అసలు రోగం రానే కూడాడు వచ్చిందా శరీర తత్వాన్ని బట్టి ఆ వ్యక్తి లో రోగ నిరోధక శక్తి ఉంటె మాత్రమే రోగాల నుండి తట్టుకోగలడు. అయితే అసలు రోగాలు రాకుండా చూసుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు అది ఎలా సాధ్యం? సాధ్యమే అని అంటున్నారు నిపుణులు... మన చుట్టూ ఉండే వాతావరణం లో ఎన్నో రకాల వైరస్ లు బాక్టీరియా,ఫంగస్, పరాసైట్స్ , లాంటివి అదృశ్యంగా దాగి వుంటాయి . మన శరీరం లోకి ప్రవేశించడానికి తహ తహ లాడుతూ ఉంటాయి. సాధారణ జలుబు నుండి ఫ్లూ దాకా ఎన్నో వ్యాధులు గాలిలో తేలియాడే వైరస్లు మూలంగానే సోకుతాయి వీటి బారినుంచి. శరీరాన్ని రక్షించేది మన శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ ను పటిష్ట పరుచుకోవడంద్వారా శరీరాన్ని మనం రోగాల బారినుండి రక్షించుకున్న వాళ్ళ మౌతాము. మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకున్న వాళ్ళ మౌతాము.ఆరోగ్యం గురించి ఆలోచించ దల్చుకున్నాప్పుడు మొదట రోగ నిరోధక వ్యవస్థ మీద దృష్టి నిలపాల్సి ఉంటుంది. మతి మాటికి ఇన్ఫెక్షన్ కి గురి అవుతూ మీ శరీరం రోగాల బారిన పడుతుంటే మీ లోని రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడిందని దానిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అర్ధం చేసుకోవాలి.
శారీరక వ్యాయామం...
రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకోవాలంటే ఎక్సర్ సైజ్ లు చక్కగా ఉపక రిస్తాయి. శారీరక వ్యాయామం చేయడం మూలంగా మీలో రోగనిరోదక సామర్ధ్యం పెరగడమే కాకుండా శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. గుండె,ఊపిరి తిత్తుల కండరాలు బల పడతాయి.
1) వ్వయస్సు పెరుగుతున్న కొద్దీ సహజంగానే మనలో రోగాల్ని తట్టుకునే శక్తి పోతుంది.ఎక్సర్ సైజ్ లు తరిగిపోవాదాన్ని అడ్డుకుంటాయి.
2) అమెరికాలో జరిపిన ఒక పరిశీలనలో రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ లు చేస్తూ తగిన ఫిట్నెస్ సాధించిన వాళ్ళ లో 7౦ఏళ్ళు పై బడిన అమ్మమ్మ లలో రోగాల్ని నిలువరించే శక్తి వాళ్ళలో సగం వయస్సు ఉన్న స్త్రీల స్థాయిలో ఉన్నట్లుగా తెలిసింది. అలాగే ఏ పనిపాటా చేయని అదే వయస్సులో ఉన్న మిగతా ముసలి వాళ్ళ కంటే 55% ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు ఉన్నట్లు సమాచారం. మరో విషయం ఏమిటి అంటే మంచి ఫిట్ నెస్ లో ఉన్న 7౦ ఏళ్ళు పై బడ్డ వృద్ధులు అంతా 6౦ ఏళ్ళు పై బడ్డాక ఎక్సర్ సైజ్ లు చేయడం మొదలు పెట్టారు. దానిని బట్టి అర్ధమయ్యింది ఏమిటి అంటే ఎక్సర్ సైజ్ ను ప్రారంభించడానికి వాటిద్వారా బెనిఫిట్ పొందడానికి ఒక వయస్సు అంటూ ఏమీ లేదు. ఏ వయస్సు నుంచి అయినా వయో వృద్ధులు సైతం ప్రారంభించ వచ్చు.
ఏది చేసినా అతిగా వద్దు...
కొంతం మంది క్రీడా కారులు ముఖ్యంగా పరుగు పందేలాలో పాల్గొనే వాళ్ళు ఎక్కువగా శ్వాస సంబంధమైన ఇన్ఫెక్షన్ కి గురి అవుతూ ఉండడం కనిపిస్తుంది. దీనికి కారణం వాళ్ళు అతిగా ట్రైనింగ్ లో పాల్గొనడం తప్ప మరొకటి కాదు. రోగ నిరోధక శక్తి వ్యవస్థను కుంగ దీసేది ఎక్సర్ సైజు లు కాదు. ఎక్సర్ సైజ్ లలో తీవ్రత అని గుర్తించాలి. ఎక్సర్ సైజ్ ల విషయం లో ఎప్పుడైనా మితాన్ని మితాన్ని పాటించడం మంచిది.
అయితే మితం అంటే ఎంత ?
