అనారోగ్యంతో శారీరక మానసిక ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయన్న అంశాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఎందుకంటే శారీరకంగా బలంగా ఉండడం ముఖ్యం  దాంతో పాటు మానసిక దృఢత్వం కూడా అవసరం. దీనికి తోడు ఆధ్యాత్మిక భావన ఉన్నపుడే వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యం పొందగలడు. అయితే ఆధునిక సమాజంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఒక మాత్ర ఉంటె చాలు లేదా ఆసుపత్రిలో చేరితే చాలు అనుకోవడం అది ఒక ఉపసమనం కోసమే అన్న విషయం  గ్రహించాలి. ఆసుపత్రికి  వెళితే  మందు వేసుకుంటే  తగ్గి పోతుంది అన్నది కేవలం విశ్వాసం మాత్రమే. మనకు మనపై విశ్వాశ్వనీయత లేనప్పుడు మాత్రమే దీర్ఘ ఆలోచనకు గురి అవుతారు. ఒత్తిడికి గురిఅవుతారు. అదే అనారోగ్యానికి దారి తీస్తుంది అన్నది సత్యం శారీరకంగా శ్రమించండి, మానసిక దృడత్వం కలిగి ఉండడం ముఖ్యం, ఆధ్యాత్మిక భావన ద్వారా స్థితి గతులను తెలుసుకోడం తదనుగుణంగా ప్రవర్తించడం వ్యవహరించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్న భావన                                
  
సాత్విక ఆహారం, సహజమైన ఆహరం, పోపుష్టికా ఆహారం  తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యానికి  ఒక పునాది మాత్రమే. ఉదాహరణకు ---  సరైన పునాది  ఉన్నప్పుడే కట్టడం పటిష్టంగా ఉంటుంది. కొన్ని తరాలు నిలబడుతుంది. లేదంటే కూలిపోతుంది. అందుకే పునాదిలేని ఆహారం అంటే సాత్విక ఆహరం కాని మరో ఆహరం తీసుకుంటే ఆరోగ్యం చిన్నాభిన్నమౌతుంది. సంపూర్ణ ఆహరం తీసుకుంటే పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండగలమన్నది  దీని అర్ధం.             

ఉన్నత జీవన ప్రమాణాల్లో జీవించాలన్నా విజయం సాధించడానికి మూలాధారం సంపూర్ణ ఆరోగ్యం మాత్రమే అన్న విషయం తెలుసుకోవాలి. దీర్ఘ కాలంగా ఆరోగ్యంగా ఉండాలి, శరీరం దృడంగా ఉండాలి, అందరు అనుకుంటున్నట్టు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలంటే మీరు సరైన ఆహరం తీసుకోవాలి అప్పుడే మీరు జీవించడం సాధ్యం. సమయ పాలన,సరైన, సహజమైన ప్రాకృతిక ఆహారం తీసుకోవాలి, సంప్రదాయాన్ని పాటిస్తూ, జ్ఞానాన్ని పొందడం ముఖ్యం. దీనికి మరోమార్గం లేదన్నది వాస్తవం.                                                                                                                  

ఆహారానికి ఆరోగ్యానికి సంబంధం ఉన్నదనే  ప్రగాఢ విశ్వాసం నమ్మకం ఉండాలి. ఆహారాన్ని  సహజమైన ప్రాకృతిక సేంద్రియ పద్ధతులలోనే పండించాలి. మనం కృత్రిమ రసాయనాల ద్వారా పండించిన ఆహారంతో పోలిస్తే ప్రాకృతిక వ్యవాసాయం ద్వారా పండించిన ఆహారంలో పోషక విలువలు ఉన్నాయన్న విషయం గ్రహించమని నిపుణులు చెపుతున్నారు. రసాయనాల ద్వారా పండించిన పంట, అనారోగ్యానికి కారణమౌతుందనేది కూడా నిజం. ఆదిశగా సేంద్రియ వ్యవసాయంతో పండిన కూరాగాయాలలో పోషక విలువలు ఉండడంతో పాటు, స్వదేశీ ఆవుల పోషణ, సంరక్షణతో చేస్తున్న వ్యవసాయ పద్ధతుల తో మంచిఉత్పత్తులు సాధించవచ్చని, అది ఆచరణ సాధ్యమని తెలుస్తోంది .                                                                                                                                  

