ఉషాపానం ఇదేమిటి ఇదేదో సురాపానమా అని మాత్రం అనుకోకండి.అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పాలంటే ఉదయం పూట నిద్రలేవగానే పళ్ళు తోముకోకుండా నీటిని తాగితే ఏమౌతుంది? లాభమా నష్టమా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈవ్యాసం.ఉదయం వేళలో నిద్ర లేవగానే ముఖం కూడా కడుక్కోకుండా నీళ్ళు తాగడం మన పూర్వీకులకు అలవాటు. ఇది చాలా సహజమే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఏమిటి అంటే నిద్రలేవగానే ముఖం కడుక్కోకుండా మొట్టమొదట నీటిని తాగడం వల్ల మందులతో తగ్గని రోగాలు కూడా తగ్గుతాయని ప్రముఖనాడీ పతి వైద్యులు డాక్టర్ పి కృష్ణం రాజు తెలిపారు. తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ నిద్ర లేవగానే నీరు తాగడం వల్ల నోటిలో లాలా జలము అంతా కడుపులో చేరి శరీరానికి ఎంతో మేలుచేస్తుంది అని ఎన్నోరోగాలు తగ్గుతయాని అంటారు కృష్ణం రాజు. మనము ప్రతిరోజూ లాలాజలము బయటకు ఉమ్మివేస్తాము లాలాజలము బయటికి ఉమ్మివేస్తాము మీకు తెలుసా మీ లాలా జలము చాలా విలువైనది అద్భుతమైనది అని తెలియక దీనిని వృధా చేస్తున్నాము. ఇకపై దీనిని వృధా చేయకండి.మీరు ఉపయోగించుకోవాలని డాక్టర్ కృష్ణం రాజు తెలిపారు.నిద్రలేవగానే పళ్ళు తోముకోకుండా నీళ్ళు తాగి తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.పూర్వకాలం లో ఉదయం పూట నిద్రలేవగానే పళ్ళు తోముకోకుండా రాగి చెంబులో నీళ్ళు తాగడం ఆనవాయితీగా వచ్చేది.ఆతరువాతే వేపపుల్ల,లేదా గానుగ పుల్లలతో పళ్ళు తోముకునే వారని పెద్దలు చెప్పుకునే వారు.ఇదేమిటి నీరు తగిన తరువాత పళ్ళుతోముకోవడమా బ్యాడ్ ప్రాక్టిస్ మాత్రం కాదని పెద్దలకు తెలుసు.ఉదయం పరగడుపున అంటే నిద్రలేవగానే మొహం కూడా కడుక్కోకుండా మొట్టమొదటగా నీరు త్రాగాలి.పుక్కిలించకుండానీరు తాగాలనిఅంటారు అసలు దేని వెనక ఉన్నకారణం ఏమిటో తెలుసుకుందాం. మనము రాత్రి తిని పడుకున్నప్పుడు మనశరీరం లోని క్రిములన్నీ శిధిల మై పోతాయి. కానీ లాలా జలం క్రియ కొనసాగుతూ ఉంటుంది. అది నోటిలో రక రకాలుగా వుంటుంది. కడుపులోకి వెళ్ళదు. అది చాలా విలువైనది అదీ బ్రహ్మ ముహూర్తం లో లాలా జలము ఆసమయంలో ఎన్నో రెట్లు విలువైనదిగా పేర్కొన్నారు.లేచిన వెంటనే నీరు త్రాగడం వల్ల అందులో లాలాజలము అంతా కడుపులో చేరి శరీరానికి ఎంతో మేలుచేస్తుంది.దీనికారణంగా షుగర్ కంట్రోల్ కు వస్తుంది.ముఖ్య్సంగా కడుపులో పుండ్లు,కురుపులు చాలా కాలానికి కానీ మందులతో తగ్గవు.వీరు ఇలా చేస్తే అద్భుత మైన ఫలితాలు చూడవచ్చని డాక్టర్ కృష్ణం రాజు పేర్కొన్నారు.ఇంతే కాకుండా ఉదయం లేవగానే మన నాలుక మీద ఉన్న ఉమ్మిని తీసుకుని కంటిలో పెట్టుకుంటే. కంటి సమస్యలు పోతాయాని అలాగే చర్మం.ముఖం అలాచేయడం వల్ల అద్భుతమైన మార్పులు గమనించవచ్చని అన్నారు ఇందుకు ఉదాహరణగా జంతువుల నుండి మనం గ్రహించాల్సిన విషయం అదే. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ ప్రదేశం లో అక్కడ నాలుకతో నాకడం మొదలుపెడతాయి. లాలా జాలం లో 18 రకాల పోషకాలు ఉన్నాయని అంటారు.కృష్ణం రాజు. అందుకే మన లాలాజలము విలువైనదే అని అంటారు.ఈ పద్దతిని ఉపయోగించడం ద్వారా ఇదే ఉదయం వేళలో ఉషాపానం లో ఉండే ఆరోగ్య రహాస్యం అని అంటున్నారు డాక్టర్ కృష్ణం రాజు.మీ ఆరోగ్యం మీచేతుల్లోనే ఉందన్న విషయం గ్రహించండి. ఆరోగ్యంగా ఉండండి.




