సోయా.. సోయా ఆహారాలు కూడా థైరాయిడ్ లక్షణాలు ప్రభావితం చేస్తాయి.  థైరాయిడ్ గ్రందికి చికాకు కలిగించే గోయిట్రోజెన్లు సోయా ఉత్పత్తులలో ఉంటాయి. ఈ కారణంగా సోయా ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. గోధుమ.. థైరాయిడ్ ఉండి బాగా లావుగా ఉన్నవారు అన్నానికి బదులుగా చపాతీలు తినడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు.  కానీ థైరాయిడ్ ఉన్నవారు గోధుమలు తినకూడదు. గోధుమలలో ఉండే గ్లూటటెన్ గోయిట్రోజెనిక్ సమ్మేళనం. ఆటో ఇమ్యూన్ హైపోథైరాయిడ్ ఉన్నవారు గోధుమలు చాలా తక్కువగా తీసుకోవాలి. గ్లూటెన్ రహిత ఆహారం తీసుకునే వ్యక్తులు థైరాయిడ్ గ్రంధిపై దాడిచేసి యాంటీబాడీలను రక్తంలో తక్కువగా కలిగి ఉంటారు.                                              *నిశ్శబ్ద.  

read more
నెలసరి సరిగా రాకుంటే ఏం చేయాలి? వైద్యులు ఇచ్చిన సలహాలు పాటించేయండి..!

    మహిళలకు నెలలో 5 నుంచి 7 రోజులు పీరియడ్స్ రావడం అనేది సహజ ప్రక్రియ. పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, వెన్నునొప్పి, కడుపులో కండరాల  తిమ్మిరి గురించి మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు. దీనితో పాటు, కొన్నిసార్లు అధిక రక్తస్రావం సమస్య కూడా మహిళలను వేధిస్తూ ఉంటుంది.  మరికొన్ని రక్తస్రావం సరిగా కాకపోవడం కూడా ఎదురవుతూ ఉంటుంది. ఇలా రక్తస్రావం అధికంగా అయినా, అసలు రక్తస్రావం సరిగా కాకపోయినా కూడా మహిళలకు సమస్యే..   ఇవన్నీ ఒక ఎత్తైతే కొన్ని సార్లు మహిళలకు పీరియడ్స్ స్కిప్ అవుతూ ఉంటాయి. నెలసరి సక్రమంగా రాదు.  ఇలాంటి సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యల నుండి బయట పడటానికి  వైద్యులు చెప్పిన సలహాలేంటో తెలుసుకుంటే.. పీరియడ్స్ సక్రమంగా లేకుంటే మహిళలు తమ  జీవనశైలి, తీసుకునే  ఆహారం విషయంలో  కొన్ని ప్రత్యేక మార్పులు చేసుకోవాలి. అస్తవ్యస్తం అయిన  పీరియడ్స్‌ను క్రమబద్ధీకరించడానికి మొట్టమొదట చేయాల్సిన పని కెఫిన్‌కు దూరంగా ఉండటం. ఇందుకోసం టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. టీ, కాఫీలు మానేయడంతో  పాటు మార్కెట్ లో లభ్యమయ్యే  ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం మానేయాలి.  మార్కెట్‌లో లభించే ప్యాక్‌డ్ ఫుడ్‌కి నిర్మొహమాటం లేకుండా నో చెప్పడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు స్నేహితులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా కూడా ప్యాక్డ్ ఫుడ్ తినాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిలో సున్నితంగా ప్యాక్డ్ ఫుడ్ ను దాటవేయాలి. అలాగే వంటల్లో మైదా, ఇంకా రిఫైండ్ షుగర్  అయిన పంచదార వంటివి అధికంగా వాడుతుంటే వాటిని మానేయడం మంచిది.  ఆహారంలో అధిక కారం, అధిక నూనె, అధిక పులుపు,అధిక ఉప్పు వంటివి  తగ్గించాలి. ఇవన్నీ పాటిస్తూ ఉంటే శరీరంలో హార్మోన్లు నియంత్రణలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. పీరియడ్స్ ఎప్పుడూ క్రమబద్ధంగా రావాలి అంటే మంచి ఆహారపు అలవాట్లు ఫాలో అవ్వడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఆహారంలో తృణ ధాన్యాలు, మిల్లెట్లు భాగం చేసుకోవాలి. మిల్లెట్లు తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది.  ఆహారంలో పచ్చి పండ్లు,  పచ్చి కూరగాయలను చేర్చడానికి ప్రయత్నించాలి. కూరగాయల జ్యూస్ తో  పాటు ఆహారంలో మజ్జిగను చేర్చాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. మజ్జిగలో లభించే ప్రోబయోటిక్స్ హార్మోన్ల అసమతుల్యతను తొలగిస్తాయి.  ఇవన్నీ హార్మోన్లను సకాలంలో వచ్చేలా చేస్తాయి.                                                               *రూపశ్రీ  

