మనుష్యులను పట్టి పీడించే సమస్యలలో కీళ్ళ నొప్పులు,కీళ్లలో వాపులు. ఆర్త్రైటిస్,రోమటైడ్ ఆర్తరైటిస్, అన్నిటికన్నా అత్యంత భయంకరమైన మరోసమస్య ఆస్టియో ప్రోరోసిస్. ఆస్టియో ప్రోరోసిస్ ఎలాంటి వ్యాదిఅంటే ఇందులో ఎముకలు శక్తి క్షీణి స్తుంది. దీనికారణంగా ఎముకలు బలహీన పది పోవడం లేదా ఎముకలు క్షీణించి నుజ్జునుజ్జు అయిపోవడం ఎముకలలో శక్త్జి కోల్పోయి విరిగిపోవడంఎముకల నుండి రజను లాంటిపొడి రాలిపోవడం వంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.

ఆస్టియో ప్రోసిస్ కు కారణాలు...

ఆస్టియో ప్రోరోసిస్ ఎలాంటి వ్యాధి అంటే ముఖ్యంగా ఎముకలు క్షీణించి పోతాయి. వాటి అంతట అవే విరిగిపోతాయి. అవును ఆస్టియో ప్రోరోసిస్ వ్యాధిలో ఎముకలు ఎప్పుడైనా విరిగిపోవచ్చు. అయితే ఈ వ్యాధి 4౦ సంవత్సరాల తరువాత మాత్రమే వస్తుంది. అని అనుకుంటారు కాని నేటి ఆధునిక సమాజంలో చిన్న వయస్సు వారిని సైతం ఆస్టియో ప్రోరోసిస్ వస్తోందని నిపుణులు గుర్తించారు. అంటే 2౦ నుండి ౩౦ సంవత్సరాల మధ్య వయసు లో ఉన్న యువతను ఈ సమస్య తీవ్రంగా పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. 

ఆస్టియో ప్రొరోసిస్ మనలను ఈరకంగా ఇబ్బంది పెడుతుంది...

ఆస్టియో ప్రోరోసిస్ కు అసలు చికిత్చ లేదని అంటున్నారు నిపుణులు. ఈ సమస్య పట్ల ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంగా అక్టోబర్ మూడవ వారం లో వరల్డ్ ఆస్టియో ప్రోరోసిస్ డే ను నిర్వహిస్తున్నారు.

ఆస్టియో ప్రోరోసిస్ కు ప్రాధాన కారణాలు...

ఈ విషయం లో అయుర్వేద నిపుణులు రమాకాంత్ శర్మ మాట్లాడుతూ ఆస్టియో ప్రోరోసిస్ సమస్య ఎక్కువగా కాల్షియం,విటమిన్ డి ప్రోటీన్, పోస్పరస్ ఇతరమినరల్స్ తగ్గినండువల్లె ఆస్టియో ప్రోరోసిస్ కు కారణమని ముఖ్యంగా ఆస్టియో ప్రోరోసిస్ బారిన పడుతున్నవారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారన్న విషయం మరువరాదని ఎముకలు మాంస కండరాలు బలహీన పడడం దీనికితోడు జీవన శైలి లో మార్పులు నియంత్రణ చేసుకోవాలి సరైన పోషక విలువలు లేని ఆహారం సమయానికి ఆహార నియమాలు అలవాట్లను  జీవన శైలిని పాటించక కుంటే ఆస్టియో ప్రోరోసిస్ తీవ్రతను తగ్గించడం అసాధ్యం.

ఎముకలు బలహీన పడడానికి ఆస్టియో ప్రోరోసిస్ కు ప్రాధాన శత్రువులు ఇవే...

ఉప్పు...

సహజంగా ప్రతిఒక్కరు సేవిస్తూ ఉంటారు. ఉప్పు అతిగా సేవిస్తే మీ ఎముకలు శరీరం బలహీన పడతాయని తెలుసా?ఉప్పు అధికంగా తినడం వల్ల ఎముకలు బలహీన మౌతాయి. ఉప్పులో సోడియం మోతాదు ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా సోదియుం కాల్షియం ను బయటికి పంపిస్తుంది.ఈ కారణంగానే శరీరంలో కాల్షియం తగ్గుతుంది ఆశియా పేసిఫిక్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యుట్రిషియన్ లో అధ్యయనం వివరాలను ప్రచురించారు.ఎవరికైనా ఉప్పుపదార్ధాలు ఎక్కువగా తినే అలవాటు ఉంటె వారికి ఆస్టియో ప్రోరోసిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చక్కర...

