దోమలతో  యుద్దానికి ప్రపంచ దేశాలు సన్నద్ధం అవుతున్నాయి అని ఈ మధ్య రోజు వార్తలలో వింటున్నాం కదా.  జికా దోమను ఎదుర్కోవటం ఎలా అన్న విషయం లో ఎన్నో చర్చలు జరుగుతున్నాయి కూడా . అయితే ఈ జాతి దోమ మాత్రమే కాదు  మనకు వచ్చే ఎన్నో  ఎలర్జిలకు,జ్వరాలకు కారణం అవుతున్న ఎన్నో రకాల  దోమల బారినుంచి తప్పించుకోవటానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. 

 

మనం తరచూ దోమలు పోవటానికి వాడే లిక్విడ్ రీఫుల్స్ ,కోఇల్స్,ఇంకా మస్కిటో మాట్స్ వీటివల్ల దోమలకే కాదు మనకి కూడా ప్రమాదమే అని చెప్తున్నారు నిపుణులు. నమ్మకం కుదరకపోతే ఈ సారి ఏదైనా లిక్విడ్ రీఫుల్ ఇంటికి తెచ్చాక దానిలో ఉండే leaflet చదవండి, ప్రికాషన్ అని కనికనిపించని అక్షరాలతో రాసిన దగ్గర కొంతమందికి స్కిన్ ఎలర్జీలు, జలుబు, తుమ్ములు, దగ్గు,దురదలు,నరాల బలహీనత మొదలైనవి వస్తే వెంటనే డాక్టర్నిసంప్రదించండి అని ఉంటుంది. అందుకే ఎలాంటి రసాయనాలు లేని సహజ సిద్ద నివారణా మార్గాలు ని పాటిస్తే సరి. 

* మనం తినే కమలాపండు తొక్కల్ని ఎండబెట్టి వాటిని కాల్చితే చాలు దోమలు దూరం.

* పుదినా వాసనకి దోమలు ఆ దరిదాపులకి రావట.

* దోమలు ఎక్కువగా ఉన్న చోట ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో కర్పూరం బిళ్ళలు వేసి పెడితే చాలు.  దోమల ఉదృతి తగ్గుతుంది.

* అరటి తొక్కలు కాల్చినా  చాలు దోమలు మాయం అవుతాయి.

* వేపాకుల్ని ఎండబెట్టి కాల్చి ఆ పొగ పెట్టినా దోమలు రావు.

* వేసవి కలం లో అయితే మనకి ఈజీగా దొరికే మామిడిపండు తొక్కల్ని కాలిస్తే దోమలు ఇంట్లోకి రావటానికి కూడా భయపడతాయి.

ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో దోమలకి సులువుగా చెక్ చెప్పచ్చు . ..

                                                                             ----కళ్యాణి