read more
పెళ్లి తర్వాత అమ్మాయిలు ఎందుకు లావుగా మారతారో తెలుసా?

  ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.  చాలా స్పష్టంగా పెళ్లికి ముందు పెళ్ళి తర్వాత అని చెబుతుంటారు కొందరు. ఇది కేవలం జీవనశైలి గురించి మాత్రమే కాదు..ఆరోగ్యం, శరీరాకృతి గురించి కూడా. ముఖ్యంగా అమ్మాయిలను గమనిస్తే పెళ్ళికి ముందు సన్నగా, నాజూగ్గా ఉన్నవారు కాస్తా పెళ్లి తర్వాత లావుగా బొద్దుగా మారిపోతుంటారు. నిజానికి దీని వల్ల చాలామంది కామెంట్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే పెళ్లి తర్వాత అమ్మాయిలు లావు కావడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. పెళ్ళి నిశ్చయం అయినప్పటి నుండి పెళ్లి తంతు ముగిసిన భర్తతో కొత్త జీవితం మొదలు పెట్టడం వరకు అమ్మాయిల ఆహార  విధానాలు మొత్తం మారిపోతాయి. ఇక కొత్తగా పెళ్లైన జంట బయటకు వెళ్లడం. ఇద్దరూ కలసి సరదా కోసం ఆహారం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణంగా అమ్మాయిల ఆహారంలో కేలరీలు బాగా పెరుగుతాయి. ఇదే వారు లావు అవ్వడానికి కారణం అవుతుంది. ఆహార విధానం మారినా కొందరు బరువు పెరుగుతారు. పెళ్లయి అత్తవారింటికి వెళ్ళిన అమ్మాయిలు అక్కడి ఆహారపు అలవాట్లు. వంట విధానం, తినే వేళలు ఇలా ప్రతి విషయంలో మార్పులు ఎదుర్కుంటారు. ఈ కారణంగా  జీర్ణక్రియ కూడా మార్పులు చోటు చేసుకుంటుంది. కొత్త పద్దతికి జీర్ణ క్రియకు అలవాటు పడేవరకు బరువు పెరగడం కామన్. భార్యాభర్తలు కలిసి భోజనం చేయడం అనేది కొత్తజంటకు కామన్. ఒకరికొకరు ప్రేమగా తినిపించుకోవడం,  కొత్త కొత్త వంటకాలు ట్రై చేయడం, భోజనంలో కాస్త ప్రత్యేక వంటకాలు ఉండేలా చూసుకోవడం వంటి కారణాల వల్ల సాధారణం కంటే ఎక్కువ తింటూంటారు. ఇది కూడా అమ్మాయిలు బరువు పెరగడానికి కారణం అవుతుంది.                                             *నిశ్శబ్ద.

read more
ఆడవాళ్లు 30 ఏళ్లు దాటాక ఈ టెస్టులు ఖచ్చితంగా చేయుంచుకోవాలి..!