వారం లో అయిదు రోజులు పాటు తడవకు 45 నిమిషాల చొప్పున చురుకుగా ఎక్సర్ సైజులు చేసే చేసే వాళ్ళను సరిపడా ఎక్సర్ సైజులు చేస్తున్న వారికింద తీసుకోవచ్చు. ఇలాంటి వారి యొక్క రక్తాన్ని ల్యాబ్ లో పరీక్షించి నప్పుడు అందులో ఇన్ఫెక్షన్ తో పోరాడే తెల్ల రక్త కణాలు ఉంటాయి. అవి చురుకుగా పనిచేస్తున్నట్లు వేల్లదియ్యింది. అమెరికాలో జరిగిన మరొక పరిశోదనలో అయిడ్స్ తాలూకు హెచ్ ఐ వి తో బాధ పడుతున్న వ్యక్తుల్ని పది వారాల పాటు సాధారణ ఎక్సర్ సైజ్ ప్రోగ్రాములలో పాల్గొనే టట్లుగా చేసినప్పుడు వాళ్ళ లో టి సెల్ కణాల సంఖ్య పెరిగి నట్లుగా వెల్లడి అయ్యింది. ( రోగ నిరోధక వ్యవస్థ లో ఈ టి సెల్ల్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి శరీరంలో రోగాలతో పోరాడే గుణాన్ని క్రమబద్దీకరించడమే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ ని పారద్రోలడానికి ఉపక రిస్తుంది. ఈ కణాల సాంఖ్య పడిపోవడం ఎయిడ్స్ వ్యాధి ప్రాధాన లక్ష్యం )
జలుబు ఫ్లూ ...
జలుబూ-ఫ్లూ లాంటి అంటూ వ్యాధులు గాలి లోని వైరస్ ల ద్వారా సోకుతాయి. మనకు ఇతరుల నుంచి చాలా త్వరగా సోకుతాయి. చాలా త్వరగా సంక్రమించే అంటూ వ్యాధులు ఇవి. ఇవి చలికాలం లో ఎక్కువగా సోకుతూ ఉంటాయి. ఇందుకు కారణం చలికాలం లో మనం తలుపులు అన్నీ వేసుకుని అందరం లోపలే ఉండి పోవడమే. దీనికి కారణం అఫీస్ లోగాని ఇళ్ళలో గాని ఒకరి గాలిని మరొకళ్ళు పీల్చుకుంటూ వైరస్ వ్యాప్తికి తోడ్పడు తూ ఉంటాము. ఇలాంటి రోజుల్లో కిటికీ తలుపులు అన్నీ తెరచి వుంచుకోవాలి గాలి వస్తూ పోతూ ఉంటె జలుబుఅంటుకోదని నిపుణులు సూచిస్తున్నారు.
తెల్ల రక్త కణాలు...
రోగ నిరోధక శక్తి యొక్క ప్రాధాన ఆయుదం . రక్తంలో ఉండే లెఉకాక్ సైక్లేస్ అనబడే తెల్ల రక్త కణాలు ఇవి శరీరంలోకి ప్రవేశించిన శత్రువును అంటే వైరస్ ,బాక్టీరియా కావచ్చు ,ఫంగి పరాసైట్ ఏదైనా కావచ్చు నిర్మూలించే ప్రయాత్నం చేస్తాయి. కొన్ని తెల్ల రక్త కణాలు శత్రువును చుట్టూ ముట్టి నాశనం చేయడానికి ప్రయత్నిస్తే మరికొన్ని ప్రత్యేకమైన యాంటీ బాడీస్ ని తయారుచేసి వాటి ద్వారా నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి.ఈ ప్రక్రియ గురించి ప్రారంభ లో చదివే ఉంటారు. లెఉకొసైట్స్ రక్త ప్రవాహం తో పాటు మన శరీర మంతా కలయ తిరుగుతూ సూక్ష్మాతి సూక్ష్మ మైన రక్త నాళాల ద్వారా శరీర కణాల లోకి ప్రవహించి. శత్రు నిర్మూలన కోసం గస్తీ తిరుగుతాయి. అవసరం లేనప్పుడు లింఫ్ గ్రంధులతో కనెక్ట్ అయి వుంటే లింఫ్ నాళా లలోకి చేరుకుంటాయి. మెడ మొల చంక వద్ద ఉండే ఈ లింఫ్ గ్రంధులు ఇన్ఫెక్షన్ కు గురి అయినప్పుడు ఉబ్బి గావడ బిళ్ళలు గజ్జల్లో బిళ్ళ కింద కనిపిస్తాయి.
రోగ నిరోధక శక్తిని పెంచుకునే మార్గాలు...
* వారానికి మూడు రోజులు 2౦ నిమిషాల పాటు ఎక్సర్ సైజ్ లు చేయాలి. స్ట్రెచ్ చేయడం. శరీరాన్ని బల పరిచే మిగత ఎక్సర్ సైజ్ లను కూడా మరకూడదు.
*ఎప్పుడూ మంచి మూడ్ లో ఉల్లాసంగా ఉండడం అలవాటు చేసుకోవాలి.
*రిలాక్సేషన్ టెక్నిక్ నేర్చుకోవాలి.
*ఎదో ఒక హాబీ ని అలవరచుకుని తరచుగా అందులో నిమగ్నం కావాలి.
