శరీరానికి మత్తును ఇచ్చేవాటిలో మద్యపానం ఒకటి. ధూమపానం, మధ్యపానం ప్రజలను ఎంతో వేధిస్తున్న అలవాట్లు. వీటి కారణంగా వైవాహిక బంధాలు, కుటుంబాలు కూడా విచ్చిన్నం అవుతున్నాయి. అయినా కూడా మద్యపానం మీద ఆసక్తి ఉన్నవారు దీన్ని తీసుకోవడంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు. పైపెచ్చు అన్నింటికంటే తాగడమే ముఖ్యం అనుకుంటారు. వీరు మత్తుకు బానిసలైపోయి ఉంటారు. అయితే మధ్యపానం సేవించడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు కూడా వస్తాయని తెలిసిందే. అయితే ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు మద్యపానం గురించి మరిన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. ఈ విషయాల గురించి తెలుసుకుంటే షాకవడం పక్కా..
మద్యపానం సేవించేవారు తమకు మత్తు వస్తుందని, దాని వల్ల ఎంతో సంతోషం కలుగుతుందని చెబుతారు. అయితే మద్యపానం తీసుకోవడం వల్ల మెదడు పరిమాణం తగ్గుతుందనే షాకింగ్ విషయం బయటపడింది. ఇది మాత్రమే కాకుండా మద్యపానం సేవించడం వల్ల ఆహారం ద్వారా శరీరంలో చేరే ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, విటమిన్-బి12, ఒమేగా కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం మొదలైన విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందవు.
ఆహారం ద్వారా శరీరానికి లభించే మినరల్స్ మెదడు పరిమాణాన్ని పెంచి హానికరమైన తెల్ల పదార్థాన్ని తగ్గిస్తాయి. కానీ మద్యపానం తీసుకోవడం వల్ల ఈ ప్రక్రియ కుంటుపడుతుంది. దీని వల్ల శరీరం బ్యాలెన్స్ కోల్పోవడం, బలహీనంగా మారడం జరుగుతుంది. మద్యపానం ఎక్కువగా తీసుకునేవారిలో ఎక్కువగా మెగ్నీషియం లోపం ఏర్పడుతుంది.
మెగ్నీషియం లోపాన్ని ఎలా నివారించాలంటే..
మెగ్నీషియం లోపాన్ని నివారించాలంటే ప్రతిరోజు సుమారు 450mg మెగ్నీషియం తీసుకోవాలి. రోజూ 550 mg మెగ్నీషియం తీసుకునే వారి మెదడు 350 mg తీసుకునే వారి కంటే ఎక్కువ తెలివి తేటలతోనూ, పదునుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి పుష్కలంగా ఆహారం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం, మతిమరుపు వంటి సమస్యలుండవు. ముఖ్యంగా చిన్నవయసు నుండే మెగ్నీషియం పుష్కలంగా తీసుకునేవారికి 40ఏళ్ళ తర్వాత త్వరగా మతిమరుపు రావడం అనే సమస్య అసలే ఉండదు.
*నిశ్శబ్ద.