ఆడవాళ్లు 30 ఏళ్లు దాటాక ఈ టెస్టులు ఖచ్చితంగా చేయుంచుకోవాలి! మహిళ ఆరోగ్యం ఎప్పుడూ మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఒక్కోక్కో దశ దాటేకొద్దీ వారి ఆరోగ్య పరంగా సవాళ్లు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే వీటిని అధిగమించి సక్సెస్ గా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే మాత్రం కాస్త క్లిష్టమైన విషయమే.. కానీ  మహిళల ఆరోగ్య దృష్ట్యా ఇలా చేయడం తప్పనిసరి. అయితే మహిళలు 30ఏళ్లు దాటిన తరువాత కొన్ని టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలి. దీనివల్ల వారి భవిష్యత్తులో కొన్ని సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇంతకీ ఆ టెస్టులేంటంటే.. లివర్ టెస్ట్.. 30ఏళ్ల తరువాత నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా హైపటైటిస్ సి, హైపటైటిస్ బి వంటి లివర్ టెస్టులు తప్పకుండా చేయించుకోవాలి. కంటి పరీక్ష.. చాలామంది దృష్టిలోపం, కళ్లజోడు వాడటం లేదా కంటికి సంబంధించిన ఏవైనా ఇతర సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కంటి పరీక్ష చేయించుకుంటారు. కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి. ఆప్టిక్ నరాలకు ప్రమాదం ఉన్నట్టు తెలిస్తే మాత్రం రెగ్యులర్ గా పరీక్ష చేయించుకోవాలి. థైరాయిడ్.. 30ఏళ్ళు దాటాకా మహిళలకు థైరాయిడ్ ప్రమాదం ఎక్కువ. దీని కారణంగానే చాలామంది బరువు పెరగడం, బరువు తగ్గడం, చర్మం పొడిబారిపోవడం, గోళ్లు పెళుసుగా మారడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇవి మాత్రమే కాకుండా నిద్రలేమి, గుండె దడ, బరువులో ఊహించని మార్పులు కూడా ఉంటాయి. బోన్ టెస్ట్.. మగవారితో పోలిస్తే మహిళలలో ఎముకల సాంద్రత తక్కువగా ఉంటుంది. మహిళలలో ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువ వస్తాయి.   పైపెచ్చు బోలు ఎముకల వ్యాధి కూడా మహిళలలోనే ఎక్కువ. ఇక మహిళలలో గర్భం దాల్చడం ప్రసవం వంటి సమస్యల కారణంగా ఎముకలు బలహీనం ఉంటాయి.  అందుకే బోన్ టెస్ట్ చేయించుకోవాలి. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో సహాయపడుతుంది. ఈసీజీ.. ఈసీజీ ని ఎలక్ట్రో కార్డియోగ్రామ్ టెస్ట్ అని అంటారు. కుటుంబంలో ఎవరికి గుండెజబ్బు లేనప్పుడు 35 ఏళ్ల తరువాత ఈ టెస్ట్ చేయించుకోమని సజెస్ట్ చేస్తారు.  దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందే తెలుసుకోవచ్చు.  దీన్ని సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే మంచిది. ఇవి మాత్రమే కాకుండా.. కంప్లీట్ బ్లడ్ కౌంట్... ఎలివేటెడ్ సీరమ్ క్రియాటినిన్ పరీక్ష పెల్విక్ టెస్ట్ బ్రెస్ట్ టెస్ట్ STI వంటి టెస్టులు కూడా చేయించుకోవడం ద్వారా మహిళలు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు.                                    *నిశ్శబ్ద.

read more
మెనోపాజ్ దశలో మహిళలకు గుండెజబ్బుల ముప్పు ఎక్కువా? వైద్యులు చెప్పిన అసలు విషయాలు ఇవీ..!

