ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో ఆహారం వండుకోవడానికి సమయం సరిపోక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు.  ఇంట్లోనూ,  బయటా రెండు చోట్లా ఒత్తిడితో కూడుకున్న పనులు.  సమయాభావం కారణంగా చాలా సార్లు వండుకోవడం కష్టంగా మారుతుంది.  ఇలాంటి సందర్బాలలో బయట ఆహారం తినాలని  అనుకున్నా అవి ఖర్చుతో కూడుకుని ఉండటం తో వాటి వైపు వెళ్లాలన్నా కూడా భయపడతారు. ఇలాంటి వాళ్లను టార్గెట్ చేసుకుని వచ్చినవే ప్యాకేజ్డ్ ఫుడ్స్.. వీటిలో రెడీ టూ యూజ్  ఫుడ్స్ చాలా ఉంటున్నాయి.  సింపుల్ గా వేడి నీరు పోయడం లేదా వేడి చేయడం ద్వారా నిమిషాలలో ఆహారం రెడీ అవుతుంది.  పైగా మంచి మసాలాలతో రుచిగా ఉండటంతో రెడీ టూ యూజ్  పుడ్స్ కు మంచి డిమాండ్ కూడా ఉంది.  చిన్న పిల్లలు,  యువత ఎక్కువగా ఈ రెడీ టూ యూజ్ ఫుడ్స్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు.  అయితే ఈ ఫుడ్స్ గురించి చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అసలు రెడీ టు యూజ్ ఫుడ్స్ అంత రుచిగా ఎందుకుంటాయి? వీటిని తినడం వల్ల కలిగే ప్రమాదం ఏంటి? తెలుసుకుంటే..

రెడీ టూ యూజ్ ఫుడ్స్.. అల్యూమినియం సాల్ట్..

సాధారణంగా రెఢీ టూ యూజ్ ఫుడ్స్ అన్నీ ప్యాక్డ్ ఫుడ్స్ గానే ఉంటాయి. ఈ ప్యాక్స్ లోని ఆహారాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా వాటిలో హానికర రసాయనాలు కలుపుతారు. మరీ ముఖ్యంగా నిత్యం ఇంట్లో ఉపయోగించే కారం, పసుపు, మసాలలో అల్యూమినియం సాల్ట్స్ ను కలుపుతున్నారు. వీటివల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని,  వీటిని వాడటం వల్ల చిన్నపిల్లలు , వృద్దులు,  అప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రెడీ టు యూజ్ ఫుడ్స్ తో వచ్చే వ్యాధులు..

రెడీ టూ యూజ్ ఫుడ్స్ లో ఆలమ్ స్పైస్ కలుపుతారు.  ఇది కలిపిన మసాలాలు ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిని నరాల బలహీనత, మతిమరుపు లాంటి సమస్యలు వస్తున్నాయి.  50ఏళ్లు దాటిన వారిలో మతిమరుపు రావడం ఈ ఆలమ్ స్పైస్ వాడటం వల్లే అని స్పష్టం చేస్తున్నారు.

అసలేంటీ ఆలమ్ స్పైస్..  

అల్యూమినియం సాల్ట్ నే ఆలమ్ స్పైస్ అని అంటారు. అల్యూమినియం పొటాషియం సల్పేట్ నే అల్యూమినియం సాల్ట్ అని అంటారు.  మసాలా దినుసులు పాడవకుండా దీన్ని కలుపుతుంటారు. దీని వల్ల మసాలా దినులు ఎక్కువ కాలం పాటూ రుచి,  స్వభావం,  రంగు  మారకుండా పురుగులు పట్టకుండా, అలాగే మసాలాలు ఉండలు కట్టకుండా సహాయపడుతుంది. ప్యాకింగ్ ఫుడ్స్ లో దీన్ని మోతాదుకు మించి వాడుతుండటం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి.  అందుకే వీలైనంత వరకు మసాలా పొడులను కూడా బయటి నుండి తెచ్చుకోవడం కంటే.. ఇంట్లోనే తయారు చేసుకుని వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

                                     *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...