గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కాలక్రమేణా పెరుగుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఈ వ్యాధి వృద్ధాప్య సమస్యగా పిలువబడింది. కానీ  ఇప్పుడు యువకులు కూడా దీని బారిన పడుతున్నారు. 10 ఏళ్లలోపు పిల్లల్లో కూడా గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి సమస్యలు నిర్ధారణ అవుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల దృష్ట్యా, అందరూ అప్రమత్తంగా ఉండాలని  గుండె జబ్బులు నివారించడానికి నిరంతరం కృషి చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మరణానికి ప్రధాన ప్రమాద కారకాల్లో గుండె జబ్బు ఒకటి, ప్రతి సంవత్సరం మిలియన్ల మంది మరణాలకు ఇది  కారణమవుతుంది. ప్రతి సంవత్సరం హృదయ సంబంధ వ్యాధుల  ప్రమాదాల గురించి ప్రపంచ ప్రజలను అప్రమత్తం చేయడం,  నివారణ పద్ధతుల గురించి వారికి అవగాహన కల్పించడం కోసం వరల్డ్ హార్ట్ డే ను  సెప్టెంబర్ 29న జరుపుకుంటారు. జీవనశైలి, ఆహారంలో అవాంతరాల వల్ల ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం బాగా పెరిగిందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. అయితే  రోజువారీ కింద చెప్పుకునే ఆహారాలు తీసుకోవడం వల్ల  గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధకులు తెలిపారు.  

అవోకాడో ..

అవకాడో గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన పండ్లలో ఒకటి. ఇందులో  మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.  ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతి వారం కనీసం రెండు  అవోకాడోలు  తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 16%,  కరోనరీ హార్ట్ డిసీజ్ ముప్పు 21% తగ్గుతుంది. అవకాడోలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది.

ఆకు పచ్చని కూరగాయలు..

 ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి  శరీరానికి రోజూ అవసరం. ఆకుపచ్చ ఆకుకూరలు,  బీన్స్ వంటి కూరగాయలను తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆకుపచ్చ కూరగాయలు విటమిన్ల మూలం, ఇది  ధమనులను రక్షించడంలో, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

నట్స్‌..

 రోజువారీ ఆహారంలో అనేక రకాల గింజలను చేర్చుకునే వ్యక్తులలో  గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉంటుందని  పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా వాల్ నట్స్  ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది ఫైబర్, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి సూక్ష్మపోషకాల మూలం. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో  సహాయపడుతుంది. వాల్‌నట్‌లు గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం అయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.

డార్క్ చాక్లెట్..

డార్క్ చాక్లెట్ వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా  వినే ఉంటారు. ఇందులో ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో చాలా మేలు చేస్తాయి. మితంగా చాక్లెట్ తీసుకోవడం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి. అధిక రక్తపోటు సమస్యను తగ్గించడంలో డార్క్ చాక్లెట్ తినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

                                         *నిశ్శబ్ద.