ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య పొట్ట పెరగడం. దీన్నే అందరూ పొట్ట పడింది అంటూ ఉంటారు. కొందరికి పొట్టలో నీరు చేరుతుంది. పొట్టలో 12 లీటర్ల నీరు చేరితే తప్ప నీరు చేరినట్లు స్పష్టంగా కనబడదు. పొట్టలో నీరు చేరడాన్ని 'ఎసైటిస్' అంటారు. జీర్ణకోశం నుంచి లివర్ కి వెళ్ళే రక్తనాళాలకి ఏదైనా అడ్డంకి ఏర్పడితే పొట్టకి నీరు చేరడం అతి సహజం. ముఖ్యంగా లివర్ కుదించుకు పోయినప్పుడు (సిర్రోసిస్ లివర్) పొట్టకి నీరు చేరుతుంది.
గుండె పెరిగినప్పుడు, మూత్ర పిండాలు దెబ్బతిన్నప్పుడు పొట్టకి నీరు వస్తుంది. కడుపులో క్షయవ్యాధి, క్యాన్సర్, ఇతర వ్యాధులు వచ్చినప్పుడు కడుపుకి నీరు చేరడం సహజం. లివర్, పాన్ క్రియాస్, జీర్ణకోశం, గర్భకోశం, అండాశయాలకి టి. బి కేన్సర్ వచ్చినప్పుడు సాధారణంగా పొట్టకి నీరు చేరు తుంది.
కొందరికి పొట్టకి నీరు చేరడంతోపాటు కాళ్ళకి, ముఖానికి, శరీరం అంతటికీ కొద్దో గొప్పో వీరు వస్తుంది ఈ పరిస్థితిని'నెఫ్రొటెక్' సిండ్రోమ్' అనుకోవచ్చు. ముందుగా కాళ్ళకి వీరు కనిపించి, ఆ తరువాత పొట్టకి నీరు చేరడం అంటే గుండె పెరగడంవల్ల అని అనుమానించవచ్చు.
పొట్ట బానలాగా తయారై పొట్టకి విజరీతంగా నీరు మరి కొద్దిపాటి నీరు కాళ్ళకి వుంటే 'సిర్రోసిస్ లివర్' అనుకోవచ్చు. పొట్టకి నీరు చేరడమే కాకుండా పచ్చకామెర్లు (జాండిస్) కూడా వుంటే పోర్టల్ వెయిన్ ఆల్ స్ట్రక్షన్ అను కోవచ్చు. పోర్టర్ వెయిన్ అల్సక్షన్లో రక్తంలో ప్రోటీను శాతం బాగా తక్కువగా వుంటుంది.
ఏ సమస్య ఎలా ఉంటుంది??
సిర్రోసిస్ :- సిర్రోసిస్ లివర్ (లివర్డి స్యూ పూర్తిగా పాడై కుదించుకుపోవడం) ఉన్న వ్యక్తి అంతకు ముందు మధ్యం అతిగా సేవించడం జరిగి ఉండవచ్చు లేదా అంతకు ముందు ఏదైనా ఇన్ ఫెక్షను వచ్చి కాలేయం బాగా దెబ్బతిని ఉంటుంది. కొందరిలో అంతకు ముందు రక్తం వాంతి అవడం, విరోచనంలో నల్లగా రక్తం పోవడం, కామెర్లు రావడం ఉంటాయి. కోసిస్ పరిస్థితి ఉన్న వారి బుగ్గలు ఎరుపుగా వుంటాయి. బొడ్డు దగ్గర రక్తనాళాలు ఉబ్బి స్పష్టంగా కనబడతాయి. వికారం, ఆకలి లేకపోవడం వుంటాయి. కొందరిలో మొదట్లో లివర్ స్క్రీన్ పెరిగి కనబడటుంది. సిర్రోసిస్ లివర్ లో కొందరికి పచ్చ కామెర్లు ఉంటాయి.
మూత్రపిండాల వ్యాధి : మూత్రపిండాల వ్యాధి వల్ల పొట్టకి నీరు చేరటమేకాకుండా, ముఖానికి, కాళ్ళకి . నీరు చేరుతుంది. మూత్రంలో ఆల్బుమిన్ కనబడుతుంది. మైక్రోస్కోప్ పరీక్ష చేస్తే ఎపిథీలియల్ కాస్ట్స్ ఉంటాయి.
గుండెజబ్బు: గుండె పెరిగినప్పుడు సిరలన్నీ ఉబ్బుతాయి. మెడదగ్గర రక్తనాళాలు ఉబ్బి కనబడతాయి. కాలేయం ఉబ్బుతుంది. గుండె పెరిగినప్పుడు ముందు కాళ్ళకి, ఒంటికి నీరు కనబడి ఆ తరువాత పొట్టకి నీరు కనబడుతుంది. గుండె పెరగగా పొట్టకి నీరు చేరిన పరిస్థితిలో వ్యక్తి ఆయాసపడటం వుంటుంది.
'థాలస్ ఎసైటిస్' లో పొట్టలో చేరిన నీరు పాల లాగా కనబడుతుంది. నీరు పాలలాగా కనబడటానికి కడుపులో వున్న ప్రధాన ఎంఫాటిక్ నాళానికి అడ్డంకి ఏర్పడటం లేదా క్యాన్సర్ కణాలు చేరడం కారణం. బోదకాలు వున్న వారిలో కూడా బోద వ్యాధివల్ల పొట్టలో ఖైల్ చేరి నీరు పాలలా కనబడుతుంది.
ఇన్ని రకాల సమస్యలను మీరే డిసైడ్ చేసుకోకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.
◆నిశ్శబ్ద