మెనోపాజ్ దశలో మహిళలకు గుండెజబ్బుల ముప్పు ఎక్కువా? వైద్యులు చెప్పిన అసలు విషయాలు ఇవీ! మహిళల జీవితంలో  ఆరోగ్య పరంగా అనేక సవాళ్లు ఉంటాయి. ప్రతి దశలో విభిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. నెలసరి, గర్భం, ప్రసవం, తదుపరి ఎదురయ్యే దశ మెనోపాజ్.  ఈ మెనోపాజ్ తోనే మహిళల నెలసరి చక్రం ముగుస్తుంది. అయితే మెనోపాజ్ వల్ల మహిళలలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుందా? అంటే అవునంటున్నారు వైద్యులు. సాధారణంగా చాలా మంది మహిళల్లో 40ల మధ్య నుండి 50ల మధ్య వరకు మెనోపాజ్  సంభవిస్తుంది. ఈ దశలో, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిలో తగ్గుదలతో స్త్రీ శరీరంలో ప్రధాన హార్మోన్ల మార్పులు జరుగుతాయి. గుండె జబ్బుల నుండి స్త్రీలను రక్షించడంలో ఈస్ట్రోజెన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తనాళాలలో ఎర్రబడిన కణాలను తొలగించడంలో శరీరానికి సహాయం చేయడం ద్వారా అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  ఈ సమస్యలో ఫలకాలు ఏర్పడి అడ్డంకిని కలిగిస్తుంది. ఇంకా ఈస్ట్రోజెన్ ధమనులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది చెడు కొలెస్ట్రాల్ (LDL)ని తగ్గించడం ద్వారా రక్తపు లిపిడ్ స్థాయిలపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలు పెంచుతుంది. తత్ఫలితంగా, రుతువిరతి తర్వాత ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వలన అనేక గుండె జబ్బులలో కీలకమైన అథెరోస్క్లెరోసిస్ అభివృద్ధి చెంది  గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే మెనోపాజ్ అనేది మహిళలలో గుండె జబ్బులకు ఎక్కువ ఆస్కారం ఇచ్చే దశగా వైద్యులు పేర్కొంటున్నారు. ఈ దశలో మహిళలు 7 జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల నుండి జాగ్రత్త పడవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం..  పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారం గుండెకు మంచిది. సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ (క్రీమ్, వెన్న, రెడ్ మీట్), సోడియం (ఉప్పు జోడించడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు), జోడించిన చక్కెరలను తీసుకోవడం పరిమితం చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ..  వ్యాయామం బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.  మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెద్దలు శారీరక శ్రమ కోసం ప్రతి వారం కనీసం 150 నిమిషాల  తక్కువ నుండి ఎక్కువ తీవ్రత కలిగిన ఏరోబిక్ వ్యాయామం లేదా 75 నిమిషాల  కఠిన వ్యాయామాల నుండి ఏరోబిక్ వ్యాయామంలో పాల్గొనవచ్చు.  వీటిలో వారంలో రెండు రోజులైనా శరీర కండరాలను బలపరిచే వ్యాయామాలు తప్పనిసరిగా ఉండాలి. బరువు.. మెనోపాజ్ తర్వాత నెమ్మదిగా జీవక్రియ తగ్గుతుంది. శరీర కూర్పులో మార్పుల కారణంగా బరువు పెరగడం సాధారణం. ఆహారం, వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఒత్తిడి.. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె జబ్బులకు దోహదం చేస్తుంది. ధ్యానం, యోగా ఒత్తిడి స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ధూమపానం.. ధూమపానం గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. ధూమపానం మానేయడం మీ ప్రస్తుత వయస్సుతో సంబంధం లేకుండా  గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రెగ్యులర్ హెల్త్ చెకప్ లు.. రెగ్యులర్ చెక్-అప్‌లు ఆరోగ్య సమస్యలను డీల్ చేయడం సులభతరం చేస్తాయి.  ప్రాథమిక దశలోనే సమస్యలను గుర్తించడంలో సహాయపడతాయి. గుండె జబ్బులకు దారితీసే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు, మధుమేహం వంటి పరిస్థితులను పర్యవేక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి. హార్మోన్ థెరపీ.. హార్మోన్ థెరపీ అనేది మహిళ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే రుతుక్రమం ఆగిన లక్షణాలను డీల్ చేయడంలో సహాయపడుతుంది. గుండె ప్రమాదం విషయంలో కొంతమంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుంది.  వైద్యులను  సంప్రదించి హార్మోన్ థెరపీపై నిర్ణయం తీసుకోవాలి.                            *నిశ్శబ్ద.  