పంచ సూత్ర పర్ఫెక్ట్ హెల్త్
ఆధునిక సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో ఎన్నో రకాల దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు గొప్ప, బీదా అన్నతేడా లేకుండా అన్నివయసుల వాళ్ళని  వేధిస్తున్నాయి అన్నది వాస్తవం. ఇందులో కొన్ని వ్యాధులను నేటికీ నిరోధించలేని పరిస్థితి. ఆరోగ్యం అంశాలపై ఎన్నో పద్ధతులు చూసాం. అమలు లోకి వచ్చాయి. ప్రివెన్షన్ రివర్సల్ రెండిటిని అనుసంధానం చేస్తూ అటు సాంప్రదాయమ లో ఉన్నా అనుభవాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన పంచ సూత్ర ఉత్తమమైనదని చెప్పవచ్చు. ఆయుర్వేదం మరియు ఆధునిక న్యుట్రా జనో మిక్స్ ను రూపొందించినట్లు నిపుణులు వివరించారు. ఆహారం ద్వారా మాత్రమే ఆరోగ్యం సాధ్యం. ఆహరం ప్రాకృతిక మైనది సహజమైనది పూర్తిగా పోషకవిలువలు న్యూట్రీషియన్స్ ఉండాలి. పంచసూత్ర ద్వారా న్యూట్రీషియన్స్ ద్వారా దీర్ఘ కాళిక వ్యాధులను నిలువరించడం, రివర్సల్ పద్ధతి ద్వారా రోగ నిరోధక శక్తి పెంచవచ్చునని తద్వారాదీర్ఘ కలం జీవించి ఉండవచ్చని అదే పంచసూత్ర విధానమని అన్నారు.                                                                              

సాంప్రదాయ వైద్యం విధానం పద్దతులపై పూర్తి అవగాహనా ఉండడంతో పాటు, ఆహారం న్యూట్రీషియన్స్ ద్వారా ఆరోగ్యం అంశంపై పరిశోధనలు చేపట్టి  రోగాన్ని నిలువరించడం రివర్సల్ పద్దతిలో జీవన శైలి మార్పుకు దోహదం చేస్తుందని డాక్టర్ మురళి ఆచార్య వివరించారు. ఈమేరకు  వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పంచ సూత్రా పర్ఫెక్ట్ హెల్హ్ పై అవగాహన కారక్రమాలు చేపట్టినట్లు మురళి ఆచార్య వెల్లడించారు. పంచసూత్ర ద్వారా వేలాది మంది లబ్ది పొందారని అన్నారు. పంచసూత్ర పర్ఫెక్ట్ హెల్త్ పద్దతుల ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటూ దీర్ఘ కాలిక సమస్యలనుంచి బయట పడగలరని అభిప్రాయం పడ్డారు.   
   

ఆరోగ్యం కేవలం శరీరానికి సంబందించినది మాత్రమే కాదు. మానసిక ఆధ్యాత్మిక అంశాలు మన జీవితంలో ముడి పడి ఉన్నాయన్నది నిజం. మనశరీరం సహజంగా ఐదురకాల ఎలిమెంట్స్ తో తయారు చేయబడింది. కొన్ని పద్దతుల ద్వారా ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోవచ్చ్జు. అనారోగ్యాన్నినిలుపుదల చేయడం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉందన్నది వాస్తవం. సహజంగా మన శరీరంలో దానికి అదే అనారోగ్యం రాకుండా నిరోధించుకునే శక్తి లేదా దానికి ఆడే హీలింగ్ చేసుకునే సెల్ఫ్ మెకానిజం ఉంటుంది. చిన్న చిన్న న్యూట్రీషియన్ కొరత ఏర్పడడం టాక్సీ కేన్స్ శరీరంలో వృద్ధి చెందుతాయి. ఇవే దీర్ఘ కాలిక వ్యాధులకు కారణం అవుతున్నాయి. మనం కనక సహజంగా లభించే పౌష్టికాహారం  తీసుకోడం సహజమైన జీవన శైలిని అనుసరించడం ద్వారా ఆధునికంగా వస్తున్న అనారోగ్య సమస్యలను తిప్పి కొట్టవచ్చు. ఎలా తిప్పి కొట్ట వచ్చు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ సహజంగా మనలో ఉన్న సాజమైన హీలింగ్ ఎబిలిటీ పెంచడం ద్వారా అనారోగ్యాన్ని తిప్పి కొట్టవచ్చు. ఎదుర్కోవచ్చు .  పంచసూత్ర ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోడం సహజమైన పౌష్టిక ఆహార లోపాన్ని నిరోధించడం ముఖ్యం. ఎవరైనా సరే పంచసూత్రాలను అనుసరిస్తే  సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడం అసాధ్యం కాదు. ఆరోగ్యాన్ని శరీర ధారుడ్యాన్ని సాధించడం మనలక్ష్యం. మనబాధ్యత. తరువాతి తరాన్ని మార్గ నిర్దేశం  చేయడం ద్వారా పూర్తి గా సహజ సిద్ధమైన విధానాల ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యవంతులను చేయగలమన్న విశ్వాసం ఉంది.