అరటిపండ్లు చిన్నా పెద్ద అందరికీ ఇష్టం. అన్ని తరగతుల వారికి అందుబాటులో ఉంటాయి. ఫలానా సీజన్ లోనే దొరుకుతాయనే బెంగ ఉండదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగినా, దేవుడి ముందు నైవేద్యం పెట్టాలన్నా పెద్ద పీట అరటిపండ్లకే ఉంటుంది. చాలామంది ప్రతిరోజూ అరటిపండ్లు తింటూంటారు. డైట్ మెనూలో భాగం చేసుకుని ఉంటారు.   వీటిలో పొటాషియం, ఫాస్పరస్, పెప్టిన్, గ్లూకోజ్, ప్రక్టోజ్, విటమిన్-సి, విటమిన్-బి6, ఫైబర్, ప్రోటీన్ మొదలైనవన్నీ ఉంటాయి. ఈకారమంగా ఇది మంచి పోషకాహార పండుగా పరిగణింపబడుతుంది. కానీ కొన్ని ఆహారాల కాంబినేషన్ ఆరోగ్యానకి మంచిది కాదని వైద్యులు చెప్పినట్టు.. అరటిపండుతో ఈ కింది ఆహారాలు తినడం అస్సలు మంచిది కాదు.

ప్రూట్ సలాడ్ లో భాగంగా అరటిపండుతో పాటు బోలెడు పండ్లు తింటారు. అయితే వీటిలో సిట్రస్ పండ్లు ఉంటే మాత్రం కొంప మునిగినట్టే. అరటి పండును సిట్రస్ పండ్ల కాంబినేషన్ తో ఎప్పుడూ తినకూడదు. దీనివల్ల కడుపులో గందరగోళం, తలనొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా నిమ్మ, స్ట్రాబెర్రీ, దానిమ్మ వంటి పండ్లతో అరటిని అవాయిడ్ చేయాలి.

చాలామంది అరటిపండును బ్రెడ్ తో తింటుంటారు. బ్రెడ్ స్టైసెస్ మీద అరటిపండు ముక్కలు పెట్టి తేనె లేదా చాక్లెట్ సిరప్ వేసి పిల్లలకు కూడా అందిస్తుంటారు. కానీ అరటిపండ్లు, బేకింగ్ చేసిన ఆహారాలు కలిపి తినడం ఎంతమాత్రం మంచిది కాదు. బేక్ చేసిన ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం, అరటిపండ్లు జీర్ణం కావడానికి తక్కువ సమయం పడుతుంది. రెండూ కలిపి తింటే జీర్ణాశయ సామర్థ్యం తగ్గిపోతుంది.

భోజనం తిన్నతరువాత చాలామంది పండు తింటూంటారు. ఎక్కువగా అరటిపండుకే ప్రాముఖ్యత ఇస్తారు. అయితే మాంసాహారం తో అరటిపండు తిన్నా, మాంసాహారం తిన్నవెంటనే అరటిపండు తిన్నా అది చాలా చెడు చేస్తుంది. మాంసంలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇది అరటిపండుకు విరుద్దమైన ఆహారం. పైపెచ్చు మాంసాన్ని వండటానికి మసాలాలు కూడా ఉపయోగిస్తారు.

మిల్క్ షేకులు ఈ కాలపు ఫెవరెట్ డ్రింకులు. శీతలపానీయాల వల్ల ఆరోగ్యం పాడవుతుంది, అందుకే మేము  ఆరోగ్యంగా ఉండేందుకు మిల్క్ షేక్ లు తాగుతాం అని బడాయి పోయేవారు ఈ విషయం వింటే షాకవుతారు. అరటిపండును ఎక్కువగా మిల్క్ షేక్ లలో వాడతారు. కానీ పాలు , అరటిపండు కలిపి తినడం జీర్ణాశయానికి అస్సలు మంచిది కాదు. ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. టాక్సిన్ లు విడుదల చేస్తుంది. ఫుడ్ పాయిజన్ కు కారణమవుతుంది. జీర్ణసంబంధ సమస్యలకు దారితీస్తుంది.

          *నిశ్శబ్ద.