read more
మహిళల్లో ఐరన్ లోపం తగ్గాలంటే.. తినాల్సిన ఫుడ్స్ తినాల్సిందే!

మహిళల్లో ఐరన్ లోపం తగ్గాలంటే.. తినాల్సిన ఫుడ్స్ తినాల్సిందే! ఐరన్ శరీరానికి అవసరమైన పోషకాలలో ఒకటి. ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోని  స్త్రీలు  ఆరోగ్య పరంగా ప్రమాదానికి గురవుతారు. ముఖ్యంగా నెలసరి విషయాల్లోనూ, అధిక రక్తస్రావం వంటి కారణాల వల్లా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే  మహిళలు తమ ఆహారంలో ఖచ్చితంగా ఐరన్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. మహిళలు ఆహారంలో  చేర్చుకోవాల్సిన కొన్ని ఐరన్ రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకుంటే.. షెల్పిష్..  షెల్ఫిష్ మాంసాహారానికి చెందినవి. ఇవి రుచికరమైనవి  మాత్రమే కాదు పోషకమైనవి కూడా. వీటిలో  ఐరన్  అధికంగా ఉంటుంది.  ఇవి మాత్రమే కాకుండా క్లామ్స్, గుల్లలు,  మస్సెల్స్  వంటి సముద్రపు ఆహారాలలో ఐరన్ పుష్కలంగా   ఉంటుంది. బచ్చలికూర.. బచ్చలికూర తక్కువ కేలరీలు,  విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం. దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని విటమిన్ సి శరీరంలోని ఐరన్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది. బచ్చలికూరలో కెరోటినాయిడ్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.  ఇది వాపును తగ్గిస్తుంది.  కంటి ఆరోగ్యానికి మంచిది. మాంసం.. మాంసం శరీరంలో ఐరన్ లోపాన్ని కూడా తీర్చగలదు. ఇందులో ప్రొటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి.  విటమిన్ బి, కాపర్,  సెలీనియం  పుష్కలంగా ఉంటాయి. చిక్కుళ్ళు, బీన్స్, కాయధాన్యాలు, శనగలు, బఠానీలు,  సోయాబీన్ వంటివి పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. గుమ్మడికాయ గింజలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. 28 గ్రాముల గుమ్మడి గింజల్లో 2.5 మి.గ్రా ఇనుము ఉంటుంది. ఇవి మాత్రమే కాదు గుమ్మడికాయ గింజలలో  విటమిన్ కె, జింక్,  మాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటాయి.                                            *నిశ్శబ్ద.

read more
Papaya Leaves can Cure Dengue

Papaya Leaves can Cure Dengue Papaya leaves juice are a possible cure for dengue fever, a recent study revealed. It has been reported that many people consume papaya leaves or pegaga juice to increase their platelet count after they contract dengue fever. The study was initiated and led by Dr S. Kathiresan of AIMST University. Dr Kathiresan said the leaves of papaya fruit were high in complex vitamins that might help bone marrow to rapidly increase blood platelet production. “The dengue virus’ main effect is on platelet production. Normally, a platelet in our body lasts for about five to 10 days and the body replenishes them when required,” “This virus destroys the body’s capacity to produce new platelets (during the period the virus is effective). The platelet count for a normal person varies from 150,000 to 250,000 per micro litre of blood. On becoming infected, a patient’s platelet count starts falling. “A platelet count below 100,000 per microlitre is alarming – immediate medical attention is required. A platelet count below 50,000 can be fatal,” he added. A fall in the platelet count prevents formation of clots and this leads to haemorrhaging, which results in both internal and external bleeding. How should Take Accordingly it is raw papaya leaves, 2pcs just cleaned and pound and squeeze with filter cloth. You will only get one tablespoon per leaf.. So two tablespoon per serving once a day. Do not boil or cook or rinse with hot water, it will loose its strength. Only the leafy part and no stem or sap. It is very bitter and you have to swallow it like that.  