*ప్రతి ఆరు వా రాలకి ఒక సారి కొద్ది రోజుల పాటు సెలవు తీసుకుని హాలిడే కింద ఎక్కడైనా సరదాగా గడపాలని సూచించారు.
*వారంలో ఒక రాత్రి అయినా త్వరగా పడుకోవాలి. బాగా అలిసిపోయి నప్పుడు ఇన్ఫెక్షన్ మనల్ని కమ్ము కుంటాయి. ఒత్తిళ్లలో ఉన్నప్పుడు ఎక్కువసేపు మేలుకుని ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. అందుకే అప్పుడప్పుడూ పడక మీద ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడం మంచిది.
*జ్వరం జలుబు ఫ్లూ లాంటివి వచ్చినప్పుడు తగ్గి తగ్గ గానే పనుల్లో పాల్గొన కూడదు అలా చేయడం వల్ల డిప్రెషన్ కొన్నాళ్ళ పాటు అలసట మిమ్మల్ని వేదిస్తాయి. దీనికారణంగా మళ్ళీ మీరు ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది.
*పొగ త్రాగ కూడదు. పొగ తాగే వాళ్ళలో న్యుమోనియా,ఫ్లూ లాంటి వ్యాధులూ,దగ్గు, జలుబు, లాంటి వ్యాధులూ శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ లూ అంటుకునే అవకాసం ఉంది. పొగ తాగే అల వాటు ఉన్న వాళ్ళు మిగిలిన వారికంటే సి విటమిన్ కొంచం అంటే 4౦ % ఎక్కువే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అనారోగ్యం పై మూడ్స్ ప్రభావం...
సున్నితమైన స్వభావాలు అంటే వోత్తిళ్ళకు తేలికగా లొంగి పోయే వాళ్ళ ను జలుబు జ్వరాలు ఎప్పుడు పడితే అప్పుడు తేలికగా పీడిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తూనే ఉంటాము.
*రోగ నిరోధక వ్యవస్థ మీద మన మూడ్స్ ప్రభావం కూడా చెప్పుకోదగ్గ రీతిలోనే వుంటుంది. ఎప్పుడూ కోపంతో చిరాకుతో వుండే వాళ్ళు తనకు తాను ప్రాముఖ్యతను ఫీలయ్యే వ్యక్తులు మాటి మాటికీ జ్వరం జలుబూ బారిన పడుతున్న వాళ్ళు టేక్షన్ ని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా జ్వరం బారిన పడతారు. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే వాళ్ళు పోజిటివ్ గా ఉండే వాళ్ళు ప్రతి విషయాన్ని తేలికగా తీసుకునే వాళ్ళు చీదతమనేది ఎరగకుండా ఆరోగ్యంగా ఉంటారు. అదే విధంగా డిప్రెషన్ తో వుండే వాళ్ళు గుండె జబ్బులకు లోనవుతున్నారు. ఎమోషన్స్ ను అణు చుకుంటూ పైకి ప్రశాంత చిత్తం తో కనపడడానికి చూసే వాళ్ళు క్యాన్సర్ బారిన పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉనాయని తేల్చారు.
పోషక ఆహారం...
రోగాలు రాకుండా ఉండడానికి అంటే రోగనిరోదక వ్యవస్థ పటిష్ట పడడానికి అన్నిటిలోకి శక్తి వంతమైనది సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి.సరైన ఆహారాన్ని తీసుకోక పోవడం వల్ల రకరకాల జబ్బులు మన శరీరాన్ని లోన్గాదీసుకుంటాయి.గుండె జబ్బులు, పక్ష వాతం బ్రెస్ట్ క్యాన్సర్, పేగుల క్యాన్సర్, దంత క్షయం, డయాబెటిస్, మల బద్ధకం ఒస్టియో ప్రోరోసిస్, మొదలైన వన్నీ అయితే పోషక ఆహారాన్ని తీసుకోవడం వల్ల నిజంగా రోగ నిరోధక వ్యవస్థ బల పడుతుందా.పోషకాహార లోపం వల్ల రోగనిరోదక వ్యవస్థ బలహీన పడుతున్నది అన్నది మాత్రం ఖచ్చితంగా నిజం.
హేతుబడ్డ మైన రీతిలో ప్రోటీన్లు తీసుకోవడం అవసరమే గాని దానికి విటమిన్లు, మినరల్స్, కలిపినంత మాత్రాన రోగనిరోదక శక్తి పెరుగుతుందని అనుకోవడం మాత్రం సందేహాస్పదం. అంటున్నారు ఆక్స్ఫర్డ్ లోని జాన్ రాడ్క్లిఫ్ హాస్పిటల్కు చెందిన కన్సల్టెంట్ ఇమ్యునలజిస్ట్ డాక్టర్ గ్రహం బర్డ్. అయితే గుండె జబ్బులు క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి యాంటి ఆక్సిడెంట్ విటమిన్లు సి ఇ బీటా కేరొటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం అని అందరూ ఒపుకుంటారు. బలమైన రోగ నిరోధక వ్యవస్త కు కొన్ని ఖనిజ లవణాలు కూడా అవసరమే.