యోగా శరీరానికి వ్యాయామం మేకాడు శరీర దారుడ్యానికి,మానసికంగా ఒత్తిడిని తట్టుకునేందుకు దోహదం చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మన ముఖాన్ని అందంగా ఉంచేందుకు యోగా ఉపయోగపడుతుందని అంటున్నారు నిపుణులు. యోగా చేస్తే జుట్టు పెరుగుతుందా సహజపద్దతిలో జుట్టు పెరగాలంటే ఈ యోగాసనాలు వేస్తే జుట్టు ఊడిపోవడం తగ్గిపోతుంది అని అంటున్నారు నిపుణులు.మీరు ఎన్నిరకాల ఉపాయాలు ప్రయోగించి నప్పటికీ జుట్టు రాలిపోవడం. పెరగడం ఆగిపోయిందా. అయితే మీకు చెప్పాల్సింది ఒకటే మీరు 5 రకాల యోగ ఆసనాలు వేస్తే మీజుట్టును అన్నిరకాల సమస్యలనుండి మీకు ఉపసమనం కలిగించడం లో సహాయ పడుతుంది.
జుట్టు రాలిపోవడం...
స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా సరే వారికురులు అంటే వారికి ప్రేమకలగడం సహజం.ప్రతి ఒక్కరికీ అందమైన మెరిసే జుట్టు ఉండాలని అది గాలికి అలా ఊగుతూ ఉంటె ఇంకాబాగుంటేనే ఇష్టపడతారు. కానీ నేటి జీవితంలో మనం అనుసరిస్తున్న జీవన శైలి కారణం గానే జుట్టు ఊడిపోవడం రాలిపోవడం. సహజమై పోయింది.ప్రజలు తమ అందమైన సిరోజాలకోసం ప్రజలు అత్యంత ఖరీదైన షాంపూలు కన్దీషనర్లు, వాడుతున్నారు. దీనికి తోడు మరిన్ని మందులు తీసుకుంటున్నారు.అయినప్పటికీ జుట్టు పై ఎలాంటి ప్రభావం ఉండడం లేదని చాలామంది ఆందోళన వ్యక్తం చేసారు.మీకు కొన్ని యోగా ఆసనాలు చూపిస్తాం దీనివల్ల దీనివల్ల మీజుట్టు రాలిపోకుండా ఊదిపోకుండా అలాగే దట్టంగా ఒత్తుగా నిగనిగలాడుతూ సిల్కీగా మెరుస్తూ ఉంటుంది
జుట్టు పెరగడానికి 5 యోగాసనాలు ఇవే...
వజ్రాసనం...
వజ్రసనాన్నితండర్ బోల్డ్ పోజు గా పిలుస్తారు. ఈ ఆసనం వేయడం ద్వారా మనశరీరంలో ఉన్న పంచేంద్రియాలు బలంగా ఉంచుతాయి.దీనివల్ల జుట్టులో ఉన్న మూలాలకు సరాసరి పోషకాలు లభిస్తాయి. మనజుట్టు పగిలిపోవడం రాలిపోవడం ఊడిపోవడం వంటివి సహజంగా జరుగుతాయి. వజ్రాసనం వేయడం ద్వారా ఒత్తిడి,సమస్యల నుండి దూరంగా ఉండేందుకు సహకరిస్తుంది.
అధోముఖ ఆసనం..
ఈ ఆసనం వేసినప్పుడు కుక్క ను పోలిన భంగిమలో శరీరాన్ని వంచుతారు. ఈ యోగ ఆసనం ద్వారా మనం ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది దీనివల్ల సమయానికి ముందుగానే వచ్చేబాల మెరుపు,తెల్లజుట్టు రాకుండా నివారించ వచ్చు.ఈ యోగా అసనం ద్వారా మన జుట్టును సహజమైన రంగు సజీవంగా ఉంచేందుకు సహాయ పడుతుంది అదీకాక మన స్కాల్ప్ లో రక్త ప్రసరణ వృద్ధి చెందుతుంది.
శీర్షాసనం...
ఈ ఆసనం వేయడం ద్వారా మన మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. దీనివల్ల జుట్టు రాలిపోవడం బట్టతల వచ్చే అవకాశం ఉంది.ఈ ఆసనం వేయడం ద్వారా జుట్టు తెల్ల బడడం మళ్ళీ జుట్టు మొలవడం జరుగుతుంది.
పవన ముక్తాసనం...
మన శరీరంలో ఉన్న గాలిని బయటకు వదిలి పెట్టేందుకు ఉపయోగ పడుతుంది. ఈ ఆసనం మన శరీరంలో ఉన్న పంచెంద్రియలాను బలంగా ఉంచుతుంది. దీనివల్ల జుట్టు పెరగడం సాధ్యమౌతుందని ఈ ఆసనం సాధన చేయడం ద్వారా జుట్టుకు సరైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
ఊష్ట్రాసనం...
ఈ ఆసనం ఒంటె ఆకారాన్ని పొలిఉంటుందని ఈ ఆసనాన్ని సాధన చేయడం ద్వారా మెదడులో రక్త ప్రవాహం సక్రమంగా జరుగుతుందని దీనివల్ల జుట్టు రాలడం పగిలి పోవడం తగ్గిపోతాయి. జుట్టులో మెరుపు వస్తుందని యోగసాధకులు అంటున్నారు.