read more
గర్భిణులలో  రుమటాయిడ్ ఆర్థరైటిస్..ఇదెలా ప్రభావం చూపిస్తుందంటే!

గర్భిణులలో రుమటాయిడ్ ఆర్థరైటిస్..ఇదెలా ప్రభావం చూపిస్తుందంటే!   రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్య. సాధారణంగా మహిళలలో ఈ సమస్య గర్భవతులలో వస్తుంది.  ఇది ఒకరకమైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. అంటే  ఈ సమస్య చేతులు, మణికట్టు, మోచేతులు, మోకాళ్లు వంటి కీళ్ల భాగాల్లోనే కాకుండా శరీరంలో ఇతర కీళ్ల భాగాలలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది నయం చేయలేని జబ్బు అని అంటుంటారు. అయితే మధుమేహం, హైపోథైరాయిడిజం వంటి సమస్యల మాదిరిగానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా  నియంత్రణ ద్వారా సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది  గర్భవతులలో ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుసుకుంటే.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ల భాగంలో వచ్చే సమస్య. ఇది కీళ్ల భాగంలో వాపు, నొప్పి కలిగిస్తుంది.  ముఖ్యంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు శరీరంలో హార్మోన్స్ వాతావరణ శోథ నిరోధక స్థితికి దారితీస్తుంది. అయితే  రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న స్త్రీలు గర్భం దాల్చినప్పుడు మాత్రం దాన్నుంచి  రిలీఫ్ ఫీలవుతారు.  ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు కారణమయ్యే కణాలు, శరీరంలో విడుదల  అయ్యే సైటోకిన్ లు గర్భాధారణ సమయంలో అణిచివేయబడతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు గర్భధారణ సమయం ఆరోగ్యంగా గడవాలంటే  మావి పనితీరు సమర్థవంతంగా ఉండాలి. ఈ సందర్భంలో తల్లి గర్భంలో ప్లాసెంటా అనే అవరోధం ఏర్పడుతుంది. ఇది తల్లిలో ఉన్న రక్తప్రసరణను కడుపులో పెరుగుతున్న బిడ్డకు కలుపుతుంది.   దీనివల్ల తల్లి, బిడ్డలో కణాలు, అణువులు పరస్పరం మార్పిడి జరగడం, సంకర్షణ చెందడం జరుగుతుంది. దీనివల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డ పెరుగుదలకు అవసరమైన పోషణ లభిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న తల్లి రక్తంలో వివిధ రకాల ప్రతిరోధకాలు ఉంటాయి. ఇవి కేవలం తల్లి కీళ్ళను మాత్రమే కాకుండా రక్త నాళాలలో కూడా సమస్యలకు దారితీస్తాయి.  అందువల్ల ప్లాసెంటల్ రక్తనాళాలలో కణాలు, అణువులలో మార్పుల కారణంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారు,   రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేని వారితో పోలిస్తే ఆరోగ్య పరంగా  తేడాలు ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న మహగిళలలో ప్రీఎంక్లంప్పియా, రక్తపోటు, ఆకస్మికంగా అబార్షన్ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.  రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలావరకు జన్యు కారకాలతో ముడిపడి ఉంటుంది.  అయితే  ఇది తల్లి నుండి బిడ్డకు మాత్రం రాదు. ఈ సమస్య ఉన్న తల్లులు  రుమటాలజిస్ట్ సహాయంతో  సమస్యను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉంటే ఈ సమస్య ప్రభావం తక్కువగా ఉంటుంది.                                           *నిశ్శబ్ద.  

read more
హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే!

  హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే!   ఎక్కువశాతం ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్య ఈ రక్తహీనత. సాధారణంగా 12 శాతం ఉండాల్సిన రక్తం ఒకొక్కరికి 6 లేదా 5కి కూడా పడిపోయినపుడు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు చెప్పటానికి వీలులేనట్టుగా ఉంటాయి. ఎప్పుడయితే హిమోగ్లోబిన్ తగ్గుతుందో ఒంట్లో రక్తం ఉండాల్సిన ప్లేస్ ని నీరు ఆక్యుపై చేసి ఒళ్ళు బరువెక్కటం, కాళ్ళు తిమ్మెరలు, కూర్చుని లేచేటప్పుడు కళ్ళు తిరిగినట్టు ఉండటం, అధిక రక్తస్రావం ఇలాంటి సమస్యలు మొదలవుతాయి. హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే కొన్ని పద్దతులు పాటిస్తే మంచిది. మన శరీరంలో ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ సి, విటమిన్ బి12 ఇలాంటివాటిలో దేని పరిమాణం తగ్గినా అది రక్తహీనతకు దారి తీస్తుంది. వీటి లెవెల్స్ తగ్గకుండా చూసుకుంటే  చాలు, ఎలాంటి సమస్య ఉండదు. రక్తహీనతతో బాధపడే వాళ్ళు డాక్టర్ దగ్గరకి వెళితే ఐరన్ లేదా విటమిన్లతో కూడిన టాబ్లెట్స్ ఇస్తారు. అవి వాడితే సమస్య తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది కాని టాబ్లెట్స్ వాడటం ఆపగానే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. అందుకే టాబ్లెట్ల ద్వారా హిమోగ్లోబిన్ ను పెంచుకోవటం కన్నా మనం తీసుకునే ఆహారం విషయంలో  కాస్తంత జాగ్రత్త పాటింఛి దానిని పెంచుకోవటం  మంచిది  కదా. ఒంట్లో ఐరన్ శాతం తక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ తగ్గుముఖం పడితే అలాంటివాళ్ళు ఎక్కువగా పాలకూర, మెంతికూర, పెసరపప్పు, రాజ్మా, బీన్స్ మొదలయినవి తినాలి. నువ్వులు,బార్లి, బాదం పప్పు  తినటం కూడా మంచిది. మాంసాహారులు ఎర్ర మాంసం, చేపలు తింటే మంచిది.   అదేగనక ఒంట్లో విటమిన్ సి తక్కువగా ఉండి దానివల్ల హిమోగ్లోబిన్ శాతం తగ్గుతున్నట్లయితే అలాంటి వాళ్ళు జామకాయలు, బొప్పాయి, కివి పండు, కమలాపండు, ద్రాక్ష తీసుకోవాలి. అదే కూరగాయల్లో అయితే కాప్సికమ్, క్యాబేజ్, టమాటా  ఇలాంటివి ఎక్కువగా తినాలి. బాదం పప్పు రక్తాన్ని పెంచటంలో ఎక్కువ దోహదపడుతుంది. రక్తహీనత ఉన్నవాళ్లు రోజుకి 10 లేక 12 బాదం పప్పులు నానబెట్టుకుని తినాలి. బీట్రూట్ రక్తహీనతకు తిరుగులేని మందు. ఉదయం పూట ఒక గ్లాస్ పచ్చి బీట్రూట్ జ్యూస్ , 20 రోజుల పాటు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే బ్రౌన్ బ్రెడ్, పాస్తా, కార్న్ ఫ్లాక్స్ కూడా రక్తాన్ని వృద్ధి చేస్తాయి. మనం తీసుకునే ఆహారంలో ఇవన్ని ఉండేటట్లు చూసుకుంటే చాలు హిమోగ్లోబిన్ పెరగటానికి టాబ్లెట్స్ మీద ఆధారపడాల్సిన పని ఉండదు.   ..కళ్యాణి

read more