పంచదార ఎక్కువగా తీసుకునే వారితో అత్యంత ప్రమాదకరం అతిగా పంచదార తింటే శరీరానికి ఆహారం తోపాటు ఇతర పోషక తత్వాలు లభిచవు. దీనివల్ల ఎముకల బలహీనపడి చర్మ సౌందర్యం కోలోపోతారు. వారి వయసుకన్న ఎక్కువవయసు ఉన్నవారిల కనిపిస్తారు.

కేఫెన్...

కేఫెన్ కూడా ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. కేఫెన్ మీ ఎముకల నుండి కాల్షియం తొలగిస్తుంది. అందుకే ఎముకలు బలహీనంగా ఉండడం మెత్తబడి పోవడం ఎముకలనుడి రాపిడి జరిగి సున్నం రాలినట్టు ఎముకలలో పట్టు కోల్పోవడం సంభవిస్తుంది.అందుకే చక్కర కలిపిన టీ, కాఫీ, చాక్లెట్ వంటి వాటిలో కేఫెన్ ఉన్నట్లు వీటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మధ్యం...

మధ్యం నేటి యువతను మత్తులోకి కూరుకు పోతోంది దీని కారణం గానే యువతమద్యానికి బానిసలుగా మారుతూ ఇళ్ళు ఒళ్ళు గుల్లచేసుకున్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.అతిగా మధ్యం సేవెంచడం వల్ల   నిద్రమత్తులోకి జారుకుంటూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.అని ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమైన విష్యం ఏమిటి అంటే రోజూ మధ్యం తాగడం వల్ల బోన్ డెన్సిటి స్కోర్ తగ్గడం వల్ల ఎముకల సాంద్రత గట్టితనం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.అది ఆస్టియో ప్రోరోసిస్ కు దారితీస్తుందని దీనికితోడు మీకు మద్యం అలవాటు ఉంటె ఆర్తరైటిస్,ఆస్టియో ప్రోరోసిస్ వంటి రోగాలు పెద్దకారకాలుగా చెప్పవచ్చు.

షోడా కూల్డ్ డ్రింక్స్...

మొత్తం పరిశోదన అంత సోడా లాంటి ద్రవపదార్ధాలు తీసుకోవడం వల్ల ఎముకలు బలహీన పడతాయి. సోడా ఎక్కువగా తాగడం వల్ల మీచర్మాం కాంతి ని కోల్పోతారు వ్యక్తి శరీరం వయస్సులో ఉన్నప్పటికీ వారికి ఎక్కువ వయస్సు ఉన్న వాళ్ళలా కనిపిస్తారు.

ఆహారం జీవన శైలిలో మార్పులు చేయండి...

ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రమాకాంత్ శర్మ వివరాల ప్రకారం ఉత్తమమైన ఆహారం పై శ్రద్ధ పెట్టాలని సూచించారు. జీవితం లో అంటే వయసులోని ప్రతిమలుపులో శ్రద్ధ పెట్టడం తప్పనిసరి ౩౦ సంవత్చ రాల తరువాత చాలా అప్రమత్తంగా ఉండాలి లేకుంటే ఆస్టియో ప్రోరోసిస్ ప్రమాదం పొంచి ఉందని అప్రమత్తంగా లేకుంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కష్టం.

*మీఆహారం లో ఆధిక మొత్తం  తీసుకోకుండా తగ్గించండి. ప్రతిరోజూ మామూలు భోజనం ఆకుకూరలు, మజ్జిగ, పెరుగు సలాడ్ వంటివి కలిపి తీసుకోండి.

*ప్రోటీన్ కోసం సోయాబీన్,స్ప్రవుట్స్,పప్పు, మొక్కజొన్న, బీన్స్, తది తరాలు మీ ఆహారం లో చేర్చండి. కాల్షియం లోపం తగ్గించేందుకు పాలు, పచ్చి పన్నీర్, పెరుగు,వెన్న,ఇతర పదార్ధాలు తీసుకోవచ్చు.

*అరటి పండులో కాల్షియం ఉంటుంది.రోజు కనీసం రెండు అరటి పండ్లు తినవచ్చు. దీనికితోడు అయాకాలాలలో వచ్చే ఫలాలను ఆహారం లో చేర్చండి.నట్స్ లో అపారమైన పోషక తత్వాలు బాండా గారం ఉంటుంది. కాల్షియం తో పాటు ఎముకలు ఆరోగ్యంగా ఉంచడం లో సహాయపడుతుంది.

*వీటితో పాటు నియమిత పద్దతిలో వ్యాయామం చేయండి దీనికోసం నిపుణుల సలహా సూచనలు తీసుకోండి ఫిజికల్ వర్క్ అవుట్ చేయడం వల్ల ఎముకలకు సంబందించిన సమస్యలు మరింత పెరిగే అవకాసం ఉంది.